Srikakulam

News April 20, 2024

నందిగాం: బైక్ మీద నుంచి జారిపడి మహిళ మృతి

image

నందిగం మండలం పెంటూరు గ్రామానికి చెందిన కూర్మాపు సరోజిని(48) కుమారుడు రమేష్‌కు ఈనెల 24న వివాహం నిశ్చయమైంది. పెళ్లి సామగ్రి కొనుగోలు చేసేందుకు కుమారుడుతో కలిసి శుక్రవారం బైక్ పై పలాస వెళ్లి తిరిగి వస్తుండగా మార్గ మధ్యలో జారిపడి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. మరో 5 రోజుల్లో పెళ్లి జరగాల్సిన ఇంట్లో విషాదం నెలకొంది.

News April 20, 2024

దువ్వాడ శ్రీనివాస్‌ ఆస్తుల వివరాలు

image

టెక్కలి వైసీపీ అభ్యర్థి దువ్వాడ క్రిమినల్ కేసులు, తీవ్ర ఆర్థిక నేరారోపణలు ఉన్నాయి. ఒడిశా ప్రభుత్వానికి వ్యాట్, జీఎస్టీ, మైనింగ్ ఛార్జీల కింద రూ.19.03 కోట్ల అప్పులున్నాయి. శ్రీనివాస్ పేరిట రూ.4.41 కోట్లు, భార్య మీద రూ.49 లక్షల చరాస్తులున్నాయి. వీరి స్థిరాస్తుల విలువ రూ.5.50 కోట్లు, రుణం రూ.1.36 కోట్లు. బంగారం 4.6 కిలోలు, వెండి 7.9 కిలోల ఉంది. చేతిలో నగదు రూ.15లక్షలు. *NOTE:ఎలక్షన్ అఫిడవిట్ ప్రకారం.

News April 20, 2024

శ్రీకాకుళంలో ఓటర్లు జాబితా ఇలా

image

శ్రీకాకుళం జిల్లాలో మహిళా ఓటర్లు – పురుష ఓటర్లు
1.ఇచ్ఛాపురం 1,37,254 – 1,30,544
2.పలాస 1,11,709 – 1,06,877
3.టెక్కలి 1,18,129 – 1,17,511
4.పాతపట్నం 1,12,696 – 1,12,095
5.శ్రీకాకుళం 1,37,488 – 1,34,866
6.ఆముదాలవలస 97,477 – 95,987
7.నరసన్నపేట 1,07,434 – 1,06,841
8.మొత్తం ఓటర్లు 8,22,187 – 8,04,721

News April 19, 2024

శ్రీకాకుళం జిల్లాలో రెండో రోజు అసెంబ్లీ నామినేషన్లు వేసింది వీరే..

image

➤ శ్రీకాకుళం: BCYP అభ్యర్థిగా P.ప్రసాద్
➤ పలాస:TDP అభ్యర్థులుగా G.శిరీష, INCP అభ్యర్థిగా M.త్రినాధ్ బాబు
➤ ఎచ్చెర్ల: YCPఅభ్యర్థిగా G.కిరణ్ కుమార్, BSP అభ్యర్థిగా G.రామారావు
➤టెక్కలి: INCP అభ్యర్థిగా K.కృపారాణి, YCP D.శ్రీనివాస్,
➤పాతపట్నం:TDP అభ్యర్థిగా మామిడి గోవిందరావు, ➤ఆమదాలవలస:TDP అభ్యర్థిగా K. రవికుమార్ నామినేషన్లు వేశారు.

News April 19, 2024

రాజాంలో ప్రచారరథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు

image

రాజాం పట్టణంలో వైసీపీ ప్రచారరథం ఢీకొని భరద్వాజ్(10) అనే బాలుడు మృతి చెందిన ఘటన అత్యంత విషాదకరమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ప్రచార రథాన్ని నడిపిన నిర్లక్ష్యం నడిపి.. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ అందించలేని వైసీపీ పాలనా నిర్లక్ష్యం మరొకటని మండిపడ్డారు. భరద్వాజ్ కుటుంబ సభ్యులకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

News April 19, 2024

జిల్లా ఎస్పీని కలిసిన పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు

image

సార్వత్రిక ఎన్నికలు -2024 శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల (ఎక్స్పెండిచర్) పరిశీలకలు కె.కె.శరవణ కుమార్ జిల్లా ఎస్పీ జి.ఆర్.రాధికను శుక్రవారం సాయంత్రం శ్రీకాకుళం జిల్లా పోలీసు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పి పుష్పగుచ్చాన్ని అందజేసి ఆయనను స్వాగతం పలికారు. అనంతరం ఎన్నికల సన్నద్ధతపై జిల్లా ఎస్పి ఎన్నికల పరిశీలకలు చర్చించారు.

News April 19, 2024

శ్రీకాకుళం: తొలి రోజు వాళ్లదే బోణీ

image

శ్రీకాకుళం జిల్లాలో తొలి రోజు స్వతంత్ర అభ్యర్థులే నామినేషన్లు వేశారు. ప్రధాన పార్టీల నుంచి ఎవరూ వేయలేదు. ఇక శ్రీకాకుళం స్థానానికి ఒక్క నామినేషన్ కూడా పడలేదు. జిల్లాలో 8 స్థానాలు ఉంటే నాలుగుస్థానాల్లో మాత్రమే నామినేషన్లు దాఖలు కాగా.. అందులో 6 నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. మిగిలిన నాలుగింటిలో ఒక్క నామినేషన్ కూడా పడలేదు.

News April 19, 2024

కవిటి: పాడె మోసిన మాజీ ఎమ్మెల్యే

image

కవిటి మండలం వరకకు చెందిన బెంతు ఒరియా సంఘం అధ్యక్షుడు శ్యాంసుందర్ పురియా తుదిశ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న మాజీ MLA, వైసీపీ నేత పిరియా సాయిరాజ్, వైసీపీ కవిటి మండల అధ్యక్షుడు కడియాల ప్రకాశ్ శ్యాంసుందర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం పాడె మోసి అంతిమయాత్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్యాంసుందర్ మృతితో వైసీపీ కీలక నేతను కోల్పోయిందని సాయిరాజ్ అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆశించారు.

News April 19, 2024

శ్రీకాకుళం: చెడు వ్యసనాలకు బానిసై.. ఆత్మహత్య

image

కుటుంబకలహాలతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన కోటబొమ్మాళి మండలం చీపుర్లపాడు పంచాయితీ ఊడికలపాడులో చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం ప్రకారం.. గ్రామానికి చెందిన నేతింటి రమేష్(36) చెడు వ్యసనాలకు బానిసగా మారాడు. కుటుంబకలహాలతో గురువారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం అలుముకుంది.

News April 19, 2024

శ్రీకాకుళం: ఈనెల 24 చివరి గడువు

image

ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ, బెటర్మెంట్ పరీక్షలకు హాజరు కాబోయే విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లింపునకు ఈనెల 24తో గడువు ముగిస్తుందని శ్రీకాకుళం ఆర్ఐఓ పి. దుర్గారావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు ఆన్లైన్ ద్వారా ఈనెల 24లోగా అప్లై చేసుకోవాలని సూచించారు. ప్రాక్టికల్స్ లో ఫెయిల్ అయిన వారికి మే 1 నుంచి 4 వరకు పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.