India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావుకు టెక్కలితో ప్రత్యేక అనుబంధం ఉంది. టీడీపీ వ్యవస్థాపకుడిగా 1994లో జరిగిన ఎన్నికల్లో ఆయన టెక్కలి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. టెక్కలి పరిసర ప్రాంత ప్రజల ఆరోగ్యం కోసం అప్పట్లో టెక్కలికి ప్రాంతీయ ఆసుపత్రిని మంజూరు చేశారు. పట్టణంలోని పాత జిల్లా ఆసుపత్రి ఆవరణలో ఉన్న ఒక మహావృక్షం ఎన్టీఆర్ గుర్తుగా ఉంది. నేడు ఆయన జయంతి.
జూన్ 4తేదిన కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగే విధంగా ప్రతీ ఒక్కరూ సహకరించాలని కలెక్టర్ డాక్టర్ మనజిర్ జిలానీ సమూన్ పేర్కొన్నారు. సోమవారం ఎస్పీ జి.ఆర్.రాధికతో కలిసి ఎచ్చెర్ల మండలంలోని శ్రీ శివాని ఇంజినీరింగ్ కళాశాలను ఇరువురు సందర్శించారు. అనంతరం కౌంటింగ్ రోజున తీసుకోవలసిన జాగ్రత్తలు, భద్రత ఏర్పాట్లును పరిశీలించారు. కౌంటింగ్ రోజున పటిష్ఠమైన భద్రత ఉండాలన్నారు.
పాలిటెక్నిక్ ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియను జూన్ 3 వరకు నిర్వహించనున్నట్లు సాంకేతిక విద్యాశాఖ రాష్ట్ర డైరెక్టర్ నాగరాణి తెలిపారు. స్థానిక పాలిటెక్నిక్ కళాశాలలో కౌన్సెలింగ్ ప్రక్రియ సోమవారం ప్రారంభమవ్వగా ప్రభుత్వ కళాశాలల్లో చేరేందుకు విద్యార్థులు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. శ్రీకాకుళం మహిళా ప్రభుత్వ పాలిటెక్నిక్, టెక్కలి, ఆమదాలవలస, సీతంపేట పాలిటెక్నిక్ కళాశాలల్లో 780 సీట్లు ఉన్నాయన్నారు.
కౌంటింగ్ కేంద్రాల వద్ద ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, డాక్టర్ మనజీర్ జిలాని సమూన్ ఆదేశించారు. డ్రై రన్ అనంతరం శ్రీ శివానీ ఇంజినీరింగ్ కళాశాలలో రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. అందరూ కౌంటింగ్ అంశాలపై దృష్టి సారించాలని ఆదేశించారు. తప్పిదాలు జరగరాదని స్పష్టం చేశారు. ఆర్ఓ, ఎంఆర్ఓ పక్కాగా కచ్చితత్వంతో ఉండాలన్నారు.
పాలీసెట్ కౌన్సెలింగ్ హాజరయ్యే అభ్యర్థులు కింది ధ్రువపత్రాలు తెచ్చుకోవాల్సి ఉంటుందని సంబంధిత అధికారులు సూచించారు. ఈ మేరకు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. * ఆన్‌లైన్ ఫీజు చెల్లించిన రసీదు * పాలీసెట్ హాల్ టికెట్,ర్యాంక్ కార్డు * SSC మార్కుల జాబితా * 4- 10 తరగతుల స్టడీ సర్టిఫికెట్/ రెసిడెన్షియల్ సర్టిఫికెట్ * EWS వర్తించే వారికి సంబంధిత ధ్రువపత్రాలు * ప్రత్యేక కేటగిరిని నిర్ధారించే ధ్రువపత్రాలు.
సీతంపేట మండలం పెదరామ పంచాయతీ ఉమ్మరవెల్లి గ్రామ సమీపంలో సోమవారం ఆటో బోల్తా పడిన ఘటన తెలిసిందే. ఆటోలో 18 మంది గిరిజనులు ప్రయాణిస్తుండగా బోల్తా పడటంతో సవర కార్తీక్(10) అనే అబ్బాయి మృతి చెందాడు. ప్రయాణికులంతా సీతంపేట సంతకు వచ్చి తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రుల్లో ఏడుగురిని సీతంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరో ఏడుగురిని శ్రీకాకుళం రిమ్స్‌కి తీసుకెళ్లారు.
ఎన్నికల కౌంటింగ్ దగ్గర పడుతున్న వేళ సోమవారం అధికారులు నిర్వహించిన తనిఖీల్లో రికార్డులు లేని 26 ద్విచక్ర వాహనాలను పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఎస్పీ రాధిక ఆదేశాల మేరకు ఆయా మండలాల సర్కిల్ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, డీఎస్పీల ఆధ్వర్యంలో ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనంతరం వాహన పాత్రలు లేని 26 ద్విచక్ర వాహనాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
శ్రీకాకుళం జిల్లా పలాస మండలం శాసనాం గ్రామ సమీప జాతీయ రహదారిపై సోమవారం మధ్యాహ్నం ఓ బొలెరో లగేజీ వ్యాన్ అదుపుతప్పి వంతెన గోడకు ఢీకొంది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం నేషనల్ హైవే సిబ్బంది, పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.
సీతంపేట మండలం కొత్తగూడ పంచాయతీ వంబరెల్లి సమీపంలో సోమవారం సంత ముగించుకొని వెళ్తున్న ఆటో ప్రమాదానికి గురైంది. ఆటోలో ఉన్న 17 మందికి తీవ్ర గాయాలవ్వగా.. హుటా హుటిన సీతంపేట ఆసుపత్రికి తరలించారు. వారిలో ఏడుగురిని మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.
ఇచ్ఛాపురానికి చెందిన ఏడేళ్ల పార్థివ్ శ్రీవత్సల్ ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డులో రెండు సార్లు స్థానం సాధించారు. తండ్రి అప్పలనాయుడు గణిత టీచర్‌గా పని చేస్తుండగా..తల్లి ఓ ప్రభుత్వ పాఠశాలలో ఎస్జీటీగా విధులు నిర్వర్తిస్తున్నారు. మూడో తరగతికే టెన్త్ స్థాయి లెక్కల్లో ప్రావీణ్యం చూపుతున్నాడు. రెండు నిమిషాల్లో 197 జాతీయ జెండాలను గుర్తించడంతో పాటు ఈ బాలుడు 1నిమిషంలో క్యూబ్ చేయగలడు.
Sorry, no posts matched your criteria.