Srikakulam

News April 26, 2024

శ్రీకాకుళం: ముమ్మరంగా నామినేషన్ దరఖాస్తుల పరిశీలన

image

సాధారణ ఎన్నికలు-2024 జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మనజీర్ జీలానీ సమూన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం పార్లమెంట్, నియోజకవర్గ అభ్యర్థుల నామినేషన్ దరఖాస్తుల పరిశీలన కార్యక్రమం కలెక్టర్ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా సాధారణ పరిశీలకులు శేఖర్ విద్యార్థితో కలిసి కలెక్టర్ నామినేషన్ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం వారికి పలు సూచనలు చేసి దిశానిర్దేశం చేశారు.

News April 26, 2024

శ్రీకాకుళం: CPI మేనిఫెస్టో విడుదల

image

మే13న జరిగే ఎన్నికలలో BJP, BJPతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్న పార్టీలను ఓడించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం నగరంలోని క్రాంతి భవన్‌లో CPI ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని ఆయన అన్నారు. కార్యక్రమంలో చాపర సుందరలాల్, యుగంధర్, డోల శంకరరావు, తమిరి తిరుపతిరావు, వెంకటరావు తదితరులు ఉన్నారు.

News April 26, 2024

శ్రీకాకుళం: ఎన్నికల నియంత్రణ కేంద్రం పరిశీలిన

image

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లాకు నియమితులైన వ్యయ పరిశీలకులు, ఐఆర్ఎస్ అధికారులైన కోమల్ జిత్ మీనా, శరవణ కుమార్, నవీన్ కుమార్ సోనీలు శుక్రవారం కలెక్టరేట్‌లోని జిల్లా ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ (ఎన్నికల నియంత్రణ కేంద్రం)ను పరిశీలించారు. ఎన్నికల కంట్రోల్ రూమ్ ఇన్‌ఛార్జ్, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్లు అన్ని విభాగాలను పరిచయం చేశారు.

News April 26, 2024

ఎల్.ఎన్.పేట: భార్య మరణం తట్టుకోలేక భర్త మృతి

image

ఎల్.ఎన్.పేట మండలం శ్యామలాపురం పునరావాస కాలనీలో ఉంటున్న నెల్లి అమ్ములు (69) గురువారం రాత్రి మృతిచెందింది. శుక్రవారం ఉదయం ఈమె దహన సంస్కరాలకు కుటుంబ సభ్యులు సిద్ధం చేస్తున్నారు. అక్కడే రోదిస్తూ ఉన్న అమ్ములు భర్త ఏకాశి (77) ఆమెకు చివరి స్నానం చేయిస్తూ కుప్పకూలిపోయాడు. కొన్ని గంటల వ్యవధిలోనే భార్యాభర్తల మృతి చెందడంతో గ్రామంలో విషాదం అలముకుంది. 

News April 26, 2024

ఎచ్చెర్ల: యోగా పీజీ డిప్లమా కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం

image

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో యోగా, ఫిట్‌నెస్ మేనేజ్మెంట్ విభాగం నిర్వహిస్తున్న ఏడాది యోగా పీజీ డిప్లమా కోర్సులో చేరేందుకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి.సుజాత గురువారం తెలిపారు. జూన్ 15 లోగా దరఖాస్తు చేసుకోవాలని ఆమె పేర్కొన్నారు. రూ.500 అపరాధ రుసుముతో జూన్ 27లోగా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

News April 26, 2024

ఎచ్చెర్లలో ఒకే పేరు.. అభ్యర్థులు వేరు

image

ఎచ్చెర్లలో వైసీపీ నుంచి గొర్లె కిరణ్‌కుమార్ పోటీ చేస్తుండగా, గొర్లె కిరణ్‌కుమార్ అనే మరొకరు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు. కూటమి తరఫున నడుకుదిటి ఈశ్వరావు ఉండగా.. అదే పేరుకు దగ్గరగా నడుపూరి ఈశ్వరరావు, నేతల ఈశ్వరరావు స్వతంత్రులుగా పోటీలో ఉన్నారు. కాగా శ్రీకాకుళం వ్యాప్తంగా వివిధ పార్టీలకు చెందిన 175 మంది అభ్యర్థులు 223 నామినేషన్లు వేయగా.. రెండుసార్లు వచ్చినవి తీసేయడంతో 123 మంది మిగిలారు.

News April 26, 2024

కోటబొమ్మాళి: ట్రాక్టర్ ఢీకొని యువకుడి మృతి

image

కోటబొమ్మాళి- సంతబొమ్మాళి రహదారిలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీను(18) మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోటబొమ్మాళి నుంచి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న చీపుర్లపాడు పంచాయతీ దుర్గంపేటకు చెందిన చిదపాన శ్రీనును సీతన్నపేట సమీపంలో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

News April 26, 2024

శ్రీకాకుళం: కంట్రోల్ రూం పరిశీలన

image

నూతన కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంను ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించి జనరల్ అబ్జర్వర్ సందీప్ కుమార్ గురువారం పరిశీలించారు. కంప్లైంట్ మోనిటరింగ్ సెల్, సీ-విజిల్స్ టీం, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్, పోస్టల్ బ్యాలెట్, ఎక్సైజ్ కంట్రోల్ రూం, పోలీస్ కంట్రోల్ రూం, తదితర వాటిని ఆయన పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

News April 25, 2024

శ్రీకాకుళంలో నామినేషన్ల వివరాలు

image

శ్రీకాకుళం పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి స్వతంత్ర అభ్యర్థులు, పార్టీలకు చెందిన అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేసిన వారి వివరాలు ఇలా ఉన్నాయి.1.కాయ దుర్గారావు, 2.బేత వివేకానంద మహరాజ్, 3.BYC పార్టీ నుంచి బోరుభద్ర చంద్రకళ, 4.శ్రవణ్ కుమార్, 5.PPI పార్టీ నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా కారి లక్ష్మణ్ గురువారం ఉదయం నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు.

News April 25, 2024

ఎచ్చెర్ల: హాల్ టిక్కెట్ల విడుదల

image

శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ డిగ్రీ 2వ సెమిస్టర్, 4వ సెమిస్టర్ పరీక్షల హాల్ టికెట్లు గురువారం విడుదలయ్యాయి. ఈ మేరకు యూనివర్సిటీ ఎగ్జామినేషన్ డీన్ ఎస్.ఉదయ్ భాస్కర్ విడుదల చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. హాల్ టికెట్లు జ్ఞానభూమి పోర్టల్‌లో ఉన్నాయని డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు అరగంట ముందే చేరుకోవాలని ఆయన సూచించారు.