Srikakulam

News June 10, 2024

ట్రెండింగ్‌లో శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు

image

కేంద్రమంత్రిగా ఆదివారం రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణస్వీకారం చేసిన శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు ట్విటర్‌లో ట్రెండవుతున్నారు. నరేంద్రమోదీ క్యాబినెట్‌లో సముచిత స్థానం పొందిన ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలుపుతుండటంతో Congratulations Anna అనే కీవర్డ్ ట్విటర్‌లో ట్రెండవుతోంది. వందల సంఖ్యలో నెటిజన్లు రామ్మోహన్‌ను అభినందిస్తూ ఈ మేరకు ట్విటర్‌లో పోస్టులు పెడుతున్నారు.

News June 10, 2024

శ్రీకాకుళం: ఈనెల 16 నుంచి మత్స్యకారుల వేట

image

గత రెండు నెలలుగా సముద్రంలో చేపలు గుడ్లు పెట్టే సమయం కావడంతో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా మత్స్యకారులు వేట నిషేధించిన విషయం తెలిసిందే. గడువు ముగియడంతో ఈ నెల 16వ తేదీ నుంచి మళ్లీ సముద్రంలో వేట ప్రారంభించనున్నారు. ఈ మేరకు అధికారులు మత్స్యకారులకు ఆదేశాలు జారీ చేశారు.

News June 10, 2024

నేడే ‘కల్కి’ ట్రైలర్.. శ్రీకాకుళంలో థియేటర్లు ఇవే

image

ప్రభాస్‌ అభిమానులు‌ ఎంతో‌ ఆతృతగా ఎదురుచూస్తోన్న ‘కల్కి 2898 AD’ మూవీ ట్రైలర్‌ నేడు విడుదలకానుంది. అభిమానుల కోసం శ్రీకాకుళం జిల్లాలోని పలు థియేటర్లలో‌ సోమవారం సాయంత్రం 6 గంటలకు ట్రైలర్‌ విడుదల చేస్తున్నారు. పలాస- హరిశంకర్, పాలకొండ- రామ కళామందిర్, రాజాం- అప్సర, శ్రీకాకుళం- సరస్వతి మహల్, SVC రామలక్ష్మణ థియేటర్‌లలో‌ ట్రైలర్‌ స్క్రీనింగ్ చేస్తారు. SHARE IT..

News June 9, 2024

రామ్మోహన్‌‌కు మాజీ ఎంపీ గల్లా అభినందనలు 

image

కేంద్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌కు గుంటూరు మాజీ ఎంపీ గల్లా జయదేవ్ అభినందనలు తెలిపారు. ‘నా స్నేహితుడు రామ్మోహన్‌కు అభినందనలు. రామ్మోహన్ చిత్తశుద్ధి, నిరాడంబరత దేశాభివృద్ధికి మూలధనం వంటింది. కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో శుభాకాంక్షలు’ అంటూ గల్లా Xలో పోస్ట్ చేశారు.

News June 9, 2024

2014-2024 వరకు.. రామ్మోహన్ ఒక్కరే..

image

టీడీపీ నుంచి 2014, 2019, 2024 ఎన్నికల్లో వరుసగా MPగా గెలిచిన ఏకైక నాయకుడు రామ్మోహన్ నాయుడు. 2014లో రామ్మోహన్‌తో పాటు జయదేవ్(గుంటూరు), కేసినేని నాని (విజయవాడ) గెలిచారు. 2019లోనూ వీరు ముగ్గురు విజయం సాధించారు. తాజా ఎన్నికల్లో జయదేవ్ పోటీ నుంచి తప్పుకోగా.. నాని విజయవాడలో వైసీపీ నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. దీంతో గత 3 లోక్‌సభలలో టీడీపీ తరఫున గెలిచిన ఏకైక ఎంపీగా రామ్మోహన్ నిలిచారు.

News June 9, 2024

శ్రీకాకుళం: పార్ట్ టైం జాబ్ కాదు.. ఫుల్ టైం ఫ్రాడ్

image

జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 5 నెలల్లోనే 1022 సైబర్ ఫ్రాడ్ ఫిర్యాదులు రాగా.. అందులో సుమారు 560 వరకు ఆన్లైన్ పార్ట్ టైం జాబ్ ఫ్రాడ్ లే ఉన్నాయని అధికారులు తెలిపారు. యువత బలహీనతలు గ్రహించి సైబర్ నేరగాళ్లు ఏ విధంగా మోసగిస్తున్నారో ఇట్టే అర్థమవుతుంది అన్నారు. ఇలాంటి ఆన్ లైన్ సైట్ల ప్రకటనల జోలికి వెళ్ళి డబ్బులు పోగొట్టుకోవొద్దని .. అప్రమత్తంగా ఉండాలని పోలీస్ అధికారులు సూచిస్తున్నారు.

News June 9, 2024

SKLM: వైసీపీ కార్యకర్తలు దాడి చేశారంటూ ఫిర్యాదు

image

టెక్కలి మండలం బొప్పాయిపురం పంచాయతీ విక్రంపురం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త సుంకరి గురువులుపై అదే గ్రామానికి చెందిన మక్క ఈశ్వరరావుతో పాటు మరో ఇద్దరు దాడి చేసి గాయపరిచినట్లు బాధితుడు శనివారం టెక్కలి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గతంలో జరిగిన ఒక విషయంలో తాజాగా మాటా మాటా పెరగడంతో గురువులుపై దాడి చేసినట్లు అందులో  పేర్కొన్నాడు. ఘటనపై టెక్కలి ఎస్ఐ లక్ష్మీ కేసు నమోదు చేశారు.

News June 9, 2024

ఎచ్చెర్ల: సజావుగా ఏపీ ఎడ్ సెట్ పరీక్షలు

image

జిల్లాలో నాలుగు కేంద్రాల్లో ఏపీ ఎడ్ సెట్ -2024 పరీక్షలు శనివారం ప్రశాంతంగా జరిగాయి. జిల్లా నుంచి 992 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 876 మంది హాజరయ్యారు. 116 మంది గైర్హాజరయ్యారు. నరసన్నపేటలోని కోర్ టెక్నాలజీస్ పరీక్ష కేంద్రంలో 330 మందికి 295 మంది, టెక్కలి ఐతం కళాశాలలో 302 మందికి 278 మంది, చిలకపాలెంలోని శివాని ఇంజనీరింగ్ కాలేజీలో 180 మందికి 153 మంది, వెంకటేశ్వరలో 180మందికి 150మంది హాజరయ్యారు.

News June 9, 2024

శ్రీకాకుళంలో కూటమికి జైకొట్టిన ఉద్యోగులు

image

శ్రీకాకుళం లోక్‌సభ స్థానంలో 27,041 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. అందులో 19,827(73.32%) ఓట్లు కూటమికి పడ్డాయి. రాష్ట్రంలోనే ఇది అత్యధికం. వైసీపీకి 6,033(22.31%) ఓట్లు లభించగా.. ఇండియా కూటమికి కేవలం 448(1.66%) మంది మాత్రమే ఓటు వేశారు.

News June 9, 2024

శుద్ధ ముక్కపై రామోజీరావు కు సూక్ష్మ కళాకాండంతో శ్రద్ధాంజలి

image

ఈనాడు అధినేత రామోజీరావు మృతికి శ్రద్ధాంజలి ఘటిస్తూ శ్రీకాకుళం జిల్లా పలాస- కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధికి చెందిన సూక్ష్మ కళాకారుడు కొత్తపల్లి రమేష్ ఆచారి రామోజీరావు సూక్ష్మ చిత్రాన్ని శుద్ధ ముక్కపై చెక్కారు. శుద్ధ ముక్కపై ఈ సూక్ష్మ కళాఖండం చెక్కేందుకు మూడు గంటల సమయం పట్టిందని కొత్తపల్లి రమేష్ తెలిపారు.