Srikakulam

News May 7, 2024

పొందూరు:ఎమ్మెల్యే అభ్యర్థి సతీమణిపై కత్తితో దాడి

image

పొందూరు మండలం మజ్జిలిపేట గ్రామంలో సోమవారం సాయంత్రం నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కూన రవికుమార్ సతీమణి ప్రమీల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయితే సూపర్ సిక్స్ పథకాలు వివరిస్తుండగా ప్రతిపక్షానికి చెందిన కొందరు కార్యకర్తలు ఆమెపై కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఆమె కారు డ్రైవర్ అడ్డుకోవడంతో ఆయనకు గాయాలయ్యాయి. కోన సత్యనారాయణ, బలగ రామశంకర్రావు, అన్నెపు రాము పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News May 7, 2024

శ్రీకాకుళం: RTC డ్రైవింగ్ స్కూల్‌లో దరఖాస్తులకు ఆహ్వానం

image

శ్రీకాకుళం జిల్లాలో APSRTC హెవీ లైసెన్స్ కోసం శిక్షణ పొందుటకు అడ్మిషన్స్ జరుగుతున్నాయని జిల్లా ప్రజారవాణా అధికారి విజయ కుమార్ సోమవారం తెలిపారు. శిక్షణ కోసం లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ LMV (ఫోర్ వీలర్) లైసెన్స్ ఉండాలని అన్నారు. ఇప్పటివరకు 15 బ్యాచ్‌లలో సుమారు 250 మంది డ్రైవర్లు విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్నారని తెలిపారు.

News May 6, 2024

ఎచ్చెర్ల: యథావిధిగా డిగ్రీ 2వ సెమిస్టర్ పరీక్ష 

image

ఈ నెల 8వ తేదీన నిర్వహించనున్న డిగ్రీ మొదటి సంవత్సరం, 2వ సెమిస్టర్‌కు చెందిన స్టాక్ మార్కెట్ ఆపరేషన్స్ (Stock Market Operations) పరీక్ష షెడ్యూల్ ప్రకారం జరుగుతుందని డా.బీఆర్ఏయూ పరీక్షలు విభాగం డీన్ డాక్టర్ ఎస్.ఉదయ్ భాస్కర్ సోమవారం స్పష్టం చేశారు. అదే రోజు ఉదయం 9 గంటల నుంచి 10:30 గంటల వరుకు పరీక్ష ఉంటుందన్నారు. విద్యార్థుల ఈ విషయాన్ని గమనించాలని ఆయన సూచించారు.

News May 6, 2024

రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యం: అచ్చెన్నాయుడు

image

నందిగాం మండలం దేవుపురం పంచాయతీ కొండతెంబూరు గ్రామంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్థి కింజారాపు అచ్చెన్నాయుడు సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సైకోలను సాగనంపడానికి ప్రజలంతా ఏకమై కూటమిని గెలిపించాలని కోరారు. రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని అన్నారు.

News May 6, 2024

శ్రీకాకుళం: 474 మంది ఓటేశారు

image

శ్రీకాకుళంలో జిల్లాలో మొత్తం 494 మంది హోమ్ ఓటింగ్ విధానానికి నమోదు చేసుకోగా 474 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని అధికారులు తెలిపారు. అధికంగా నరసన్నపేట నియోజకవర్గంలో 110 మంది, అత్యల్పంగా పలాస నియోజకవర్గం నుంచి 10 మంది ఓటు హక్కును వినియోగించుకున్నట్లు పేర్కొన్నారు. పాతపట్నం నియోజకవర్గంలో 24 మంది ఓటేశారు.

News May 6, 2024

శ్రీకాకుళం: వాలంటీర్లకు వేతనం.. తిరిగి ఇచ్చేయాలని ఆదేశాలు

image

రాజాం మున్సిపాలిటీ పరిధిలో విధులు నిర్వహిస్తున్న 225 మంది వాలంటీర్లకు గాను 155 మంది రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కాగా రాజీనామా చేసిన వారిలో 16 మందికి రూ.5వేల గౌరవవేతనం వారి అకౌంట్లలో జమఅయింది. ఈ విషయం కమిషనర్ రామప్పలనాయుడుకు తెలియగా నగదు రిటర్న్ చేయాలని ఆదేశించారు. లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

News May 6, 2024

నరసన్నపేట: చంద్రబాబు నాయుడు పర్యటన రద్దు

image

టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పర్యటన రద్దయింది. ఈ మేరకు సోమవారం టీడీపీ జిల్లా అధ్యక్షుడు కలమట వెంకటరమణ, ఉమ్మడి కూటమి అభ్యర్థి బగ్గు రమణమూర్తి తెలిపారు. ఈ నెల 9వ తేదీన నరసన్నపేటలో నిర్వహించాల్సిన బహిరంగ సభ రద్దు అయిందని పేర్కొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ విషయాన్ని గుర్తించాలని వారు స్పష్టం చేశారు.

News May 6, 2024

ఇచ్ఛాపురం: మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య

image

ఇచ్ఛాపురం పట్టణ పరిధిలోని పెద్దాకుల వీధికి చెందిన శ్రీదేవి సుష్మల్(43) మనస్తాపంతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పట్టణ ఎస్సై సత్యనారాయణ తెలిపారు. ఇచ్ఛాపురం పట్టణంలో బ్యూటీ పార్లర్ నడుపుకుంటున్న శ్రీదేవి ఇంట్లో చిన్నచిన్న తగాదాలతో క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకున్నట్లుగా పేర్కొన్నారు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు.

News May 6, 2024

సిక్కోలు నుంచి 18 మంది మంత్రులు

image

జిల్లాకు చెందిన నాయకులు 18 మంది మంత్రులుగా పని చేశారు. మొదటగా గౌతు లచ్చన్న మంత్రిగా వ్యవహరించారు. కాంగ్రెస్ నుంచి లుకరావు లక్ష్మణదాస్ గృహ నిర్మాణ, గొర్లె శ్రీరాములు, TDP తంగి సత్యనారాయణ రెవెన్యూ, ప్రతిభభారతి, కళా వెంకట్రావు, గుండ అప్పల సూర్యనారాయణ, ధర్మాన ప్రసాద్ రావు మంత్రులుగా చేశారు. అచ్చెన్నాయుడు కార్మికశాఖ, ధర్మాన రెవెన్యూ, 2021లో సీదిరి పశువైద్యం, పాడి పరిశ్రమ మంత్రిగా, తదితరులు ఉన్నారు.

News May 6, 2024

శ్రీకాకుళం: యువగళం సభ రద్దు

image

ఈనెల 7న శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిర్వహించనున్న యువగళం సభను రద్దు చేశారు. ఈ విషయాన్ని టీడీపీ శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు కలమట వెంకటరమణ ఆదివారం ధ్రువీకరించారు.