India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
టెక్కలిలో పలు ప్రభుత్వ కార్యాలయాలకు మంగళవారం అధికారులు విద్యుత్ దీపాలంకరణ చేపట్టారు. స్థానిక ఎన్ఆర్ఈజీఎస్, వెలుగు కార్యాలయాలకు అధికారులు విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు బుధవారం ప్రమాణస్వీకారం చేస్తున్న నేపధ్యంలో కార్యాలయాలను విద్యుత్ లైటింగ్ తో అలంకరించినట్లు అధికారులు తెలిపారు. ప్రమాణస్వీకారం లైవ్ కార్యక్రమాన్ని టెక్కలిలో ఏర్పాటు చేయనున్నట్లు టెక్కలి ఎంపీడీఓ వెల్లదించారు
సీఎంగా చంద్రబాబు బుధవారం ప్రమాణస్వీకారం చేయనుండటంతో రంగు రంగుల విద్యుత్ దీపాలతో శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయాన్ని అలంకరించారు. కలెక్టరేట్‌తో పాటు జిల్లాలోని అన్ని ముఖ్య అధికార కార్యాలయాలన్నీ విద్యుత్ వెలుగులతో దగదగలాడుతున్నాయి. కార్యాలయాలతో పాటు అన్ని తాహసిల్దార్, మండల అభివృద్ధి అధికారి కార్యాలయాలు, ఇతర ప్రభుత్వ అధికారుల కార్యాలయాలను అలంకరించారు.
టెక్కలికి చెందిన మల్లిపెద్ది ప్రణవ్ సాయి అనే విద్యార్థికి మంగళవారం విడుదలైన ఈఏపీసెట్ ఫలితాల్లో రాష్ట్రస్థాయి 12వ ర్యాంకు సాధించి ప్రతిభ కనబరిచాడు. తూర్పుగోదావరి జిల్లాలోని ఒక ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేసిన ప్రణవ్ సాయి ఇటీవల విడుదల అయిన తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో కూడా రాష్ట్రస్థాయి 62వ ర్యాంకు, నీట్ లో ఆల్ ఇండియా 430వ ర్యాంకు సాధించి ప్రతిభ కనబరిచాడు. విద్యార్థిని స్థానికులు అభినందించారు.
టెక్కలి సమీపంలో జరుగుతున్న అండర్ 23 నార్త్ జోన్ క్రికెట్ పోటీల్లో భాగంగా మొదటి రోజు శ్రీకాకుళం-విశాఖ జట్లు మధ్య మ్యాచ్ జరగ్గా మొదట బ్యాటింగ్ చేసిన విశాఖ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 273 పరుగులు చేయగా తదుపరి 274 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన శ్రీకాకుళం జట్టు 31.1 ఓవర్లలో 138 పరుగులకే ఆలౌట్ కావడంతో మొదటిరోజు విశాఖ జట్టు గెలుపొందింది. బుధవారం విజయనగరం-విశాఖ మధ్య మ్యాచ్ జరగనుంది.
ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం టెక్కలి సమీపంలో అండర్-23 నార్త్ జోన్ క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయి. మంగళవారం నుంచి ప్రారంభమైన పోటీలు ఈనెల 16వ తేదీ వరకు కొనసాగనున్నాయి. మొదటిరోజు క్రికెట్ పోటీలను ఇంజినీరింగ్ కళాశాల డైరెక్టర్ డా.వి.వి నాగేశ్వరరావు ప్రారంభించారు. మొదటి రోజు శ్రీకాకుళం-విశాఖ జట్లు మధ్య మ్యాచ్ జరుగుతున్నట్లు ఆర్గనైజింగ్ కన్వీనర్ ఎన్. లాల్ బహుదూర్ తెలిపారు.
శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా వేసవికాలం పూర్తయినప్పటికీ ఎండలు దంచి కొడుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షానికి వాతావరణం కొంతమేర చల్లబడినా.. ప్రస్తుతం ఎండలు మళ్లీ భగ్గుమంటున్నాయి. ఈ ఏడాది అత్యధికంగా 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైన విషయం తెలిసిందే. మంగళవారం 12 గంటల సమయానికి 34 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవ్వడంతో ఉక్కపోత మళ్లీ మొదలైంది. వృద్ధులు, చిన్నపిల్లలు ఎండ వేడికి చాలా ఇబ్బంది పడుతున్నారు.
ప్రజా పంపిణీలో కీలకంగా పనిచేసిన వాలంటీర్ల పరిస్థితి ప్రశ్రార్థకమైంది. ఎన్నికల ముందు రాష్ట్రవ్యాప్తంగా 1,08,273 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. అందులో శ్రీకాకుళం జిల్లాలో 12,399 మంది పని చేస్తుండగా.. అందులో 8,784 మంది రాజీనామా చేశారు. వీరిని తిరిగి విధుల్లో చేర్చుకునే పరిస్థితి కనపడటం లేదు. మిగిలిన 3,574 మంది విధుల్లోనే ఉన్నారు. చంద్రబాబు రూ.10వేలు జీతం ఇస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.
కేంద్రంలో రామ్మోహన్ నాయుడు కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రిగా నియమితులు కావడంతో భోగాపురం మహర్దశ పటనుందని జిల్లా ప్రజలు చర్చించుకుంటున్నారు. విశాఖ భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని 2014లో చంద్రబాబు విశాఖ-విజయనగరం మధ్య భోగాపురం ఎయిర్‌పోర్ట్ నిర్మించాలని నిర్ణయించారు. గత సర్కార్ నిర్మాణంలో తీవ్ర జాప్యం చేసింది. ప్రస్తుతం కేంద్ర,రాష్ట్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వమే ఉండటంతో ప్రజల్లో ఆశలు చిగురించాయి.
ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలో బీటెక్- మెకానికల్ ఇంజినీరింగ్( 2020- 21 నుంచి అడ్మిషన్ పొందినవారు) కోర్సు సెకండియర్ ఫస్ట్ సెమిస్టర్ స్పెషల్ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. ఈ నెల 19, 20, 21 తేదీల్లో ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటలవరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. సబ్జెక్టువారీగా టైంటేబుల్ పూర్తి వివరాలకు విద్యార్థులు https://www.andhrauniversity.edu.in/ అధికారిక వెబ్‌సైట్ చూడవచ్చు.
ఈనెల 12వ తేదీన ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు గన్నవరంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి కూటమి నాయకులు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. నాయకులు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. కూటమి తరఫున 31 ఆర్టిసీ ఎక్స్‌ప్రెస్, 9 ఆల్ట్రా డీలక్స్ కలిపి మొత్తం 40 బస్సులు జిల్లా నుంచి గన్నవరంకి వెళ్లనున్నాయి. ఈ బస్సులు మంగళవారం రాత్రి బయలుదేరి బుధవారం ఉదయానికి చేరుకుంటాయి.
Sorry, no posts matched your criteria.