India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంకు సాధించలేకపోవడంతో ఓ విద్యార్థి ప్రాణం తీసుకున్నాడు. రాజాం పట్టణానికి చెందిన ఓ విద్యార్థి(17) చదువు కోసం తల్లిదండ్రులు విశాఖపట్నం నివాసం మార్చారు. బాలుడు అక్కడున్న ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ చదివాడు.అన్ని సబ్జెక్టుల్లోనూ మంచి మార్కులు సాధించాడు. అడ్వాన్స్డ్ రాసినా ఐఐటీలో సీటు రాకపోవడంతో ఎంవీపీ కాలనీలో ఉన్న భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
సౌత్ ఈస్టర్న్ రైల్వే చక్రధర్ పూర్ డివిజన్ పరిధిలో భద్రత పరమైన పనులు చేపడుతున్న కారణంగా పలు రైళ్లను రద్దు చేసినట్లు వాల్టేర్ రైల్వే డివిజన్ డీసీఎం సందీప్ తెలిపారు. రూర్కెలా-జగదల్పూర్-రూర్కెలా ఇంటర్ సీటీ రైళ్లను ఈనెల 12వ తేదీన రద్దు చేసినట్లు తెలిపారు. అలాగే రూర్కెలా-గుణపూర్-రూర్కెలా ఎక్స్ ప్రెస్ రైళ్లను ఈనెల 12న రద్దు చేసినట్లు తెలిపారు.
ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలో బీటెక్( 2020- 21 నుంచి అడ్మిషన్ పొందినవారు) కోర్సు ఫస్టియర్ ఫస్ట్ సెమిస్టర్ స్పెషల్ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. ఈ నెల 13, 14, 15, 18 తేదీల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. సబ్జెక్టువారీగా టైం టేబుల్ పూర్తి వివరాలకు విద్యార్థులు www.andhrauniversity.edu.in/ అధికారిక వెబ్‌సైట్ చూడవచ్చు.
VZM జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ పనులు ఇప్పటికే జరుగుతుండగా .. పక్క జిల్లా అయిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన కింజరాపు రామ్మోహన్ నాయుడికి సివిల్ ఏవియేషన్ (పౌర విమానయాన ) మంత్రిత్వ శాఖను కేంద్ర ప్రభుత్వం కేటాయించడంతో ఈ ఎయిర్పోర్ట్ పనులు మరింత ఊపు అందుకోనున్నాయని ఉత్తరాంధ్ర ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి. దీంతో పాటుగా నిరుద్యోగ యువతకు ఉద్యోగం కలనెరవేరబోతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇచ్ఛాపురం మున్సిపాలిటీలో స్థానిక బస్టాండ్ కూడలి వద్ద ఎమ్మెల్యే బెందాళం అశోక్ భారీ కటౌట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 2024 సార్వత్రిక ఎన్నికలో గెలుపొంది మూడోసారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ఈ 40 అడుగుల ఎత్తు గల భారీ కటౌట్ ఏర్పాటు చేసినట్లు అభిమాని తెలిపారు. ఈ సారి తమ అభిమాన నాయకుడికి మంత్రి పదవి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
చిన్న వయసులోనే రాజకీయాల్లోకి ప్రవేశించి ఎంపీగా మూడు పర్యాయాలు సిక్కోలు ప్రజల మన్ననలతో విజయం సాధించిన రామ్మోహన్ నాయుడుకు కేంద్రమంత్రి పదవితో జిల్లా అభివృద్ధికి దోహదపడుతుందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి స్పష్టం చేశారు. నరసన్నపేటలో ఆయన సోమవారం మాట్లాడుతూ.. జాతీయ రాజకీయాల్లో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఆయన కేంద్రమంత్రి పదవి చేపట్టడంతో జిల్లాకు మహర్దశ వస్తుందని పేర్కొన్నారు.
వీరఘట్టం బీసీ కాలనీకి చెందిన లింగం సరోజిని(54) కాశీ యాత్రకు వెళ్లి ఆ దేవుని సన్నిదానంలో సోమవారం కన్నుమూశారు. ఈనెల 5న వీరఘట్టంకు చెందిన కొందరు మహిళలతో కాశి యాత్రకు బయలుదేరి వెళ్లారు. అక్కడ నుంచి అయోధ్య, ప్రయోగరాజ్ తదితర యాత్రలు ముగించుకుని కాశీలో బస చేసిన హోటల్లో ఆమె మృతి చెందారు. కాశీలోని గంగానది ఒడ్డునే ఆమెకు దహన సంస్కారాలు చేసేందుకు ఆమె కుటుంబ సభ్యులు వీరఘట్టం నుంచి బయలుదేరి వెళ్లారు.
గుంటూరు జిల్లా బాపట్లలో ఈనెల 15, 16 తేదీల్లో జరగనున్న రగ్బీ రాష్ట్రస్థాయి పోటీలకు సోమవారం టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జిల్లా జట్టు ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. రగ్బీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి పొన్నాడ పార్వతీశం, ఆర్గనైజింగ్ సెక్రటరీ నారాయణ పర్యవేక్షణలో ఎంపికలు చేపట్టారు. రగ్బీ జిల్లా జట్టుకు బాలురు, బాలికలు కలిపి 24 మందిని ఎంపిక చేశారు.
కంచిలి మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఛైర్మన్ గుమ్మడి రామదాసు సోమవారం రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన సహకార సంఘం అధికారులకు రాజీనామా పత్రం అందజేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఛైర్మన్‌గా ఎన్నికైన రామదాసు.. ప్రస్తుతం కూటమి గెలవడంతో పదవి నుంచి తప్పుకున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడనుండటంతో రాజీనామా అందజేసినట్లు ఆయన తెలిపారు.
కంచిలి మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఛైర్మన్ గుమ్మడి రామదాసు సోమవారం రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన సహకార సంఘం అధికారులకు రాజీనామా పత్రం అందజేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఛైర్మన్‌గా ఎన్నికైన రామదాసు.. ప్రస్తుతం కూటమి గెలవడం పదవి నుంచి తప్పుకున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడనుండటంతో రాజీనామా అందజేసినట్లు ఆయన తెలిపారు.
Sorry, no posts matched your criteria.