Srikakulam

News April 14, 2024

శ్రీకాకుళం: చెరువులో చేపల వేటకు పోటీపడ్డ గ్రామస్థులు

image

నందిగాం మండలం పాత్రునివలస గ్రామానికి జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న చెరువులో ఆదివారం చేపలు పట్టేందుకు గ్రామస్థులు నిర్ణయించుకున్నారు. గ్రామ పెద్దల ఆదేశాల మేరకు ఉదయం గ్రామంలో ఉన్న వారంతా చెరువులో చేపలు పట్టేందుకు ఒక్కసారిగా వందలాది మంది చెరువులో దిగి పోటీపడ్డారు. ఇలా ఒక్కసారిగా చేపలవేట సాగిస్తున్న గ్రామస్థులను అటుగా వెళుతున్న ప్రయాణికులు ఆశ్చర్యంగా చూశారు. ఈ రోజు గ్రామమంతా చేపల కూరే మరీ.

News April 14, 2024

కొత్తూరు: మామిడి చెట్టు ఎక్కుతూ జారిపడి వ్యక్తి మృతి

image

కొత్తూరు మండలం గూనభద్ర ఆపోజిట్ కాలనీలో అదే కాలనీకి చెందిన మీసాల మిన్నారావు(33) మామిడి చెట్టు ఎక్కుతూ జారిపడి అక్కడికక్కడే మృతి చెందాడు. శనివారం కాలనీలో రోడ్డు పక్కన ఉన్న మామిడి చెట్టు నుంచి కాయలు తీసేందుకు చెట్టు ఎక్కాడు. పట్టు తప్పి చెట్టు మీద నుంచి జారిపడి బలమైన గాయం కావడంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పోస్టుమార్టానికి తరలించారు.

News April 14, 2024

సోంపేట: లారీ చక్రాల కింద పడి వ్యక్తి మృతి

image

సోంపేట మండలం బారువా జంక్షన్ సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాజాం గ్రామం నుంచి బెంకిలి గ్రామానికి టీవీఎస్ మోటార్ సైకిల్‌పై డొక్కరి నరేష్ తన మిత్రులతో కలిసి వెళ్తుండగా.. వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో డొక్కరి నరేష్ లారీ చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తి గాయాలతో బయటపడడంతో.. హైవే సిబ్బంది ఆసుపత్రికి తరలించారు.

News April 14, 2024

సర్‌బుజ్జిలి యువకుడి కిడ్నాప్ కలకలం

image

వ్యక్తి కిడ్నాప్‌కు యత్నించిన ఘటన విశాఖ ఎంవీపీ స్టేషన్ పరిధిలో జరిగింది. సరుబుజ్జిలి మండలానికి చెందిన యుగంధర్ శనివారం విశాఖలో క్యాబ్‌ బుక్ చేసుకొని బీజేపీ కార్యాలయం వద్ద ఉండగా అప్పుడే కారులో ఐదుగురు అతడిని బలవంతంగా ఎక్కించుకొని వెళ్లారు. గమనించిన డ్రైవర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగా విశాఖకు చెందిన యువతితో వివాహేతర సంబంధం ఉంటటంతో ఆమె భర్త కిడ్నాప్‌నకు యత్నించినట్లు పోలీసులు తెలిపారు.

News April 14, 2024

శ్రీకాకుళం: కంట్రోల్ రూంను సందర్శించిన జిల్లా కలెక్టర్

image

కొత్త కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంను జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలాని సమూన్ శనివారం సందర్శించారు. కంట్రోల్ రూంలో ఎంసీఎంసీ, సోషల్ మీడియా, డిస్ట్రిక్ట్ కాంటాక్ట్ సెంటర్ 1950, కంప్లైంట్ మోనిటరింగ్ సెల్, పోలీసు కంట్రోల్ రూం, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్, సీ-విజిల్ విభాగాల్లో ఎన్ని ఫిర్యాదులు వచ్చాయని అడిగి తెలుసుకున్నారు.

News April 13, 2024

శ్రీకాకుళం: TODAY TOP NEWS

image

*24న టెక్కలిలో సీఎం జగన్ బస్సుయాత్ర ముగింపు
*శ్రీకాకుళం నుంచి భద్రాచలానికి ప్రత్యేక బస్సులు
* 22న అచ్చెన్నాయుడు నామినేషన్
*శ్రీకాకుళం: ఉరేసుకుని మహిళ ఆత్మహత్య
* నందిగం రహదారిపై కారు బోల్తా
*చంద్రబాబు ప్రజలను మోసం చేశాడు: ధర్మాన
*దిల్లీలో పాలకొండ సైనికుడు మృతి
*కొత్తూరు: ఆర్టీసీ బస్సులో గంజాయి లభ్యం
*15న పలాసకు చంద్రబాబు రాక
* రాజాంలో రూ.20 లక్షల నగలు స్వాధీనం
* నరసన్నపేటలో వాలంటీర్ల రాజీనామా

News April 13, 2024

శ్రీకాకుళం: సందేహాల పై టోల్ ఫ్రీ .. 1950

image

ఎన్నికలకు సంబంధించి ఏ అంశంపై నైనా సందేహాలు నివృత్తి చేసుకునేందుకు, ఫిర్యాదులు చేయడానికి జిల్లా కలెక్టరేట్‌లో టోల్‌ ఫ్రీ నంబరు 1950ను ఏర్పాటు చేశారు. ఎన్నికలకు సంబంధించి ఎవరైనా ఓటరు తమ సందేహాలు నివృత్తి చేసుకోవడానికి ఈ నంబరుకు ఫోన్‌ చేస్తే చాలు సమాధానం ఇచ్చేందుకు సిబ్బంది సిద్ధంగా ఉంటారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. ఫిర్యాదులు చేసేందుకు ప్రతి పౌరునికి హక్కు ఉంది.

News April 13, 2024

ఎన్నికల ప్రక్రియ శాంతియుతంగా నిర్వహించాలి:కలెక్టర్

image

ఎన్నికల ప్రక్రియ శాంతియుతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి డా.మనజీర్ జీలాని సమూన్ అన్నారు. ఈవీఎంల ర్యాండమైజేషన్ పూర్తి అయినందున వాటిని సంఘాల తరలింపు ప్రక్రియను కార్యక్రమాన్ని శనివారం చేపట్టారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద జరుగుతున్న ప్రక్రియను రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఎన్నికల కమిషన్ నిబంధనలను ప్రతి ఒక్కటి విధిగా పాటించాలన్నారు.

News April 13, 2024

ఢిల్లీలో పాలకొండకు చెందిన సైనికుడు మృతి

image

పాలకొండ మండలం గొట్ట మంగళాపురం గ్రామానికి చెందిన సామంతుల రాంబాబు (31) ఢిల్లీలో సీఐఎస్ఎఫ్ జవాన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల జరిగిన హోలీ సంబరాల్లో విద్యుత్ షాక్‌కు గురై ఢిల్లీలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందారని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కాగా మృతునికి 8 నెలల క్రితమే వివాహమైంది. నేడు ప్రత్యేక విమానంలో సైనికుని మృతదేహం స్వగ్రామానికి తీసుకురానున్నారు.

News April 13, 2024

రాజాంలో రూ.20 లక్షలు విలువ చేసే నగలు స్వాధీనం

image

రాజాం మండలం పొగిరి గ్రామం వద్ద ఏర్పాటు చేసిన ఎలక్షన్ చెక్ పోస్ట్ వద్ద రాజాo సిఐ దాడి మోహన్ రావు రూ.20 లక్షలు విలువచేసే 25 కేజీల వెండిని స్వాధీనం చేసున్నారు. విశాఖ నుంచి పాలకొండ వైపు వస్తున్న బస్సులో తనిఖీ చేయగా.. వారి వద్ద ఎటువంటి పత్రాలు లేకపోవడంతో వాటిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. ఇందులో భాగంగా ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు తెలిపారు.