India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శ్రీకాకుళం జిల్లాలో ముగ్గురు టీడీపీ అభ్యర్థులు భారీ ఆధిక్యంతో విజయం దిశగా దూసుకుపోతున్నారు. పలాసలో గౌతు శిరీష 32,087 ఓట్లు, టెక్కలిలో అచ్చెన్న 32,802 ఆధిక్యంలో ఉన్నారు. కాగా మాజీ మంత్రులు సీదిరి అప్పలరాజు, ధర్మాన ప్రసాద్ పలాస, శ్రీకాకుళం నియోజకవర్గాలలో ఓటమి బాటలో ఉన్నారు.
శ్రీకాకుళం నియోజకవర్గానికి సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసింది. టీడీపీ అభ్యర్థి గొండు శంకర్ తన ప్రత్యర్థి అయిన వైపీపీ ధర్మాన ప్రసాద్ రావు మీద 50,593 వేల ఓట్ల పైచిలుకు ఓట్ల తేడాతో విజయం సాధించారు.
శ్రీకాకుళం పార్లమెంట్ టీడీపీ ఎంపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్ నాయుడు ముందంజలో దూసుకుపోతున్నారు. పార్లమెంట్ పరిధిలోని 13 రౌండ్లకు రామ్మోహన్ నాయుడుకు 4,56,076 ఓట్లు పోలవ్వగా.. ఇక్కడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పేరాడ తిలక్‌కు 2,60,369 ఓట్లు పడ్డాయి. దీంతో టీడీపీ ఎంపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడు 1,95,707 ఓట్ల మెజారిటీతో ముందుకు సాగుతున్నారు.
టీడీపీ తరపున ఆధిక్యంలో ఉన్న ఎంపీ అభ్యర్థులలో శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్ నాయుడు 3వ స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం రామ్మోహన్ 2,12,501 ఓట్ల ఆధిక్యంలో భారీ విజయం దిశగా దూసుకెళ్తున్నారు. కాగా టీడీపీ ఎంపీ అభ్యర్థులలో విజయవాడ, గుంటూరు స్థానాల అభ్యర్థులు కేశినేని చిన్ని- 2,37,657 ఆధిక్యం, పెమ్మసాని చంద్రశేఖర్ 2,17,808 ఆధిక్యంతో తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
శ్రీకాకుళం పార్లమెంట్ టీడీపీ ఎంపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్ నాయుడు ముందంజలో దూసుకుపోతున్నారు. పార్లమెంట్ పరిధిలోని 7 రౌండ్లకు రామ్మోహన్ నాయుడుకు 2,44,038 ఓట్లు పోలవ్వగా.. ఇక్కడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పేరాడ తిలక్ కు 1,38,095 ఓట్లు పడ్డాయి. దీంతో టీడీపీ ఎంపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడు 1,05,943 ఓట్ల మెజారిటీతో ముందుకు సాగుతున్నారు.
శ్రీకాకుళం పార్లమెంట్ టీడీపీ ఎంపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్ నాయుడు ముందంజలో దూసుకుపోతున్నారు. పార్లమెంట్ పరిధిలోని 6 రౌండ్లకు రామ్మోహన్ నాయుడుకు 2,08,852 ఓట్లు పోలవ్వగా.. ఇక్కడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పేరాడ తిలక్‌కు 1,18,857 ఓట్లు పడ్డాయి. దీంతో టీడీపీ ఎంపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడు 89,995 ఓట్ల మెజారిటీతో ముందుకు సాగుతున్నారు.
శ్రీకాకుళం పార్లమెంట్ టీడీపీ ఎంపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్ నాయుడు ముందంజలో దూసుకుపోతున్నారు. పార్లమెంట్ పరిధిలోని 4వ రౌండ్లకు రామ్మోహన్ నాయుడుకు 1,38,991 ఓట్లు పోలవ్వగా.. ఇక్కడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పేరాడ తిలక్‌కు 79,423 ఓట్లు పడ్డాయి. దీంతో టీడీపీ ఎంపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడు 59,568 ఓట్ల మెజారిటీతో ముందుకు సాగుతున్నారు.
ఎచ్చెర్ల శ్రీ శివానీ ఇంజినీరింగ్ కళాశాలలో జరగుతున్న సార్వత్రిక ఎన్నికల ఓట్లు కౌంటింగ్ సరళిని మంగళవారం మధ్యాహ్నం విశాఖ రేంజ్ DIG విశాల్ గున్ని సందర్శించారు. అనంతరం బందోబస్తు ఏర్పాట్లును పర్యవేక్షించి, కౌంటింగ్ జరగుతున్న తీరుపై అధికారులును అడిగి తెలుసుకున్నారు. కౌంటింగ్ కేంద్రాల లోపల ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూం నందు ఆయన పర్యవేక్షించారు.
శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్యే స్థానాలలో పోటీ చేసిన అభ్యర్థులలో కూటమి నాయకులు మంగళవారం జరుగుతున్న ఓట్లు లెక్కింపులో ప్రతి రౌండ్‌లో కూడా స్పష్టమైన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. ఆమదాలవలస.. కూన రవికుమార్, టెక్కలి అచ్చెన్నాయుడు, ఇచ్చాపురం బి అశోక్, పలాస, శిరీష, పాతపట్నం.ఎం గోవిందరావు, శ్రీకాకుళం.. గొండు శంకర్, నరసన్నపేట.. బి రమణమూర్తి, రాజాం..కే మురళీమోహన్ ఆధిపత్యంలో ఉన్నారు.
ఎచ్చెర్ల శ్రీ శివానీ ఇంజినీరింగ్ కళాశాలలో జరగుతున్న సార్వత్రిక ఎన్నికల ఓట్లు కౌంటింగ్ సరళిని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ జి.ఆర్.రాధిక మంగళవారం ఉదయం స్వయంగా పర్యవేక్షించారు. ఈ క్రమంలో కౌంటింగ్ కేంద్రాల లోపల, పరిసర ప్రాంతాల్లో జిల్లా ఎస్పీ ప్రతి పాయింట్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేసి బందోబస్తు విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని అప్రమత్తం చేశారు.
Sorry, no posts matched your criteria.