India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎచ్చెర్ల మండలం పొన్నాడ, బొంతలకోడూరు గ్రామాల్లో ప్రారంభమైన ఎన్.టీ.ఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆకస్మికంగా పరిశీలించారు. సచివాలయ ఉద్యోగులు వృద్ధులు, వికలాంగుల ఇంటి వద్దకే వెళ్లి ఫించన్ పంపిణీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కూటమి నేతలు పాల్గొన్నారు.
శ్రీకాకుళం నగరంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో వచ్చే నెల 3న నోడల్ రిసోర్స్ కేంద్రం, ఏపీఎస్ఎస్ఈసీ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ కె.సూర్య చంద్రరావు తెలిపారు. అభ్యర్థులు బయోడేటా, మూడు పాస్ పోర్టు సైజు ఫొటోలు, విద్యార్హత జిరాక్సు కాఫీలు తీసుకురావాలని సూచించారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కోటబొమ్మాళి మండలం నిమ్మాడ గ్రామానికి చెందిన డీఎస్సీపీ కింజరాపు ప్రభాకర్ రావు విశాఖపట్నంలో విధులను నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో డీఐజీ ఆదేశాల మేరకు పలువురు డీఎస్పీలకు పదోన్నతి కల్పిస్తూ ఏఎస్పీలుగా నియమించారు. ఈ క్రమంలో డీఎస్పీగా విశాఖలో విధులు నిర్వహిస్తున్న కింజరాపు ప్రభాకర్ రావు శుక్రవారం ఏఎస్పీగా పదవి బాధ్యతలను చేపట్టారు. ఈ క్రమంలో నేడు పదవీ విరమణ చేయనున్నడటం విశేషం.
శ్రీకాకుళం జిల్లా చదరంగం అసోసియేషన్ ఆధ్వర్యంలో వచ్చే నెల ఒకటో తేదీన అండర్-9 విభాగంలో బాలలకు చదరంగం పోటీలు నిర్వహించనున్నట్లు ఆ సంఘం అధ్యక్షులు బగాది కిశోర్ తెలిపారు. 2015 జనవరి 1 తరువాత జన్మించిన క్రీడాకారులు అర్హులన్నారు. శ్రీకాకుళం నగరంలోని నానుబాల వీధిలోని చదరంగం శిక్షణ కార్యాలయానికి 9 గంటలకు హాజరుకావాలని సూచించారు.
శ్రీకాకుళం జిల్లాలో 28 డెంగ్యూ కేసులు నమోదైనట్లు డీఎంహెచ్‌వో బొడ్డేపల్లి మీనాక్షి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీజనల్ జ్వరాలపై ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు. అనంతరం ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ తిరిగి జ్వరాల సర్వే నిర్వహించాలన్నారు. అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. జ్వరాల సర్వేకు సంబంధించి ఈ ఏడాది ఇప్పటి వరకు 3,70,000 రక్త నమూనాలు సేకరించామన్నారు.
ఉచిత ఇసుక నూతన విధానాన్ని వచ్చేనెల 11నుంచి అమలు చేస్తున్నామని గనులశాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా అన్నారు. ఇసుక విధానంపై శుక్రవారం సచివాలయంలో మైనింగ్ శాఖాధికారులతో కలసి ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్లతో మాట్లాడారు. జిల్లా నుంచి స్వప్నిల్ దినకర్, JC ఫర్మాన్ అహ్మద్ హాజరయ్యారు. ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నెంబర్ 18005994599, dmgapsandcomplaints@yahoo.com ఈమెయిల్‌లను ఉపయోగించాలన్నారు.
ప్రయాణికుల రద్దీ మేరకు శ్రీకాకుళం, పలాస మీదుగా భువనేశ్వర్ (BBS), బెళగావి(BGM) మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 7 నుంచి నవంబర్ 30 వరకు ప్రతి శనివారం BBS- BGM(నం.02813), సెప్టెంబర్ 9 నుంచి డిసెంబర్ 2 వరకు ప్రతి సోమవారం BGM- BBS(నం.02814) మధ్య నడుపుతున్నామన్నారు. ఈ రైళ్లు ఆంధ్రప్రదేశ్‌లో విజయనగరం, విజయవాడ, గుంటూరుతో పాటు పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయన్నారు.
బతుకు తెరువు దుబాయ్‌కి వెళ్ళిన మజ్జి శివ(24) అనే యువకుడు బుధవారం విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణించాడు. కవిటి మండలం బొరివంక గ్రామానికి చెందిన శివ తండ్రి తన చిన్నతనంలోనే చనిపోవడంతో తన తల్లి ఎన్నో కష్టాలతో పెంచింది. తల్లి పడుతున్న కష్టాలు చూసి ఆరు నెలల క్రితం దుబాయికి శివ వెళ్లాడు. ఇంతలో ఈ సంఘటన చోటుచేసుకోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇంజినీరింగ్ ప్రవేశాలకు సంబంధించి మూడో విడత కౌన్సెలింగ్‌లో సీటు వచ్చిన అభ్యర్థులు కళాశాలలకు సెల్ఫ్ రిపోర్ట్ చేసేందుకు గడువు శుక్రవారంతో ముగుస్తుంది. మూడో విడత కౌన్సిలింగ్‌లో మొత్తం 1765 మందికి ప్రవేశాలు కల్పించారు. శ్రీకాకుళం జిల్లాలో మొత్తం నాలుగు ఇంజినీరింగ్ కాలేజీల్లో 82 శాతం ప్రవేశాలు నమోదయ్యాయి. అభ్యర్థులకు ఎటువంటి సమస్యలు ఉన్న శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్ సహాయ కేంద్రాన్ని సంప్రదించాలి.
పింఛనుదారులకు సెప్టెంబరు నెలకు సంబంధించిన పింఛను ఈ నెల 31న ఇస్తున్నట్లు కలెక్టరు స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. శుక్రవారం తెల్లవారుజామున ఐదు గంటల నుంచి జిల్లా వ్యాప్తంగా 732 సచివాలయాల పరిధిలోని 3,16,883 మంది లబ్ధిదారులకు రూ.129.35 కోట్ల నగదును సచివాలయ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి అందజేస్తారని పేర్కొన్నారు. లబ్ధిదారులు ఆ రోజు అందుబాటులో ఉండాలన్నారు.
Sorry, no posts matched your criteria.