Srikakulam

News June 1, 2024

కేకే సర్వే.. శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ ఒక్క సీటు కూడా గెలవదు

image

అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఎన్నికల సర్వే ఫలితాలను కేకే సర్వే ఫలితాలను వెల్లడించింది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 10 స్థానాలకుగాను టీడీపీకి 8, జనసేన 1, బీజేపీ 1 విజయం సాధిస్తుందని వెల్లడించింది. కాగా వైసీపీ ఒక్క సీట్టు కూడా గెలవదని పేర్కొంది.

News June 1, 2024

చాణక్య స్ట్రాటజీస్.. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో కూటమికి 7 సీట్లు

image

అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఎన్నికల సర్వే ఫలితాలను చాణక్య స్ట్రాటజీస్ సర్వే ఫలితాలను వెల్లడించింది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 10 స్థానాలకుగాను కూటమికి 7, వైసీపీకి 2 విజయం, 1 స్థానాల్లో టఫ్ ఫైట్ ఉండనుందని వెల్లడించింది.

News June 1, 2024

ఆరా మస్తాన్ సర్వే.. సీదరి ఓటమి!

image

సీదిరి అప్పలరాజు పలాసలో ఓడిపోనున్నారని ఆరా మస్తాన్ సర్వే అంచనా వేసింది. అటు ధర్మాన ప్రసాద్ శ్రీకాకుళంలో గట్టి పోటీ ఎదుర్కోనున్నారని తెలిపింది. తమ్మినేని సీతారాం అముదాలవలసలో కొద్ది ఓట్ల తేడాతో ఓటమికి అవకాశం ఉందని పేర్కొంది.

News June 1, 2024

శ్రీకాకుళం: ఈ నెల 3, 4 తేదీల్లో పలు రైళ్లు రద్దు

image

ఈ నెల 3, 4 తేదీల్లో జిల్లా మీదుగా నడిచే పలు రైళ్లను రద్దు చేస్తూ శనివారం ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు తెలిపారు. నౌపడ-పూండీ మెయిన్ లైన్‌లో వంతెన పనులు నేపథ్యంలో 3వ తేదీన పలాస-విశాఖ(07470)ప్యాసెంజర్, విశాఖ-గునుపూర్ (08522) ప్యాసెంజర్, విశాఖ- బరంపురం(18526), 4వ తేదీన బరంపురం-విశాఖపట్నం(18525) ఎక్స్ ప్రెస్ రైళ్లు రద్దు చేశారు. వాల్తేర్ డివిజన్ సీనియర్ కమర్షియల్ మేనేజర్ కె.స్యాందీప్ పేర్కొన్నారు.

News June 1, 2024

విద్వేషాలు రెచ్చగొట్టే సందేశాలు సోషల్ మీడియాలో పంపవద్దు: డీఎస్పీ

image

ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియా లేదా వాట్సాప్‌లలో ఎటువంటి విద్వేషాలు రెచ్చగొట్టే సందేశాలు, ఫొటోలు పోస్టు చేస్తే ఆ గ్రూప్ అడ్మిన్స్ వారే పూర్తి భాద్యత వహించాలని పాలకొండ డీఎస్పీ జీవీ కృష్ణరావు శనివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఎగ్జిట్ పోల్స్ తరువాత ఎటువంటి విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు పెట్టరాదన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.

News June 1, 2024

నరసన్నపేట: టిప్పర్ బోల్తా.. తప్పిన పెను ప్రమాదం

image

నరసన్నపేట మండలం లుకులాం-కొమనాపల్లి రహదారి మార్గంలో ఉర్లాం సమీపంలో శుక్రవారం మట్టిని తరలిస్తున్న టిప్పర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఆ సమయంలో రహదారిపై ఎటువంటి వాహనాలు రాకపోకలు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. వాహనంలో ఉన్న డ్రైవర్ క్లీనర్‌తో పాటు వారంతా సురక్షితంగా బయటపడ్డారు. వేసవి తీవ్రత ఎక్కువగా ఉండటంతో రహదారిలో వాహనాల రద్దీ తగ్గడంతో పెను ప్రమాదమే తప్పిందని స్థానికులు తెలిపారు.

News June 1, 2024

నేటి నుంచి రెండు పూటలా అంగన్వాడీ కేంద్రాలు

image

శ్రీకాకుళం జిల్లాలోని 16 ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని 3, 358 అంగన్వాడీ కేంద్రాలు శనివారం నుంచి రెండు పూటలు పనిచేయనున్నాయి. వేసవి నేపథ్యంలో మే నెలలో ఒక్క పూట మాత్రమే కేంద్రాలు నిర్వహించారు. శనివారం నుంచి రెండు పూటలా అంగన్వాడీ కేంద్రాలు ఉంటాయని సిబ్బంది అందరూ తప్పనిసరిగా హాజరు కావాలని ఉన్నతాధికారులు సూచించారు.

News June 1, 2024

శ్రీకాకుళం: నేటి నుంచి కాలేజీలు పునః ప్రారంభం

image

నూతన విద్యా సంవత్సరానికి సంబంధించి శ్రీకాకుళం జిల్లాలోని జూనియర్ కాలేజీలు శనివారం నుంచి పునః ప్రారంభం కానున్నాయి. నేటి నుంచే కళాశాలలో క్లాసులు కూడా మొదలుకానున్నాయి. ప్రభుత్వ ఆదేశాలు మేరకు 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఇప్పటికే ఇంటర్మీడియట్ బోర్డు నిర్దేశిత వార్షిక క్యాలెండర్‌ను కూడా విడుదల చేసింది. జిల్లావ్యాప్తంగా మొత్తం 168 జూనియర్ కళాశాలలో ఉండగా ఇందులో 38 ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి.

News June 1, 2024

శ్రీకాకుళం: నేటి నుంచి 5వ తేదీ వరకు పెన్షన్ పంపిణీ

image

శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 3,19,702 మంది పింఛనుదారులు ఉన్నారు. వీరికి రూ.93.30 కోట్ల నిధులను విడుదల చేశారు. ఈ పెన్షన్లలో 2,38,993 మంది లబ్ధిదారులకు రూ.71.69 కోట్లు నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. మిగిలిన 80,709 మందికి రూ.21.60 కోట్లను జూన్ 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు జిల్లాలోని 732 గ్రామ వార్డు సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ ఇతర సిబ్బంది నేరుగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పెన్షన్ పంపిణీ చేస్తారు.

News June 1, 2024

నేడే ఎగ్జిట్ పోల్స్.. సిక్కోలులో గెలుపెవరిది.?

image

ఎన్నికల ఫలితాల కోసం శ్రీకాకుళం జిల్లా ప్రజల ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో నేటి సాయంత్రం 6.30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 10 అసెంబ్లీ, 1 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఆయా చోట్ల ఎవరికి గెలుపు అవకాశాలున్నాయో ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయనున్నాయి. ఈ నేపథ్యంలో మీ MLA, MPగా ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారో COMMENT చేయండి.