Srikakulam

News April 18, 2024

శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గానికి నామినేషన్లు నిల్

image

శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి మొదటి రోజు గురువారం ఎటువంటి నామినేషన్లు రాలేదని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలాని సమూన్ తెలిపారు. గురువారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్ కోసం ఎవరు దాఖలాలు చేసుకోలేదని ఆయన స్పష్టం చేశారు.

News April 18, 2024

టెక్కలి ఎమ్మెల్యేగా దువ్వాడ వాణీ పోటీ..?

image

టెక్కలి ఎమ్మెల్యేగా జడ్పీటీసీ దువ్వాడ వాణీ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈనెల 22న ఆమె నామినేషన్ వేయనున్నట్లు సమాచారం. వైసీపీ సీనియర్ మహిళా నాయకురాలుగా ఉన్న ఆమె టెక్కలి వైసీపీ అసెంబ్లీ టికెట్‌ను ఆశించారు. టెక్కలి వైసీపీ అభ్యర్థిగా శుక్రవారం దువ్వాడ శ్రీనివాస్ నామినేషన్ వేయనుండగా.. ఆయన భార్య కూడా బరిలో ఉండనున్నట్లు వార్తలు వస్తున నేపథ్యంలో టెక్కలిలో రాజకీయం ఆసక్తిగా మారింది.

News April 18, 2024

శ్రీకాకుళం: నేడు, రేపు భానుడి భగభగలు

image

నిన్నటి వరకు మోస్తరు వర్షాలు, చలిగాలులతో ఉపశమనం పొందిన ప్రజలకు ఎండలు మళ్లీ దంచికొడుతున్నాయి. బుధవారం జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల సెల్సియస్ పైగా నమోదయ్యాయి. గరిష్ఠంగా శ్రీకాకుళం(D) విజయనగరం, పార్వతీపురంమన్యం(D) సీతంపేట మండలాల్లో 42.7 డిగ్రీలు నమోదైంది. నేడు, రేపు ఉష్ణోగ్రతలు మరో 2-3 డిగ్రీలు పెరగొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి అని సూచించారు.

News April 18, 2024

శ్రీకాకుళం: నామినేషన్ స్వీకరణ కేంద్రాలివే..

image

ఆర్డీవో, శ్రీకాకుళం, ఆమదాలవలస తహశీల్దారు కార్యాలయం, పాతపట్నం తహశీల్దారు కార్యాలయం, ఇచ్ఛాపురం తహశీల్దారు కార్యాలయం, పలాస తహశీల్దార్ కార్యాలయం, టెక్కలి తహశీల్దారు, నరసన్నపేట, ఎచ్చెర్ల తహశీల్దార్ కార్యాలయాలో నామపత్రాలు స్వీకరిస్తారు. నామపత్రాలు నేటి నుంచి 25 వరకు స్వీకరిస్తారు. 26న అధికారులు నామపత్రాలను పరిశీలిస్తారు.

News April 18, 2024

గార: వత్సవలసలో పిడుగుపాటుకు మహిళ మృతి

image

పిడుగుపాటుకు గురై మహిళ మృత్యువాత పడిన ఘటన గార మండలంలో బుధవారం చోటుచేసుకుంది. వత్సవలస పంచాయతీ మొగదాల పాడు గ్రామానికి చెందిన కుందు భాగ్యలక్ష్మి (39) బుధవారం సాయంత్రం ఆకాశం మేఘావృతమై ఉండటంతో ఆరేసిన దుస్తులు తీసేందుకు ఇంట్లో నుంచి బయటకు వెళ్లారు. ఆ సమయంలో పిడుగుపాటుకు గురయ్యారు. భాగ్యలక్ష్మి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. దీనిపై తమకు ఫిర్యాదు అందలేదని గార ఎస్సై కె. కృష్ణప్రసాద్ పేర్కొన్నారు.

News April 18, 2024

శ్రీకాకుళం: నామినేషన్.. ఇవి తప్పక గుర్తించుకోండి

image

* అసెంబ్లీ అభ్యర్థి నియోజకవర్గ పరిధిలో పార్లమెంట్ అభ్యర్థి జిల్లా కేంద్రంలో నామపత్రాలు పత్రాలు సమర్పించాలి. *నిబంధనల ప్రకారం అధికారిక సెలవు రోజుల్లో మిగిలిన అన్ని రోజుల్లోనూ నామపత్రాలను స్వీకరిస్తారు. * ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు తీసుకుంటారు *రిటర్నింగ్ అధికారి గదిలో సీసీ కెమెరాలు ఉంటాయి. వీడియోగ్రఫీ చేస్తారు. * కార్యాలయానికి వంద మీటర్ల పరిధిలో మూడు వాహనాలను మాత్రమే అనుమతిస్తారు.

News April 18, 2024

కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి: ఎస్పీ

image

సారా, మద్యం అక్రమ రవాణా కేసుల్లో పెండింగ్‌ కేసుల పురోగతిపై అధికారులతో ఎస్పీ రాధిక బుధవారం సాయంత్రం ఎస్పీ కార్యాలయంలో నేర సమీక్ష నిర్వహించారు. పెండింగ్‌ అరెస్టులు, కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కేసుల సత్వర పరిష్కారం కోసం కేసుల దర్యాప్తు వేగవంతం చేసి త్వరితగతిన నిందితులకు శిక్ష పడేవిధంగా చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ ప్రేమ్ కాజల్ ఉన్నారు.

News April 17, 2024

స్థానిక సంస్థలను జగన్ నిర్వీర్యం చేశారు: ఎంపీ

image

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కీలకపాత్ర పోషించే స్థానిక సంస్థలను సీఎం జగన్ నిరంకుశ వైఖరితో నిర్వీర్యం చేసారని కూటమి ఎంపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే అభ్యర్థి శంకర్ విమర్శించారు. సర్పంచుల పవర్ ఏంటో జగన్ కు రానున్న ఎన్నికల్లో తెలిసివస్తుందని ఆయన పేర్కొన్నారు. శ్రీకాకుళం గ్రామీణ మండలం సింగుపురంలో బుధవారం ప్రజాగళం-బాబు సూపర్ సిక్స్ ప్రచార కార్యక్రమం నిర్వహించారు.

News April 17, 2024

ఎన్నికలకు సిబ్బంది సిద్ధంగా ఉండాలి: ఎస్పీ రాధిక

image

ఈ నెల 18తేదిన నుంచి ఎన్నికల నామినేషన్ ప్రక్రియ నిర్వహణకు స్థానిక పోలీసు అధికారులు తగు జాగ్రత్తల చర్యలు చేపట్టాలని ఎస్పీ రాధిక ఆదేశించారు. ప్రశాంతంగా నామినేషన్ ప్రక్రియ పూర్తయిన వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎస్సైలు, సీఐలు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో సందర్శించాలన్నారు. క్షేత్రస్థాయిలో స్వయంగా ఆయా గ్రామాల కు వెళ్లి ప్రజలతో మమేకమవ్వాలన్నారు.

News April 17, 2024

శ్రీకాకుళం: అప్పులు బాధ తాళలేక ఆత్మహత్య

image

నియోజకవర్గ పరిధి రూరల్ మండలం ఒప్పంగి గ్రామానికి చెందిన మంత్రి శ్రీధర్ (38) అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు నిర్ధారించారు. మునసబుపేట సమీపంలోగల ఓ లేఅవుట్ వద్ద మృతి చెందిన విషయాన్ని స్థానికులు ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. రూరల్ ఎస్సై ఎం.వాసుదేవరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.