Srikakulam

News May 26, 2024

శ్రీకాకుళం: ఏయూ డిగ్రీ 6వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలు విడుదల

image

ఆంధ్రా విశ్వవిద్యాలయంలో డిగ్రీ 6వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు పరీక్షల విభాగం డీన్ ఆచార్య డివిఆర్ మూర్తి పరీక్షా ఫలితాలను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పరీక్ష ఫలితాలను యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు తెలిపారు. ఈ డిగ్రీ 6 సెమిస్టర్ పరీక్షల మొత్తం 27,603 మంది పరీక్షకు హాజరవ్వగా 27,483 మంది ఉత్తీర్ణత సాధించారని 99.57 శాతం ఉత్తీర్ణత నమోదైందని అన్నారు.

News May 26, 2024

నందిగాం:హైవేపై బోల్తా పడిన లగేజీ వ్యాన్

image

శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం ఆకుల నందిగాం జంక్షన్ సమీప జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం టెక్కలి నుంచి పలాస బియ్యం లోడుతో వెళ్తున్న ఓ లగేజీ వ్యాన్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ చిన్నపాటి గాయాలతో బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న నేషనల్ హైవే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి, వాహనాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించారు.

News May 26, 2024

టెక్కలి: పదో తరగతి పరీక్షల్లో అనూహ్య పరిణామం

image

టెక్కలిలో జరుగుతున్న పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో శనివారం అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. స్థానిక బాలికోన్నత పాఠశాలలో జరిగిన హిందీ పరీక్షకు టెక్కలి, నందిగాం, సంతబొమ్మాళి, మెలియాపుట్టి మండలాల నుంచి 57 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా, 52 మంది పరీక్షకు గైర్హాజరయ్యారు. దీంతో 5మంది విద్యార్థులకు పరీక్ష నిర్వహించగా ఒక్కోక్కరికి ఒక్కో రూమ్ కేటాయించారు. వీరి కోసం మొత్తం 9 మంది విధులు నిర్వహించారు.

News May 26, 2024

శ్రీకాకుళం: 112 టేబుళ్లు.. 173 రౌండ్లు

image

ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎచ్చెర్లలోని శివాని ఇంజినీరింగ్ కళాశాలలో జూన్ 4న జరగనుంది. జిల్లాలోని 8 అసెంబ్లీ, శ్రీకాకుళం పార్లమెంటు లెక్కింపు ఇక్కడే చేపట్టనున్నారు. ఓట్ల లెక్కింపునకు 8 గదులు సిద్ధం చేశారు. ప్రతి నియోజకవర్గానికి 14 టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఎంపీ స్థానానికి మొత్తం 112 టేబుళ్ల వద్ద 173 రౌండ్లలో లెక్కింపు చేపడతారు. ప్రతి నియోజకవర్గానికి సహాయ రిటర్నింగ్ అధికారులను నియమించారు.

News May 26, 2024

పలాస: రైలు ప్రయాణికులకు ఊరటనిచ్చే వార్త

image

ప్రయాణికుల రద్దీ మేరకు పలాస మీదుగా చెన్నై, భువనేశ్వర్ మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు జూన్ 10 నుంచి జూలై 1 వరకు ప్రతి సోమవారం చెన్నై- భువనేశ్వర్(నెం.06073), జూన్ 11 నుంచి జూలై 2 వరకు ప్రతి మంగళవారం భువనేశ్వర్- చెన్నై(నెం.06074) మధ్య ఈ రైళ్లు నడుపుతున్నామన్నారు. ఈ రైళ్లు ఏపీలో విజయవాడ, రాజమండ్రి, విజయనగరంతో పాటు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయని చెప్పారు.

News May 26, 2024

శ్రీకాకుళం: ప్రశాంతంగా డిప్యూటీ డీఈవో పరీక్ష

image

ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఉద్యోగాలకు శనివారం పరీక్ష నిర్వహించారు. జిల్లాలో నాలుగు కేంద్రాల్లో ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు ఆన్‌లైన్‌లో ఈ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. శ్రీ శివానీ ఇంజినీరింగ్ కళాశాల (చిలకపాలెం)లో 100కు 68 మంది, వెంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాల (ఎచ్చెర్ల)లో 100కు 72 మంది పరీక్ష రాశారు. నరసన్నపేటలోని కోర్ టెక్నాలజీ కేంద్రంలో 330 మందికి 233 మంది హాజరయ్యారు.

News May 26, 2024

శ్రీకాకుళం: రేపటి నుంచి పాలిసెట్ సర్టిఫికేట్ల పరిశీలన

image

పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశం కోసం పాలిసెట్-2024 రాసిన అభ్యర్థులు ఫీజు చెల్లించిన వారు ఈ నెల 27 నుంచి జూన్ 3వ తేదీలోగా శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలోని హెల్ప్‌లైన్‌ కేంద్రంలో సర్టిఫికేట్ల పరిశీలన నిర్వహించుకోవాలి. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 5 ప్రభుత్వ, 5 ప్రైవేటు పాలిటెక్నిక్‌ కళాశాలలు ఉన్నాయి. జిల్లాలో మొత్తం 10,871 మంది పాలిసెట్ రాశారు. ఇందులో 9,576 మంది అర్హత సాధించారు.

News May 26, 2024

రాజాం స్వతంత్ర అభ్యర్థిపై కేసు నమోదు

image

సార్వత్రిక ఎన్నికల్లో రాజాం నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన ఎన్ని రాజు, ఆయన ఇద్దరు అనుచరులపై సంతకవిటి పోలీసులు శనివారం కేసు నమోదుచేశారు. ఇద్దరు మైనర్లను బెదిరించి, జైలులో పెడతామని భయపెట్టి చేతులతో కొట్టిన ఘటనలో బాలుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంతకవిటి ఎస్ఐ షేక్ శంకర్ కేసు నమోదు చేశారు. ఎన్ని రాజుతోపాటు ఆయన అనుచరులు మీసం శ్రవణ్, తూముల యోగేంద్ర పై కేసు నమోదు అయినట్లు ఎస్సై తెలిపారు.

News May 26, 2024

ఎచ్చెర్ల: స్ట్రాంగ్ రూములు ఎస్పీ పరిశీలన

image

ఎచ్చెర్ల మండలంలోని చిలకపాలెం శ్రీ శివాని ఇంజినీరింగ్ కళాశాలను ఎస్పీ జీ.ఆర్.రాధిక శనివారం రాత్రి సందర్శించి, ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూములు, భద్రత ఏర్పాట్లు, సీసీ కెమెరాలు ద్వారా నిఘాను ఆమె పర్యవేక్షించారు. అనంతరం గార్డు సిబ్బందితో మాట్లాడి వివరాలు ఆరా తీశారు. నిరంతరం నిర్లక్ష్యం లేకుండా అప్రమత్తతో విధులు నిర్వహించాలని ఆమె సూచించారు.

News May 25, 2024

పోలాకి: వంశధార నది రేవు వద్ద వ్యక్తి మృతి

image

పోలాకి మండలం పల్లిపేట గ్రామానికి సమీపంలో గల వంశధార నది రేవు వద్ద గుర్తు తెలియని మృతదేహం లభ్యమైనట్లు స్థానిక పోలీసులు శనివారం తెలిపారు. మృతుని వయసు సుమారు 50 సంవత్సరాలు ఉంటుందని అన్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.