India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి RTV ఎగ్జిట్ పోల్స్‌ను విడుదల చేసింది. వీరి ప్రకారం TDP-7, YCP-3 స్థానాలో గెలుస్తుందని తెలిపారు. ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం, శ్రీకాకుళం, ఆమదాలవలస, రాజాం స్థానాల్లో TDP పాగా వేస్తుందని, ఎచ్చెర్ల, నరసన్నపేట, పాలకొండ YCP గెలిచే అవకాశం ఉందన్నారు. రేపు కౌటింగ్ సదర్భంగా అందరిలో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలోని పలు డివిజన్లలో భద్రతా పనులు జరుగుతున్నందున అధికారులు పలు రైళ్లను రద్దు చేశారు. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా మీదుగా ప్రయాణించే ట్రైన్ నం.18525 బ్రహ్మపూర్- విశాఖపట్నం ట్రైన్‌ను రద్దు చేసినట్లు వాల్తేరు డివిజనల్ రైల్వే మేనేజర్ ప్రకటన విడుదల చేశారు. ప్రయాణికులు ఈ అంశాన్ని గమనించాలని ఆయన కోరారు.
వీరఘట్టం పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆదివారం రాత్రి పడిన భారీ పిడుగులకు పిడుగులకు భారీ సంఖ్యలో పక్షులు మృత్యువాత పడ్డాయి. సుమారు 60 రామచిలుకలు, 48 కాకులు, 5 గద్దలు మృతి చెందాయి. మృతి చెందిన పక్షులన్నింటినీ పోలీస్ సిబ్బంది సమీపంలో ఖననం చేశారు. పిడుగుపాటుకు పోలీస్ క్వార్టర్స్‌తో పాటు పోలీస్ స్టేషన్లోని సిబ్బంది భయాందోళనకు గురయ్యారు.
జిల్లాలో పాలీసెట్ 2024 అభ్యర్థుల కౌన్సెులింగ్‌కు స్వల్ప విరామం ప్రకటించినట్లు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపల్ జి.దామోదరరావు తెలిపారు. ఆదివారం 92,001 నుంచి 1,08,000 ర్యాంకు మధ్య విద్యార్థులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. కౌంటింగ్ నేపథ్యంలో సోమవారం నుంచి జరగాల్సిన కౌన్సెలింగ్‌ను 6వ తేదీకి రీషెడ్యూల్ చేశారు. 6వ తేదీన 1,08,001 నుంచి చివరి ర్యాంకు వరకు విద్యార్థులు హాజరు కానున్నారు.
వజ్రపుకొత్తూరు మండలం అక్కపల్లి శివసాగర్ తీరంలో వెలసిన శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ఆదివారం మిరాజ్ సినిమా చిత్రీకరణ ప్రారంభోత్సవ పూజలు ఘనంగా నిర్వహించారు. కేఎంసీ ఫిలిం మేకర్స్ బ్యానర్‌పై నిర్మాత కే.సత్యభాస్కర్ నిర్మిస్తున్న ఆ చిత్రానికి విష్ణుదేవ్ దర్శకత్వం వహించనున్నారు. వారు మాట్లాడుతూ.. పర్యాటకంగా అభివృద్ధి చెందుతున్న శివసాగర్ తీరంలో మొదటి సినిమా చిత్రీకరణ చేయడం ఆనందంగా ఉందన్నారు.
ఎన్నికల అంకం తుది దశకు చేరుకుంది. మరికొద్ది గంటల్లో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని 10 అసెంబ్లీ నేతల భవితవ్యం తేలనుంది. ఇప్పటికే విడుదలైన ఎగ్జిట్ పోల్స్‌తో నేతలతో పాటు బెట్టింగ్ రాయుళ్లలోను తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మరోవైపు కౌంటింగ్‌కు చిలకపాలెం సమీపంలోని శివాని ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ మనజీర్ జీలానీ సామూన్ తెలిపారు. మీ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి.
ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టెక్కలి సమీపంలో జరుగుతున్న అండర్-19 క్రికెట్ పోటీల్లో ఆదివారం విశాఖపట్నం-తూర్పుగోదావరి జిల్లా జట్లు మధ్య మ్యాచ్ జరగగా విశాఖ జట్టు 97 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన విశాఖ జట్టు 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 279 పరుగులు చేశారు. తదుపరి బ్యాటింగ్ చేసిన తూ.గో జట్టు 45.5 ఓవర్లకు 182 పరుగులు చేసి ఆలౌట్ కావడంతో విశాఖ జట్టు విజయం సాధించింది.
స్ట్రాంగ్ రూంల వద్ద భద్రత పటిష్టంగా ఉండాలని, జిల్లా ఎన్నికల అధికారి మనజిర్ జిలాని సమూన్ ఆదేశించారు. చిలకపాలెంలోని ఇంజనీరింగ్ కళాశాలలో ఉన్న స్ట్రాంగ్ రూంలను ఆదివారం సాయంత్రం పరిశీలించారు. విశాఖ రేంజ్ డీఐజీ విశాల్ గున్ని, ఎప్పీ రాధికతో పాటు నియోజకవర్గాల పరిశీలకులు శేఖర్ విద్యార్థి, తలత్ పర్వేజ్ ఇక్బాల్ రోహీల్, మాలతుస్ ఎస్.సంగమ్, అనుజ కుమార్ దాస్ తనిఖీ చేశారు. పలు అంశాలపై చర్చించారు.
శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం భావనపాడు సముద్ర తీరంలో ఆదివారం సముద్ర స్థానానికి దిగి 17 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. సారవకోట మండలం మర్రిపాడుకి చెందిన జన్ని ఉపేంద్ర(17) భావనపాడులో సముద్రంలో స్నానానికి దిగి ఈత కొడుతుండగా కెరటాలు లోపలికి లాక్కొని తీసుకువెళ్లడంతో మృతి చెందాడు. బాలుడు మృతి చెందాడన్న సమాచారంతో కుటుంబ సభ్యులు భావనపాడు చేరుకొని విలపించారు.
కంచిలి మండలం బొగాబెని గ్రామంలో 8వ తరగతి విద్యార్థి శ్రీరామ్ పాము కాటుతో మృతి చెందాడు. మెడపై పాము కాట్లు కనిపించడంతో బాలుడి తాత వెంటనే సోంపేట ప్రభుత్వ హాస్పిటల్‌కి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.