India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పటిష్ఠమైన భద్రతతో ఓట్ల లెక్కింపు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులు, కలెక్టర్లకు ఆయన ఆదేశించారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల నిర్వహణ ఏర్పాట్లపై గురువారం జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. భద్రత, సి.సి. టివిలు ఏర్పాట్లు పటిష్టంగా ఉండాలన్నారు. శిక్షణ పూర్తి చేయాలని చెప్పారు.
ప్రయాణికుల రద్దీ మేరకు పలాస మీదుగా చెన్నై ఎగ్మోర్, సత్రాగచ్చి(పశ్చిమ బెంగాల్) మధ్య స్పెషల్ ట్రైన్స్ నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. జూన్ 4 నుంచి జులై 2 వరకు ప్రతి మంగళవారం చెన్నై ఎగ్మోర్-సత్రాగచ్చి (నం.06079), జూన్ 5 నుంచి జూలై 3 వరకు ప్రతి బుధవారం సత్రాగచ్చి-చెన్నై ఎగ్మోర్ (నం.06080) ట్రైన్లు నడుపుతున్నామన్నారు. ఈ రైళ్లు ఏపీలోని విజయనగరం, దువ్వాడతో పాటు పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయన్నారు.
రేపు శుక్రవారం శ్రీకాకుళం జిల్లా పరిధిలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) అధికారులు తెలిపారు. ఈ మేరకు APSDMA ఎండీ రోణంకి కూర్మనాథ్ తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. అటు పొరుగున ఉన్న పార్వతీపురం, అల్లూరి జిల్లాలలో సైతం రేపు అక్కడక్కడ వర్షాలు పడతాయని APSDMA వర్గాలు పేర్కొన్నాయి.
బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం శనివారం నాటికి క్రమంగా తుఫానుగా మారే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. తుఫాను కారణంగా ఆదివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని APSDMA అధికారులు ఈ మేరకు తాజాగా హెచ్చరికలు జారీ చేశారు. మే 26 సాయంత్రానికి బంగ్లాదేశ్ & పశ్చిమబెంగాల్ తీరాలకు ఈ తుఫాను తీవ్ర తుఫానుగా చేరుకుంటుందని APSDMA స్పష్టం చేసింది.
బీఈడీ కోర్సులలో ప్రవేశాలకు నిర్వహించే ఎడ్‌సెట్-2024 పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఆన్‌లైన్ దరఖాస్తులలో తప్పులు దొర్లి ఉంటే ఏపీ ఉన్నత విద్య మండలి సవరించుకునే అవకాశం కల్పించింది. ఈ మేరకు అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తులలో కరెక్షన్స్ ఉంటే ఈ నెల 25లోపు సరిదిద్దుకోవచ్చని సూచించింది. పూర్తి వివరాలకు https://cets.apsche.ap.gov.in/ వెబ్‌సైట్ చూడాలని ఉన్నత విద్యా మండలి స్పష్టం చేసింది.
2019 ఎన్నికలలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని అసెంబ్లీ సెగ్మెంట్‌లలో ఎచ్చెర్లలో “NOTA”కు అత్యధిక ఓట్లు పడగా, ఆముదాలవలసలో అత్యల్ప ఓట్లు పడ్డాయి. ఈ మేరకు ఎచ్చెర్ల స్థానంలో “NOTA”ను 4,628 మంది ఎంచుకోగా, ఆముదాలవలస స్థానంలో 2,656 మంది “NOTA”కు ఓటేశారు. ఈ ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లాలో “NOTA” ఎన్ని ఓట్లు తెచ్చుకుంటుందో జూన్ 4న తెలియనుంది.
విజయనగరంలోని కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ అందించే పలు పీజీ కోర్సుల దరఖాస్తు గడువును పొడిగించారు. ఈ మేరకు ఆయా పీజీ కోర్సులలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ నెల 26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వర్శిటీ వర్గాలు తెలిపాయి. అడ్మిషన్లకై https://ctuapcuet.samarth.edu.in/pg/ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సెంట్రల్ వర్సిటీ వర్గాలు స్పష్టం చేశాయి.
టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 25వ తేదీన అండర్-18 జిల్లాస్థాయి రగ్బీ రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా స్థాయి ఎంపికలు నిర్వహించనున్నట్లు శ్రీకాకుళం జిల్లా రగ్బీ అసోసియేషన్ అధ్యక్షుడు రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి పార్వతీశంలు గురువారం తెలిపారు. 2006 నుంచి 2008 మధ్య కాలంలో జన్మించిన వారు పోటీలకు అర్హులని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు ఆర్గనైజింగ్ సెక్రటరీ నారాయణరావును సంప్రదించాలని కోరారు.
ప్రయాణికుల రద్దీ మేరకు శ్రీకాకుళం రోడ్, పలాస మీదుగా నాగర్‌కోయిల్(NCJ), డిబ్రుగర్(DBRG) మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. నం.06103 NCJ-DBRG రైలును జూన్ 7, 14, 21 తేదీలలో, నం.06104 DBRG-NCJ రైలును జూన్ 12, 19, 26 తేదీలలో నడుపుతామని తెలిపారు. ఈ రైళ్లు ఏపీలో ఒంగోలు, నెల్లూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, విజయనగరం తదితర ప్రధాన స్టేషన్లలో ఆగుతాయని రైల్వే అధికారులు చెప్పారు.
ఇచ్చాపురం మండలం డోంకూరులో బుధవారం అర్ధరాత్రి ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు, మృతురాలి భర్త తెలిపిన వివరాల ప్రకారం.. వాసుపల్లి ఉష(30) కొద్దిరోజులుగా తలనొప్పితో బాధపడుతుంది. బుధవారం తీవ్రమైన తలనొప్పి రాగా, భరించలేక ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. భర్త వాసుపల్లి రామారావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దంపతులకు నందన(10), రిత్విక్(5) సంతానం.
Sorry, no posts matched your criteria.