India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎచ్చెర్లలో శ్రీశివాని కళాశాలలో 4న ఓట్ల లెక్కింపు కేంద్రాలకు కౌంటింగ్ సిబ్బంది, అభ్యర్థులు, ఏజెంట్స్ వారికి నిర్దేశించిన మార్గాల్లోనే చేరుకోవాలని ఎస్పీ రాధిక ఆదివారం తెలిపారు. శ్రీకాకుళం, ఎచ్చెర్ల అసెంబ్లీలకు చెందిన వారు గేట్ నం-1 నుంచి ఫార్మసీ బ్లాక్ కౌంటింగ్ సెంటర్‌కు ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, నరసన్నపేట, ఆమదాలవలస, పాతపట్నం గేట్ నం-II నుంచి IIIT బ్లాక్ కౌంటింగ్ సెంటర్ వద్దకు చేరుకోవాలన్నారు.
ప్రజలు ఎన్నికల ఫలితాల అనంతరం సంయమనం పాటించాలని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక అన్నారు. శ్రీకాకుళంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా కలెక్టర్‌తో కలిసి జిల్లా ఎస్పీ మాట్లాడారు. జిల్లాలో 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందన్నారు. నలుగురు కంటే ఎక్కువ మంది గుమిగూడి ఉండరాదని హెచ్చరించారు.
జిల్లా ఎడిషనల్ ఎస్పీ సెబ్ జెడీ డి.గంగాధరం ఆదేశాల మేరకు శనివారం టెక్కలి ఎస్ఈబీ సీఐ రాజశేఖర్ నాయుడు ఆధ్వర్యంలో మెలియాపుట్టి మండలం నేలబొంతు గ్రామానికి తూర్పు వైపు ఉన్న కొండపై సుమారుగా 1800 లీటర్ల పులిసిన బెల్లపు ఊటలను, 30 లీటర్ల నాటుసారాను ధ్వంసం చేసి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఆయనతోపాటు పలాస డీఎఫ్‌టీ సీఐ రామచంద్ర కుమార్ టెక్కలి ఎస్ఐ జి.గణేష్ సిబ్బంది పాల్గొన్నారు.
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఈ నెల 3, 4, 5 తేదీల్లో మూడు రోజులు మద్యం దుకాణాలను మూసి వేయనున్నట్లు ఎన్నికల సంఘం నియమించిన ప్రత్యేక పోలీస్ అధికారి జిల్లాలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ( ఎస్ఈబీ) అదనపు ఎస్పీ డి.గంగాధరం తెలిపారు. చెక్ పోస్టుల వద్ద తనిఖీలు ముమ్మరం చేశామని చెప్పారు. కౌంటింగ్ సమయంలో ఎక్కడ మద్యం అక్రమ నిల్వలు ఉండకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.
పెద్దశిర్లాం గ్రామానికి చెందిన అప్పలనాయుడు(35) ఇనుప ముక్కల (స్క్రాప్) వ్యాపారానికి గ్రామానికి చెందిన 13 మంది యువకులతో కలిసి ఇటీవల ఒడిశాలోని మల్కాన్ గిరి వెళ్లాడు. శుక్రవారం మధ్యాహ్నం మల్కాన్ గిరి నుంచి తన ద్విచక్రవాహనంపై సమీపంలోని గూడాలకు వెళ్లే క్రమంలో ఎండలో అస్వస్థతకు గురయ్యాడు. అనంతరం కుప్పకూలి చనిపోయినట్లు కుటుంబీకులకు సమాచారం అందింది. మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.
శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గంలో టీడీపీ గెలుపొందుతుందని సీ ప్యాక్ పోల్ సర్వే అంచనా వేసింది. ఇక్కడ టీడీపీ నుంచి కింజరావు రామ్మోహన్ నాయుడు, వైసీపీ నుంచి పేరాడ తిలక్ బరిలో నిలిచారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు గెలుపొందారు. మరో సర్వే చాణక్య X అక్కడ టీడీపీనే గెలుస్తుందని పేర్కొంది. ఈ సర్వేలపై మీ COMMENT.
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో మెజారిటీ స్థానాలు కూటమికే దక్కే అవకాశం ఉందని చాణక్య X సర్వే ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. మొత్తం 10 స్థానాల్లో కూటమి 3 సీట్లు, వైసీపీ 2 గెలుస్తుందని, కూటమికి మూడు చోట్ల ఎడ్జ్, వైసీపీకి రెండు చోట్ల ఎడ్జ్ ఉన్నట్లు పేర్కొంది. పాలకొండ, రాజాం, శ్రీకాకుళం, పలాస, ఇచ్ఛాపురంలో రెండు పార్టీలకు టఫ్ ఫైట్ ఉంటుందని చెప్పింది. ఈ సర్వేపై మీ COMMENT.
కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిపేందుకు బందోబస్తు విధులలో పాల్గొననున్న ఏఎస్ఐ నుంచి డీఎస్పీ స్థాయి అధికారులకు శనివారం ఎచ్చెర్ల శివాని ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్ బందోబస్తులో పాటించవలసిన విధి విధానాలపై ఎస్పీ జీఆర్ రాధిక బ్రీఫింగ్ నిర్వహించారు. సిబ్బందికి కేటాయించిన పాయింట్‌లో బాధ్యతగా విధులు నిర్వహించాలన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో అల్లర్లు ఘర్షణలకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 10 సీట్లకు గాను NDA కూటమి 7-8 గెలుస్తుందని బిగ్‌టీవీ సర్వే తెలిపింది. 2-3 సీట్లు వైసీపీ సాధిస్తుందని అంచనా వేసింది. మొత్తంమీద 175 అసెంబ్లీ సీట్లకు గాను 106- 119 కూటమి, 56- 69 సీట్లు వైసీపీ విజయం సాధిస్తుందని వెల్లడించింది.
పోస్ట్ పోల్ సర్వే ప్రకారం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి 2-3, ఎన్డీఏ కూటమికి 7-8 వస్తాయని అంచనా వేసింది. శ్రీకాకుళం ఎంపీ స్థానంలో టీడీపీ గెలువనుందని చాణక్య ఎక్స్ అంచనా వేసింది.
Sorry, no posts matched your criteria.