India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కౌంటింగ్ ఏర్పాట్లు పక్కాగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజిర్ జిలాని సమూన్ అధికారులను ఆదేశించారు. కౌంటింగ్ రోజున పటిష్ఠమైన భద్రత ఉండాలన్నారు. కౌంటింగ్ ఏర్పాట్లపై కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా ఎస్పీ జి.ఆర్.రాధికతో కలిసి సోమవారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతిభద్రతల దృష్ట్యా జిల్లాలో 144 సెక్షన్ కొనసాగాలన్నారు. ఎన్నికల కోడ్ అమలు కొనసాగించాలన్నారు.
కోటబొమ్మాలి మండలం నిమ్మాడ పంచాయతీ చిన్న వెంకటాపురం గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త తోట మల్లేష్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు బయలుదేరిన శ్రీకాకుళం వైసీపీ ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్ సోమవారం బయలు దేరారు. అయితే కణితివూరులో పోలీసులు తిలక్‌ను హౌస్ అరెస్ట్ చేశారు. మల్లేష్ అంతిమయాత్రలో కూడా పాల్గొనకుండా చేయడంపై తిలక్ అసహనం వ్యక్తం చేశారు.
మడ్డువలస నుంచి తన స్వగ్రామమైన వీరఘట్టం మండలం నందివాడ బైకుపై వస్తోన్న గౌతం మోటార్ సైకిల్ మడ్డువలస, సరసనాపల్లి మధ్య శుక్రవారం అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో గౌతం తీవ్రంగా గాయపడ్డాడు. అతడి తలకు బలమైన గాయం కావడంతో గత రెండు రోజులుగా శ్రీకాకుళంలో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు ఎస్సై జనార్దన్ రావు తెలిపారు. చిన్న వయసులోనే మృతి చెందడంతో అతడి స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఎన్నికలు తుది ఫలితాలు వరకు 144 సెక్షన్, ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని శ్రీకాకళం ఎస్పీ జి.ఆర్ రాధిక అన్నారు. ఈ మేరకు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నమోదైన కేసుల దర్యాప్తు, ముద్దాయిలు అరెస్టు, ప్రాపర్టీ సీజ్ తదితర అంశాలపై ఆదివారం సాయంత్రం జిల్లా పోలీసు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం గ్రామాల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పీకెట్లు నియమించాలని సూచించారు.
ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఏపీ ఈఏపీ 25-2024 జిల్లాలోని నాలుగు కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు. నాలుగో రోజు ఆదివారం మధ్యాహ్నం పరీక్ష జరిగింది. ఎచ్చెర్లలోని రెండు ఇంజినీరింగ్ కళాశాలలు, నరసన్నపేటలోని ఒక కేంద్రం, టెక్కలిలోని ఓ ఇంజినీరింగ్ కళాశాల కేంద్రాల్లో 999 హాజరు కాగా 38 మంది గైర్హాజరయ్యారు.
నరసన్నపేట మండలం చోడవరం ఎస్సీ కాలనీకి చెందిన బక్క నీలం పెంచుకుంటున్న 30 మేకలను శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. పశువుల శాలలో కట్టిన 55 మేకల్లో 30 మూగజీవాలను ఎత్తుకెళ్లారని బాధితుడు తెలిపారు. ఈ మేరకు ఆదివారం నరసన్నపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని తెలిపారు. మేకల విలువ సుమారు రూ.3 లక్షలు ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో టెక్కలికి చెందిన మల్లిపెద్ది ప్రణవ్ సాయి అనే విద్యార్థి 62వ ర్యాంకు సాధించాడు. తూర్పుగోదావరి జిల్లాలోని ఒక ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదివిన ప్రణవ్ సాయి తెలంగాణ ఎంసెట్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగంలో 132.4 మార్కులు సాధించి ఇటీవల విడుదలైన ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 62వ ర్యాంకు సాధించి ప్రతిభ కనబరిచాడు. విద్యార్థిని పలువురు స్థానికులు అభినందించారు.
శ్రీకాకుళం నగరంలోని బాదుర్లపేటకు చెందిన పి.రమేశ్(18) మృత్యువాత పడ్డాడు. నగరంలోని నాగావళి నదికి స్నేహితులతో కలిసి రమేశ్ ఆదివారం స్నానానికి వెళ్లాడు. నదిలో స్నానం చేస్తూ ఊబిలో చిక్కుకొని ప్రమాదవశాత్తు అతడు మునిగిపోయాడు. నీటిలో మునగడంతో వెంటనే అతడిని బయటకు తీసి హుటాహుటిన శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అప్పటికే రమేశ్ మృతి చెందినట్లు ధ్రువీకరించారు.
శ్రీకాకుళం జిల్లా నిప్పులకొలిమిలా మారింది. మే నెల కావడంతో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఆదివారం తీవ్రమైన ఎండతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఏకంగా 35-40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే శ్రీకాకుళం, ఎచ్చెర్ల, పలాసలో తీవ్రమైన వడగాల్పులు వీస్తున్నాయి. పలు మండలాల్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ప్రజలు అల్లాడి పోతున్నారు.
ఎన్నికల ఫలితాలు మరో 15రోజుల్లో వెలువడనున్నాయి. మన MLA ఎవరనేది తేలిపోనుంది. అంతలోనే నియోజకవర్గాల్లో బెట్టింగులు జోరుగా సాగుతున్నాయి. అభ్యర్థులు గెలుపోటములు, మెజారిటీలపై పందేలు కాస్తున్నారని తెలుస్తోంది. ఈ వ్యవహారం రూ.లక్షల్లో సాగుతుందని టాక్. మరోవైపు పలు పార్టీల నేతలు ప్రజలను ఎప్పటికప్పుడు ఓటు ఎవరికి వేశారన్నదానిపై ఆరా తీస్తూ అంచనాలు వేస్తున్నారు. – మరి మీ MLA ఎవరవుతారు..? తాజా పరిస్థితి ఏంటి..?
Sorry, no posts matched your criteria.