Srikakulam

News April 30, 2024

శ్రీకాకుళం: రూ.1.36 కోట్ల విలువైన బంగారం సీజ్

image

ఎలక్షన్ నోటిఫికేషన్ వెలువడిన మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్ 28వ తేదీ వరకు పట్టుబడిన నగదు వివరాలను జిల్లా అధికారులు మంగళవారం వెల్లడించారు. ఎటువంటి పత్రాలు లేకుండా రూ.1,30,18,920 నగదును సీజ్ చేశారు. బంగారం విషయానికొస్తే 2,901 గ్రాముల బంగారాన్ని ఇప్పటివరకూ స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.1,36,80,284 గా ఉంది. అలాగే 26,581 గ్రాముల వెండిని కూడా స్వాధీనం చేసుకోగా, దీని విలువ రూ.14,41,669 గా ఉంది.

News April 30, 2024

శ్రీకాకుళం: ఎలక్షన్ కోడ్ ఎఫెక్ట్ 459 మంది అరెస్టు

image

నగదు, మద్యం, గంజాయి వంటి అక్రమ రవాణా కేసులలో ఇప్పటివరకు 459 మందిని అరెస్టు చేయగా 716 కేసులకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు అధికారులు మంగళవారం వెల్లడించారు.. ఇందులో భాగంగా 36 మోటార్ సైకిళ్లు, 13 కార్లు, ఒక వ్యాను, రెండు ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.87 లక్షలుగా ఉంది. అలాగే సరైన పత్రాలు లేని కారణంగా 13 మొబైల్ ఫోన్లు, 10 చేతి గడియారాలు, 14 చీరలు, పదివేల టీ షర్టులు, 2500 కరపత్రాలు సీజ్ చేశారు.

News April 30, 2024

శ్రీకాకుళం: 7,812 మంది వాలంటీర్ల రాజీనామా

image

జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించిన ఘటనలు 93 చోటు చేసుకోగా వాటిలో 34 కేసుల్లో ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. 67 మంది ప్రభుత్వ ఉద్యోగులకు నోటీసులు జారీ చేయగా 39 మందిని సర్వీస్ నుంచి తొలగించారు. 17 మందిపై ఇంకా చర్యలు తీసుకోవాల్సి ఉంది. అలాగే 7812 మంది గ్రామ, వార్డు వాలంటీర్లు తమ విధులకు రాజీనామా చేశారు. ఇంకా ఎంసీసీ నిబంధనలు ఉల్లంఘించిన 26 మంది రాజకీయ నాయకులపై 17 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు.

News April 30, 2024

ఎన్నికల విధులు సజావుగా సాగాలి: కలెక్టర్ 

image

సాధారణ ఎన్నికలు 2024 నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఎన్నికల విధులు సజావుగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డా.మనజీర్ జిలానీ సమూన్ పేర్కొన్నారు. పి.ఓలు, ఎపీఓల శిక్షణా తరగతులకు ఆయన హాజరయ్యారు. పోలింగ్ కేంద్రంలో ఎన్నికల విధులు సజావుగా నిర్వహించాల్సిన బాధ్యత ప్రిసైడింగ్ అధికారులు, సహాయ పోలింగ్ అధికారులపై ఉందన్నారు.

News April 30, 2024

 మెలియాపుట్టి: 17 వేల లీటర్ల బెల్లం ఊట ధ్వంసం

image

మెలియాపుట్టి మండలంలోని మర, బాలేరు గ్రామాలతో పాటు ఒడిశాలోని మర్రిగుడ్డి, కొయ్యర గ్రామంలో ఎస్ఈబీ, పాతపట్నం, మెలియాపుట్టి, ఒడిశా పోలీసు బృందాలు నాటుసారాపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 17 వేల లీటర్ల బెల్లం ఊట, 370 లీటర్ల నాటుసారాను ధ్వంసం చేసినట్లు ఎస్ఈబీ అధికారులు తెలిపారు. ఎస్ఈబీ ఉన్నతాధికారులు టీ.తిరుపతినాయుడు, ఐ.ఏ బేగం తదితర సిబ్బంది పాల్గొన్నారు.

News April 30, 2024

పలాసలో వడదెబ్బతో వ్యక్తి మృతి

image

మండలంలోని బ్రాహ్మణతర్ల- కేదారిపురం గ్రామాలకు వెళ్లే రహదారి పక్కన పొలంలో మంగళవారం ఓ వృద్ధుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఎండకు వడదెబ్బ తగిలి అస్వస్థతకు గురై మృతి చెంది ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అలాగే టెక్కలిలోనూ మరో వ్యక్తి వడ దెబ్బతో మృతి చెందారు. స్థానికులు చుట్టు పక్కల గ్రామస్థులకు సమాచారం అందించారు. ఎవరైనా మృతదేహాన్ని గుర్తిస్తే కుటుంబ సభ్యులకు తెలపాలని కోరారు.

News April 30, 2024

కోటబొమ్మాళి: టీడీపీలో చేరిన వాలంటీర్లు

image

కోటబొమ్మాళి మండలం నిమ్మాడ గ్రామపంచాయతీ పరిధిలో ఇటీవల వాలంటీర్ విధులకు రాజీనామా చేసిన 17 మంది అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో టీడీపీలోకి చేరారు. ఈ సందర్భంగా పలువురు వాలంటీర్లు మాట్లాడుతూ.. నెలకు రూ. 5 వేలు భృతితో నిష్పక్షపాతంగా విధులు నిర్వహిస్తున్న తమ వద్ద బలవంతంగా రాజీనామా పత్రాలు రాయించుకున్నారని వాపోయారు.

News April 30, 2024

టెక్కలిలో వడదెబ్బతో వ్యక్తి మృతి

image

టెక్కలి మండలం బన్నువాడ గ్రామానికి చెందిన పోలాకి రామారావు(70) అనే వృద్ధుడు మంగళవారం వడదెబ్బకు గురై మృతి చెందాడు. మంగళవారం ఉదయం గ్రామంలో పొలంకి వెళ్లిన సమయంలో ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురై అపస్మారక స్థితికి చేరుకోవడంతో కుటుంబసభ్యులు హుటాహుటిన టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో కుటుంబంలో విషాదం నెలకొంది.

News April 30, 2024

శ్రీకాకుళం జిల్లాలో ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఉన్నాయంటే?

image

శ్రీకాకుళం జిల్లాలో సాధారణ ఎన్నికల్లో భాగంగా మే 13న జిల్లా వ్యాప్తంగా 2,049 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేయనున్నారు. ఇచ్చాపురం నియోజకవర్గ పరిధిలో 299, పలాస పరిధిలో 284, టెక్కలి పరిధిలో 315, పాతపట్నం పరిధిలో 323, శ్రీకాకుళం పరిధిలో 279, ఆమదాలవలస పరిధిలో 259, ఎచ్చెర్ల పరిధిలో 309, నరసన్నపేట పరిధిలో 290 చొప్పున పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేయనున్నారు.

News April 30, 2024

ఇచ్ఛాపురంలో పిడుగుపాటుకు ఐదుగురికి గాయాలు

image

పట్టణంలో సోమవారం పిడుగులతో కూడిన చిరుజల్లులు కురిశాయి. బహుదానదీ తీరంలో ఒడిశా గ్రామం వద్ద ఇటుకల పరశ్రమలో పనిచేసే కార్మికులు , తమ గుడిసెల్లో ఉండగా పిడుగు పడడంతో ఐదుగురు గాయపడ్డారు.కుటుంబీకులు ఇచ్ఛాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు.