Srikakulam

News April 22, 2024

శ్రీకాకుళం జిల్లాకు సీఎం జగన్

image

సీఎం జగన్మోహన్ రెడ్డి ఈనెల 24వ తేదీన జిల్లాలో పర్యటించనున్నారని వైసీపీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సీఎం చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా ఈనెల 23న రాత్రి ఎచ్చెర్ల నియోజకవర్గానికి చేరుకుంటారన్నారు. అక్కడే రాత్రి బస చేసి, 24న శ్రీకాకుళం, నరసన్నపేట, టెక్కలి నియోజకవర్గాల్లో బస్సు యాత్రను చేపడతారన్నారు. టెక్కలిలో ఈ బస్సుయాత్ర ముగుస్తుందని అన్నారు.

News April 22, 2024

శ్రీకాకుళం: పెళ్లి వేడుకలో కరెంట్ షాక్‌తో మృతి

image

రణస్థలం మండలం అల్లివలసలో మరో నిమిషాల్లో తాళి కట్టాల్సి ఉండగా.. ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మైలపల్లి లక్ష్ముడు ఇంట్లో ఆదివారం రాత్రి జరుగుతున్న వివాహ వేడుకల్లో విద్యుత్ షాక్ తగిలి ఒకరు మృతి చెందగా.. 12మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంలో జీరుపాలెంకు చెందిన అంబటి సీతమ్మ(45) మరణించగా.. గాయపడిన వారు రణస్థలంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

News April 21, 2024

శ్రీకాకుళం: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

image

హిరమండలంలోని దాసుపురం గ్రామానికి చెందిన సిద్ధమడుగుల శంకర్రావు (26) చవితి సీది వెళ్తుండగా కోడూరు దగ్గరలో బైక్ అదుపు తప్పి రోడ్డుపై పడిపోయినట్లు హిరమండలం పోలీసులు తెలిపారు. వారి కథనం ప్రకారం.. ఈ ప్రమాదంలో అతని ముఖం రోడ్డును బలంగా తాకి తీవ్ర గాయాలవడంతో అక్కడికక్కడే మరణించాడు. ఈ మేరకు ఘటనా స్థలాన్ని పరిశీలించిన హిరమండలం ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

News April 21, 2024

ఎన్నికల నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు: కలెక్టర్ 

image

సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. మనజీర్ జిలాని సమూన్ అన్నారు. ఆదివారం ఆయన వజ్రపు కొత్తూరు మండలంలో పర్యటించారు. ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి అధికారులకు కీలక సూచనలు చేశారు. ఇప్పటికే చేసిన ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. కేంద్ర ఎన్నికల సంఘం దిశా నిర్దేశాల్లో ఎటువంటి తేడా వచ్చినా సంబంధిత అధికారులదే బాధ్యత అన్నారు.

News April 21, 2024

ఎన్నికల నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు: కలెక్టర్ 

image

సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. మనజీర్ జిలాని సమూన్ అన్నారు. ఆదివారం ఆయన వజ్రపు కొత్తూరు మండలంలో పర్యటించారు. ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి అధికారులకు కీలక సూచనలు చేశారు. ఇప్పటికే చేసిన ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. కేంద్ర ఎన్నికల సంఘం దిశా నిర్దేశాల్లో ఎటువంటి తేడా వచ్చినా సంబంధిత అధికారులదే బాధ్యత అన్నారు.

News April 21, 2024

బగ్గు రమణమూర్తి ఆస్తులివే..

image

*అభ్యర్థి పేరు: బగ్గు రమణమూర్తి
*నియోజకవర్గం:నరసన్నపేట
*పార్టీ: టీడీపీ
*కేసులు: లేవు
*చరాస్తులు: రూ.2.38 కోట్లు
*స్థిరాస్తులు: రూ.64.09 కోట్లు
*వ్యవసాయేతర ఆస్తులు: రూ.3.50కోట్లు
*రుణాలు:రూ.63.25 లక్షలు
NOTE: ఎలక్షన్ అఫిడవిట్ ప్రకారం.

News April 21, 2024

శ్రీకాకుళం జిల్లా అభ్యర్థులకు భీపామ్‌లు అందించిన చంద్రబాబు

image

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మంగళగిరిలో శ్రీకాకుళం అసెంబ్లీ అభ్యర్థులకు భీపామ్‌లు అందించారు. శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడు, గొండు శంకర్ (శ్రీకాకుళం), గౌతు శీరిష (పలాస), బెందాళం అశోక్(ఇచ్ఛాపురం), కూన రవికుమార్(ఆమదాలవలస), అచ్చెన్నాయుడు (టెక్కలి), మామిడి గోవిందరావు(పాతపట్నం), బగ్గు రమణమూర్తి (నరసన్నపేట) భీపామ్‌లు అందుకున్నారు.

News April 21, 2024

పాలకొండ: రహదారి ప్రమాదంలో వివాహిత మృతి

image

పాలకొండ డివిజన్ కేంద్రంలో పురటాల పోలమ్మ ఆలయం వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనం లారీని ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో వీరఘట్టం మండలం విక్రమ్‌పురం గ్రామానికి చెందిన వివాహిత అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాన్ని పాలకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పాలకొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News April 21, 2024

SKLM: యువకుడి ఆత్మహత్యాయత్నం

image

మెలియాపుట్టికి చెందిన ఆర్ జగదీశ్వరరావు అనే యువకుడు ఆదివారం ఉదయం పీక కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కార్పెంటర్‌గా జీవనం సాగిస్తున్న అతని ఉదయం మెడ భాగంలో కోసుకున్నాడు. తీవ్రంగా గాయపడిన యువకుడిని కుటుంబసభ్యులు చికిత్స కోసం టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో 108లో శ్రీకాకుళం తీసుకెళ్లారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియరాలేదు.

News April 21, 2024

టెక్కలి: ఆర్ధో వైద్యుడిపై దాడి.. కారు ధ్వంసం

image

టెక్కలి జిల్లా ఆసుపత్రిలో ఆర్ధో వైద్యునిగా విధులు నిర్వహిస్తున్న రాజేష్‌పై శనివారం రాత్రి గుర్తుతెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. ఒక స్థలానికి సంబంధించి చోటుచేసుకున్న వివాదం నేపథ్యంలో అతడు శ్రీకాకుళం వెళ్తున్న నేపథ్యంలో కారు ఆపి అద్దం ధ్వంసం చేశారు. కారులో ఉన్న వైద్యుడిని కిందకి దింపి గొడవ చేశారు. ఘటనపై టెక్కలి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.