India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గురువారం జిల్లాలో పర్యటిస్తారని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర మంత్రి గురువారం ఉదయం న్యూఢిల్లీలో బయలుదేరి విశాఖ ఎయిర్పోర్ట్ చేరుకొని, అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ఉదయం 10:30 గంటలకు శ్రీకాకుళం అంబేద్కర్ ఆడిటోరియం గురుపూజోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలిపారు.
ఓ టెక్కలి కుర్రాడు హీరోగా మారాడు. అతని సినిమా శుక్రవారం విడుదల కానుంది. ఆ హీరో కోళ్ల గణేశ్(చిన్నా). ఆ సినిమా స్పీడ్ 220. టెక్కలికి చెందిన గణేశ్ గత కొద్ది రోజులుగా చిత్రసీమలో రాణించడానికి ప్రయత్నించాడు. చివరకు హీరోగా మారాడు. ఇదే సినిమాలో గణేశ్‌తో పాటు హేమంత్ రెడ్డి మరో హీరోగా నటించారు. స్నేహం, ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్‌తో సినిమా తీశామని.. అందరూ ఆదరించాలని గణేశ్ కోరాడు.
జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయులుగా 78 మంది ఎంపికయ్యారని డీఈఓ తిరుమల చైతన్య బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హెచ్ఎం క్యాటగిరిలో 9 మంది, ఎస్ఏ(స్కూల్ అసిస్టెంట్) కేటగిరిలో 32 మంది, ఎస్జీటీ కేటగిరిలో 27 మంది, పిఈటి/పిడి కేటగిరీలో 8 మంది, కేజీబీవీ కేటగిరిలో ఇద్దరు ఎంపికయ్యారని తెలిపారు. వీరికి ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా సత్కరించి అవార్డులు ప్రదానం చేస్తామన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 7వ తేదీన ప్రభుత్వ వైన్స్‌లో పనిచేస్తున్న ఉద్యోగులంతా బంద్ చేపట్టనున్న విషయం తెలిసిందే. అయితే విజయవాడలోని వరదల కారణంగా బంద్‌ను తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు ఉద్యోగులు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం ఏపీఎస్ బిసియల్ డిపో మేనేజర్ సుబ్బారావుకు బుధవారం వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు.
తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదానికి అవసరమయ్యే జీడిపప్పును సరఫరా చేసేందుకు పలాసకు చెందిన వ్యాపారి కోరాడ సంతోశ్ టెండర్లు దక్కించుకున్నారు. మూడు రోజుల కిందట గ్లోబల్ విధానంలో టెండర్లు పిలిచారని అన్నారు. రోజుకు మూడు టన్నుల జీడిపప్పు తిరుపతి లడ్డూ తయారీకి అవసరమవుతుందన్నారు. సుమారు 45 సంవత్సరాల క్రితం తిరుపతికి పలాస జీడిపప్పు సరఫరా అయిందని ఆయన గుర్తు చేశారు.
శ్రీకాకుళంలోని శ్రీసూర్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితులకు స్వామివారి పులిహోర 10 వేల ప్యాకెట్లు, 10 వేల వాటర్ బాటిళ్లు సిద్ధం చేశారు. ఈ మేరకు వాటిని విజయవాడకు ప్రత్యేక వాహనంలో తరలించామని ఆలయ ఈవో రమేశ్ బాబు వెల్లడించారు. ఇలా శ్రీకాకుళం జిల్లా ప్రజల ఆరాధ్య దైవమైన స్వామివారి వరద బాధితుల ఆకలి తీర్చుతుండటంపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యలయంలో మంగళవారం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పోషణ మహా పోస్టర్ ఆవిష్కరించారు. మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖలో పోషణ్ అభియాన్‌లో భాగంగా నిర్వహిస్తున్న పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ పోషణ మహా కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న నెల రోజులు కార్యక్రమాలు క్రమం తప్పకుండా చేయాలన్నారు. ఆయనతో పాటు ఆ శాఖ పీడీ శాంతి శ్రీ, నోడల్ ఆఫీసర్ మణి ఉన్నారు.
రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శ్రీకాకుళం ఐటిఐ కళాశాలలో ఈనెల సెప్టెంబర్ 4 నుంచి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు నైపుణ్యాభివృద్ధి అధికారి పి.బి.సాయి శ్రీనివాస్ మంగళవారం తెలిపారు. జిల్లా పరిశ్రమల కేంద్రం, పరిశ్రమల అనుమతుల రుణాలకు సంబంధించి పరిశ్రమలు స్థాపించేందుకు గాను ఎనిమిది రోజులపాటు నిరుద్యోగ యువతకు శిక్షణ ఇస్తున్నామన్నారు.
తుఫాను కారణంగా జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో ఎక్కడైనా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు నష్టం వాటిల్లిన పంటనష్టం జరిగినా వెంటనే నివేధించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళం కలెక్టరేట్ నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు అంశాలపై ఆర్డీఓలు, తహశీల్దార్, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లతో మాట్లాడారు. మరో 2 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలన్నారు.
సంతబొమ్మాళి మండలం గొల్లసీతాపురానికి చెందిన బొమ్మాళి బాలరాజు(30)అనే యువకుడు బ్రెయిన్‌డెడ్ కావడంతో మంగళవారం కుటుంబసభ్యులు అవయవదానానికి ముందుకు వచ్చారు. టెక్కలి పంచాయతీ కార్యాలయం పరిధిలో కాంట్రాక్ట్ ఎలక్ట్రీషియన్‌గా విధులు నిర్వహిస్తున్న అతడు గత నెల 31వ తేదీన విద్యుత్ స్తంభం నుంచి జారిపడి తీవ్ర గాయాలయ్యాయి. రాగోలులోని జెమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Sorry, no posts matched your criteria.