India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తెలంగాణ ఈఏపీసెట్‌లో పాలకొండ మండలం ఎరకరాయపురం గ్రామానికి చెందిన విద్యార్థి పతివాడ జ్యోతిరాధిత్య ( H.NO.2423U01806) ఉత్తమ ప్రతిభ కనబరిచి ఇంజినీరింగ్‌లో మొదటి ర్యాంకు సాధించారు. రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు రావడంపై విద్యార్థి తల్లిదండ్రులు మోహన్‌రావు, హైమావతి హర్షం వ్యక్తం చేశారు. పలువురు స్థానికులు అభినందనలు తెలిపారు.
కిర్గిస్థాన్ దేశంలో జరుగుతున్న గొడవలు నేపథ్యంలో జిల్లాకు చెందిన సుమారు 250 మంది వైద్య విద్యార్థులు, రాష్ట్రానికి చెందిన సుమారు 2 వేల మంది చదువుకుంటున్న నేపథ్యంలో వారికి భద్రత కల్పించాలని కోరుతూ కేంద్ర మంత్రిత్వ శాఖకు జిల్లా ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు శనివారం లేఖ రాశారు. కిర్గిస్థాన్‌లో ఉన్న ఏపీ విద్యార్థులకు రక్షణ కల్పించాలని వాటికి తగిన చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు.
స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పటిష్ఠ భద్రతా ప్రమాణాలు పాటించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా, జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా.మనజీర్ జీలాని సమూన్ సూచించారు. ఈ మేరకు ఎచ్చెర్ల శివాని ఇంజినీరింగ్ కళాశాలలో భద్రపరిచిన ఈవీఎం స్ట్రాంగ్ రూమ్‌లు అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తమీమ్ అన్సారియా, ఎస్పీ జి.ఆర్ రాధికా పాల్గొన్నారు.
వరకట్న వేధింపుల కేసులో భర్త, అత్తకు ఏడేళ్లు జైలు శిక్ష విధిస్తూ సోంపేట సెషన్స్ కోర్టు న్యాయమూర్తి టి.భాస్కరరావు శుక్రవారం తీర్పు చెప్పారు. హిరమండలం మండలం, తంప గ్రామానికి చెందిన హారతి అనే వివాహిత 2020లో భర్త తిరుమలరావు, అత్త లిమ్మమ్మ వేధింపులకు ఆత్మహత్య చేసుకుంది. పుట్టింటి వారి ఫిర్యాదు మేరకు డీఎస్పీ రారాజు కేసు నమోదు చేశారు. ఎస్సై నారాయణస్వామి నిందితులను కోర్టులో హాజరు పరిచినట్లు చెప్పారు.
శ్రీకాకుళం జిల్లాలోని రెండో పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ ఉమామహేశ్వరరావు పలువురికి మంచిని బోధించారు.
తెలిసో తెలియక చేసిన తప్పులు కారణంగా సమాజంలో రౌడీషీటర్లుగా ముద్రపడే వారంతా నడవడిక మార్చుకుంటే రౌడీ షీట్లు ఎత్తివేస్తామన్నారు. ఎస్పీ రాధిక ఆదేశాలతో శుక్రవారం స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్లతో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఎన్నికల సమయంలో ఉన్న మాదిరిగానే మిగతా సమయంలోను ప్రశాంతంగా కుటుంబంతో గడపాలన్నారు.
శ్రీవారికి స్వరార్చన వారి నేతృత్వంలో పద కవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్య జయంతి వార్షికోత్సవాలు పట్టణంలోని స్ధానిక కత్తెర వీధి శ్రీ రాజరాజేశ్వరీ ఆలయంలో ఈ నెల 23 తేదీ గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు జరుగనుంది. శ్రీకాకుళం పరిసర ప్రాంత గాయనీ గాయకులు అన్నమాచార్య కీర్తనలతో స్వరార్చన చేస్తారని అనంతరం విశాఖపట్నానికి చెందిన కళాకారులు చే గాత్ర కచేరీ ఉంటుందని నిర్వహకులు తెలిపారు,.
మెడికల్ డిప్లమా ఫలితాల్లో సిక్కోలు విద్యార్థిని సత్తా చాటింది. ఈ రోజు విడుదలైన డిప్లమా ఇన్ క్యాత్ లాబ్ టెక్నాలజీ ఫలితాల్లో ఆమదాలవలస మండలం చీమలవలసకు చెందిన పేడాడ లలిత కుమారి 360కి 306 మార్కులతో స్టేట్ టాపర్‌గా నిలిచింది. రాగోలులోని జేమ్స్ ఆసుపత్రిలో లలితకుమారి ఈ కోర్స్ అభ్యసించింది. వైద్యరంగంలో మరింత సేవ చేసేందుకు ఈ ఫలితాలు అవకాశం కల్పించాయని ఆమె ఆనందం వ్యక్తం చేశారు.
మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వరాదని పోలీసులు హెచ్చరించారు. శుక్రవారం జిల్లాలోని ముఖ్య కూడళ్లలో జిల్లా ఎస్పీ జీ.ఆర్ రాధిక ఆదేశాలతో ‘విజిబుల్ పోలీసింగ్’ లో భాగంగా వాహన తనిఖీలు నిర్వహించారు. అనంతరం వారు రికార్డులు పరిశీలించి, లేని వారికి జరిమానాలు విధించారు. సరైన ధ్రువపత్రాలు లేకుండా వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు. అక్రమ రవాణాకు అవకాశం లేకుండా పటిష్ఠ చర్యలు చేపట్టామన్నారు.
నరసన్నపేట మండల కేంద్రంలోని స్థానిక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలకు జిల్లా కలెక్టర్ మనజీర్ జీలాని సమూన్‌కు ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. శుక్రవారం రాత్రి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఆలయ కమిటీ సభ్యులతో పాటు ఆలయ ధర్మకర్త పొట్నూరు కృష్ణ ప్రసాద్ ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకొని బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు.
మందస మండలం దున్నవూరు గ్రామానికి చెందిన దున్న కృష్ణారావు, స్వాతి దంపతుల కుమార్తె దున్న ప్రత్యూష(7) కరాటిలో చిన్న నాటి నుంచి ప్రావీణ్యం సంపాదించింది. ఇటీవల మే 10 నుంచి 12 వ తేదీ వరకు మలేషియాలో జరిగిన ఓపెన్ ఛాంపియన్ షిప్‌లో గోల్డ్ మెడల్ సాధించింది. ఈ విషయం తెలియడంతో దున్నవూరు గ్రామస్థులు, తల్లిదండ్రులు చిన్నారిని అభినందించారు. కాగా తండ్రి దున్న కృష్ణారావు ఉపాధి నిమిత్తం హైదరాబాదులో ఉన్నారు.
Sorry, no posts matched your criteria.