Srikakulam

News June 6, 2024

శ్రీకాకుళం: నోటాకు అత్యధిక.. అత్యల్పం ఇక్కడే

image

ఇచ్ఛాపురం, ఆమదాలవలస, టెక్కలి, పాతపట్నం, శ్రీకాకుళం, పలాస నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల కంటే నోటాకు ఎక్కువ ఓట్లు వచ్చాయి. గడిచిన ఎన్నికల్లో అత్యధికంగా ఎచ్చెర్లలో నోటాకు ఓట్లు నమోదు కాగా, అత్యల్పంగా ఆమదాలవలసలో పడ్డాయి. ఈసారి అత్యధికంగా శ్రీకాకుళంలో 4,270 మంది, అత్యల్పంగా ఇచ్ఛాపురంలో 744 ఓట్లు పోలయ్యాయి. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు ఉన్నప్పటికీ వారి కంటే NOTAకే పడటం గమనార్హం.

News June 6, 2024

శ్రీకాకుళం: అన్ని శాఖలు సమన్వయం.. సమిష్టి కృషి

image

ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకు ఎన్నికల నిర్వహణలో వివిధ శాఖల సహాయ, సహకారాలు, భాగస్వామ్యం మరువలేనిదని జిల్లా ఎన్నికల అధికారి మనజీర్ జిలాని సమూన్ అన్నారు. కౌంటింగ్ ప్రశాంతంగా, సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరిని ఆయన అభినందించారు. జిల్లాలో గెలుపొందిన పార్లమెంట్ అభ్యర్థి, 8 నియోజకవర్గాల శాసన సభ్యులకు అభినందనలు తెలియజేశారు.

News June 6, 2024

శ్రీకాకుళం: ఓకే నియోజకవర్గానికి నుంచి ఎమ్మెల్యే, ఎంపీ

image

ఇటీవలే విడుదలైన ఎన్నికల ఫలితాల్లో ఎంపీ, ఎమ్మెల్యేగా ఒకే నియోజకవర్గానికి చెందిన వారు గెలుపొందడంతో అక్కడ ప్రజానీకం ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఎచ్చెర్ల నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఒకే నియోజకవర్గానికి చెందినవారు. ఇద్దరు కలిసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని ప్రజలు ఆశా భావం వ్యక్తం చేశారు.

News June 6, 2024

శ్రీకాకుళం: లోకేశ్‌ను కలిసిన అచ్చెన్నాయుడు

image

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంగళగిరిలో ఎమ్మెల్యేగా గెలిచిన నారా లోకేశ్‌ను అచ్చెన్నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. గురువారం తాడేపల్లి మండలం ఉండవల్లిలోని లోకేశ్ నివాసంలో కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఓడిన చోట పట్టుబట్టి అత్యధిక మెజారిటీతో గెలవడం గర్వించదగ్గ విషయమని అచ్చెన్నాయుడు కొనియాడారు.

News June 6, 2024

సౌదీ అరేబియాలో చినవంక యువకుడి మృతి

image

వజ్రపుకొత్తూరు మండల పరిధిలోని చినవంక గ్రామానికి చెందిన మదనాల శంకర్ (32) సౌదీ అరేబియాలో మృతి చెందారు. అతను బుధవారం తెల్లవారుజామున మెదడు పోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. 4 నెలల క్రితం పని నిమిత్తం ఆతను సౌదీ వెళ్లినట్లు చెప్పారు. ఇటీవల శంకర్ తల్లి కాంతమ్మ కూడా అనారోగ్యంతో మృతి చెందారు. ఎదిగొచ్చిన కొడుకు చిన్న వయసులోనే చనిపోవడంతో తండ్రి సూర్యనారాయణ కన్నీరు మున్నీరయ్యారు.

News June 6, 2024

శ్రీకాకుళం: శాసనసభకు ఎవరు ఎన్నోసారంటే..!

image

శ్రీకాకుళం జిల్లాలోని 10 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఐదుగురు గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేయగా, ఐదుగురు తొలిసారి శాసనసభలో అడుగుపెట్టనున్నారు. ➤ సీనియర్లు: అచ్చెన్నాయుడు (6వ సారి), కూన రవికుమార్ (2వ సారి), బగ్గు రమణమూర్తి (2వ సారి), కోండ్రు మురళీ (3వ సారి), బెందాళం అశోక్ (3వ సారి) ➤ తొలిసారి: గౌతు శిరీష, నడకుదిటి ఈశ్వర్, గొండు శంకర్, మామిడి గోవింద్, నిమ్మక జయకృష్ణ ఎన్నికయ్యారు.

News June 6, 2024

శ్రీకాకుళం జిల్లాలో వివాహిత ఆత్మహత్య

image

కొత్తూరు మండలం బత్తిలి రహదారిలో బుధవారం ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. సారవకోట మండలం కుమ్మరిగుంట గ్రామానికి చెందిన కృష్ణారావుతో పాతపట్నం మండలం సీది గ్రామానికి చెందిన ఆర్. రేవతి (27)కి ఎనిమిదేళ్ల కిందట వివాహమైంది. కృష్ణారావు కొత్తూరు అగ్నిమాపక కేంద్రంలో విధులు నిర్వహిస్తున్నారు. భార్యాభర్తలు చక్కగా ఉండేవారని, ఆమె ఎందుకు అఘాయిత్యానికి పాల్పడిందో తెలియడం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు.

News June 6, 2024

విధుల్లో పాల్గొన్న సిబ్బందికి అభినందనలు: ఎస్పీ

image

శ్రీ శివాని ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా.. అన్ని శాఖలు సమన్వయంతో ప్రశాంతంగా ఎన్నికలు పూర్తి చేశామని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ జి.ఆర్ రాధిక అన్నారు. ఈ మేరకు కౌంటింగ్ ప్రక్రియకు సహకరించిన ప్రజలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. సమర్థవంతంగా హోంగార్డు స్థాయి నుంచి పై స్థాయి వరకు విధులు నిర్వహించిన వారికి ఎస్పీ అభినందనలు తెలిపారు.

News June 6, 2024

సిక్కోలులో పనసకు గిరాకీ తెచ్చిన ఒడిశా సంస్కృతి

image

శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో ఈ ఏడాది పనస పంట దిగుబడి పెరిగడంతో ఇఛ్చాపురంలో విక్రయాలు జోరందుకున్నాయి. అధిక విక్రయాలకు దిగుబడి పెరగడం ఓ కారణమైతే ఒడిశా సంస్కృతి ప్రధాన కారణం. అదేంటంటే గురువారం ఒడిశా, ఆంధ్రా సరిహద్దు ప్రాంతాల్లో అంబ అమావాస్య, సావిత్రి అమావాస్య సందర్భంగా పెళ్లైన ఆడపిల్లలకు పనస పండ్లు కానుకగా ఇవ్వడం ఆనవాయితీ. దీంతో ఉద్దానం ప్రాంతంలో విక్రయాలు మరింత జోరందుకున్నాయి.

News June 6, 2024

సిక్కోలులో పనసకు గిరాకీ తెచ్చిన ఒడిశా సంస్కృతి

image

శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో ఈ ఏడాది పనస పంట దిగుబడి పెరిగడంతో ఇఛ్చాపురంలో విక్రయాలు జోరందుకున్నాయి. అధిక విక్రయాలకు దిగుబడి పెరగడం ఓ కారణమైతే ఒడిశా సంస్కృతి ప్రదాన కారణం. అదేంటంటే గురువారం ఒడిశా, ఆంధ్రా సరిహద్దు ప్రాంతాల్లో అంబ అమావాస్య, సావిత్రి అమావాస్య సందర్భంగా పెళ్ళైన ఆడపిల్లలకు పనస పండ్లు కానుకగా ఇవ్వడం ఆనవాయితీ. దీంతో ఉద్దానం ప్రాంతంలో విక్రయాలు మరింత జోరందుకున్నాయి.