Srikakulam

News May 30, 2024

రేపు విశాఖ-పలాస పాసింజర్ రద్దు

image

వాల్తేరు డివిజన్ నౌపడ- పూండి సెక్షన్లో వంతెనల పునర్నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఈ శుక్రవారం పలు రైళ్లను రద్దు చేసినట్టు వాల్తేరు సీనియర్‌ డీసీఎం కె.సందీప్ తెలిపారు. ఆరోజు శుక్రవారం పలాస-విశాఖ (07471) (07470) ప్రత్యేక మెమో పాసింజర్ రైళ్లను రద్దు చేశారు. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించి సహకరించాలని వాల్తేరు సీనియర్‌ డీసీఎం కె.సందీప్ కోరారు.

News May 30, 2024

శ్రీకాకుళం: అత్యాచారయత్నం ఘటనపై విచారణ

image

పొందూరు మండలంలోని ఓ గ్రామంలో చిన్నారిపై అత్యాచారయత్నానికి ఓ యువకుడు పాల్పడినట్లు అందిన ఫిర్యాదు మేరకు దిశ డీఎస్పీ శ్రీనివాసరావు బుధవారం విచారణ చేపట్టారు. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఈ ఘటనపై నివేదిక కోరడంతో ఈ కేసుపై జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే పోక్సో కేసు నమోదు చేసినందున స్థానిక పోలీసు స్టేషన్లో పలువురిని విచారించారు.

News May 29, 2024

శ్రీకాకుళం: ఉరివేసుకొని ఎల్ఐసి ఏజెంట్ ఆత్మహత్య

image

మందస మండల కేంద్రంలో నివాసముంటున్న ఎల్ఐసి ఏజెంట్ వెంకటేశ్వరరావు(60) బుధవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఘటనపై, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి భార్యతో పాటు ఒక కుమార్తె ఉన్నారు.

News May 29, 2024

శ్రీకాకుళం: అంతర్ కళాశాలల క్రాస్ వర్డ్ పజిల్ పోటీలు

image

ఆన్‌లైన్ విధానంలో అంతర్ కళాశాలల క్రాస్ వర్డ్ పజిల్ పోటీలను కేంద్ర విద్యాశాఖ నిర్వహిస్తోంది. ఆసక్తి కలిగిన విద్యార్థులు https://nice.crypticsingh.com/ అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలని కోరుతూ ఈ మేరకు తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. ఆన్‌లైన్‌లో ఉత్తమ ప్రతిభ చూపిన వారితో జోనల్, జాతీయ స్థాయిలో పోటీలను ఆఫ్‌లైన్ విధానంలో నిర్వహిస్తామని కేంద్ర విద్యాశాఖ తెలిపింది.

News May 29, 2024

శ్రీకాకుళం: బత్తిలి- భీమవరం బస్సు సర్వీసులను ఆదరించండి

image

ప్రయాణికుల సౌకర్యార్థం బత్తిలి నుంచి పశ్చిమగోదావరి జిల్లా భీమవరంకు ప్రతిరోజూ 2 సూపర్ లగ్జరీ బస్సులను నడుపుతున్నామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ప్రతిరోజూ సాయంత్రం 5, 6 గంటలకు ఈ బస్సులు బత్తిలిలో బయలుదేరి తర్వాతి రోజు ఉదయం 06.35, 07.35 గంటలకు భీమవరం చేరుకుంటాయని, ప్రయాణికులు ఈ సర్వీసులను ఆదరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

News May 29, 2024

పలాస: విశాఖ-పలాస రైళ్లు రద్దు

image

పలాస-విశాఖ-పలాస పాసింజర్ రైళ్లను రద్దు చేసినట్లు వాల్తేరు రైల్వే డివిజన్ అధికారులు తెలిపారు. ఈనెల 31న పలాస నుంచి విశాఖ వెళ్లే పాసింజర్ రైలును, విశాఖ నుంచి పలాస వచ్చే పాసింజర్ రైలును రద్దు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.

News May 29, 2024

పలాస: ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు

image

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం సుమ్మాదేవి రైల్వే గేట్ సమీప జాతీయ రహదారిపై బుధవారం మధ్యాహ్నం వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని, వెనుక నుంచి గుర్తు తెలియని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు గాయాల పాలయ్యాడు. గమనించిన స్థానికులు గాయపడిన వ్యక్తిని ఓ ప్రైవేట్ వాహనంలో పలాస ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ప్రమాదానికి కారణమైన కారును వెతికే పనిలో ఉన్నారు.

News May 29, 2024

శ్రీకాకుళం: ఓట్లు లెక్కింపు ప్రక్రియపై శిక్షణ

image

జూన్ 4వ తేదీన జరుగనున్న అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ఓట్లు లెక్కింపు ప్రక్రియపై సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్‌లకు శిక్షణ ఇచ్చారు . పట్టణంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బుధవారం మధ్యాహ్నం కలెక్టర్ ఆధ్వర్యంలో మాస్టర్ ట్రైనర్లు ఓట్లు లెక్కింపు ఎలా చేయాలన్న దానిపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు. దీనికి సంబంధించి మాక్ డ్రిల్ జూన్ 3వ తేదీన ఉంటుందని తెలిపారు.

News May 29, 2024

శ్రీకాకుళం: ప్రజానీకానికి SP రాధిక కీలక హెచ్చరికలు

image

జూన్ 1 నుంచి కొత్త మోటారు వాహన చట్టం అమల్లోకి రానుందని జిల్లా ఎస్పీ రాధిక తెలిపారు. ఈ మేరకు ఆమె తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ చట్ట ప్రకారం మైనర్లు వాహనాలు నడిపితే రూ.25,000 జరిమానా, మద్యం సేవించి వాహనాన్ని నడిపితే 6 నెలల జైలు, రూ.10,000 ఫైన్ విధిస్తామన్నారు. మైనర్లయిన పిల్లలకు వాహనాలను ఇస్తే కొత్త నిబంధనలు మేరకు తల్లిదండ్రులకు శిక్ష తప్పదని, ప్రజలంతా అప్రమత్తంగా వ్యవహరించాలని ఎస్పీ సూచించారు.

News May 29, 2024

మరో 6 రోజులే.. శ్రీకాకుళంలో ఆధిపత్యం ఎవరిది.?

image

సార్వత్రిక ఓట్ల లెక్కింపు తేదీ జూన్ 4 వచ్చేస్తోంది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 10 అసెంబ్లీ, 1 పార్లమెంట్ స్థానాలు ఉండగా.. ఫలితాలకు మరో 6 రోజులే ఉంది. ఓ వైపు ఉత్కంఠ నెలకొనగా, మరోవైపు బెట్టింగులు జోరందుకున్నాయి. గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో YCP 8 అసెంబ్లీ, టీడీపీ 1 MP, 2 అసెంబ్లీ స్థానాలు గెలుచుకోన్నాయి. ఇరుపార్టీల నేతలు గెలుపుపై ధీమాగా ఉండగా, ఏ పార్టీది ఆధిపత్యం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.