India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తన బలం శ్రీకాకుళం, తన సర్వం శ్రీకాకుళం, తన మాట తీరుతో దిల్లీలో తనదైన శైలితో దట్ ఇస్ రామ్మోహన్ నాయుడు అనిపించుకున్నాడని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. విజయవాడలో మంగళవారం సాయంత్రం MP అచ్చెన్నను కలిసిన అనంతరం కొత్తగా ఏర్పడిన కాబినెట్‌లో పౌర విమానాల శాఖ మంత్రిగా నియమితులైన ఎర్రన్న పేరును రామ్మోహన్ నిలబెట్టారని అన్నారు.
జిల్లాలో మహిళల భద్రతకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. మహిళలను వేధించే వారిపై ప్రస్తుతం చట్టాలు కఠినంగా ఉన్నాయన్నారు. ప్రజలు ఎమర్జెన్సీ నెంబర్లను, 100, 1091, 112, 182, వినియోగించుకోవాలని జిల్లా పోలీసు అధికారులు బుధవారం తెలిపారు. మహిళలు ముఖ్యంగా యువతులపై జరిగే సైబర్ నేరాలపై ఫిర్యాదులు స్వీకరించేందుకు సైబర్ మిత్ర పేరిట వాట్సాప్ నెంబర్ 9121211100 ను సంప్రదించాలని ఎస్పీ జి.ఆర్.రాధిక అన్నారు.
అమరావతిలో జరిగిన సీఎం చంద్రబాబు, మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో శ్రీకాకుళం ఎంపీ, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ వెళ్తుండగా.. రామ్మోహన్ ఆయనకు కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా మోదీ రామ్మోహన్ భుజం తట్టారు.
టెక్కలి ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు 2వసారి మంత్రి బాధ్యతలు చేపట్టనున్నారు. 2014లో అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర కార్మిక, బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా వ్యవహరించిన ఆయనకు తాజాగా ఏపీ కేబినెట్‌లో మరోసారి చోటదక్కింది. పార్టీలో కీలకంగా వ్యవహరించిన అచ్చెన్నాయుడు మంత్రి కావడంతో జిల్లా టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర కేబినెట్లో ఉమ్మడి జిల్లాకు రెండు మంత్రి పదవులు వస్తాయని ఆశించిన జిల్లా నేతలకు నిరాశ ఎదురైంది. అచ్చెన్నతో పాటు మరో ఎమ్మెల్యేకు మంత్రిగా అవకాశం వస్తుందని భావించినప్పటికీ పలు సమీకరణాలతో ఆ ఛాన్స్ రాలేదు. అచ్చెన్నను మాత్రమే మరోసారి అమాత్య యోగం వరించింది. మంత్రి పదవి రేసులో హ్యాట్రిక్ విజేత బెందాళం అశోక్, కోండ్రు మురళి, కూన రవికుమార్, గౌతు శిరీష పేర్లు వినిపించడం విదితమే.
టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు రాష్ట్ర మంత్రి కాగా.. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు కేంద్రమంత్రిగా ఇప్పటికే ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీ కేబినెట్లో అచ్చెన్నాయుడుకు స్థానం లభించడంతో ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఒకే కుటుంబంలో బాబాయ్ రాష్ట్ర మంత్రిగా, అబ్బాయి కేంద్రమంత్రిగా వ్యవహరించనుండటం విశేషం. కీలక పదవుల్లో ఉన్న వీరిద్దరూ జిల్లాను అభివృద్ధి చేయాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.
సార్వత్రిక ఎన్నికలలో ఘోర ఓటమి పాలైన వైసిపి పార్టీ శ్రేణులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యే అభ్యర్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మ్మెల్సీ నర్తు రామారావు మాట్లాడుతూ.. ఎన్నికలలో ఓడిపోయినంత మాత్రాన ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన జగన్మోహన్ రెడ్డికి చావలేదని ప్రజా సమస్యల పట్ల ఆయన పోరాడుతారని తెలియజేశారు.
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లానుంచి ఒక్కరికే కేబినెట్లో చోటుదక్కింది. టెక్కలి నుంచి వరుసగా మూడుసార్లు గెలిచిన సీనియర్ నేత కింజరాపు అచ్చెన్నాయుడుకి మరోసారి మంత్రి పదవి వరించింది. మొత్తం 24 మంది మంత్రుల జాబితాను మంగళవారం అర్ధరాత్రి దాటాక విడుదల చేయగా.. జనసేనకు 3, బీజేపీకి ఒకటి కేటాయించారు. కాగా రామ్మోహన్ నాయుడికి కేంద్రమంత్రి పదవి దక్కడం తెలిసిందే. దీంతో వారికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
చంద్రబాబు ప్రమాణ స్వీకార నేపథ్యంలో కోటబొమ్మాలిలోని పలు ప్రభుత్వ కార్యాలయాలు విద్యుత్ కాంతుల వెలుగులీనుతున్నాయి. స్థానిక మండల పరిషత్, రెవెన్యూ, ఐసీడీఎస్, గ్రామ సచివాలయం ఇతర ప్రభుత్వ కార్యాలయాలు విద్యుత్ దీపాలంకరణతో కనిపించాయి. ఏపీ సీఎంగా చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకారం నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాల్లో సందడి వాతావరణం నెలకొంది.
ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన ఏపీ ఈఏపీ సెట్-2024 ఎంట్రన్స్ ఫలితాల్లో శ్రీకాకుళం పట్టణం ఇందిరా నగర్ కాలనీ ప్రాంతానికి చెందిన మావూరి జస్విత్ 84వ ర్యాంకును సాధించాడు. ఇంజనీరింగ్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలో జస్విత్ 87.19 శాతం మార్కులను సాధించి తన ప్రతిభను కనబరిచాడు. మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని తండ్రి ఈశ్వర్ నర్సింగ్ తోపాటు కుటుంబ సభ్యులు స్థానికులు అభినందించారు.
Sorry, no posts matched your criteria.