India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కొత్తూరు మండలంలో విషాదం చోటు చేసుకుంది. బూర్జ గ్రామానికి చెందిన శ్రీహరి భార్య జయమ్మ తన కుమారుడు అభితో 13న ఓటు వేసేందుకు సొంత ఊరు పారాపురం వచ్చింది. మంగళవారం సాయంత్రం రిజర్వాయరులో వారు స్నానానికి దిగారు. స్నానం చేస్తున్న సమయంలో అభి లోపలకు వెళ్లడంతో మునిగిపోయాడు. పక్కనున్న జయమ్మ రక్షించేందుకు ప్రయత్నించగా అప్పటికే అభి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
నందిగాం మండలంలో విషాదం నెలకొంది. పెద్దలవునిపల్లెకు చెందిన శివానందం(24) పాము కాటుకు గురు మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. సోమవారం రాత్రి భోజనాలు ముగిసిన తర్వాత శివానందం తన తల్లి, సోదరుడితో ఇంట్లో నిద్రపోయారు. ఓ కట్లపాము అర్ధరాత్రి శివానందను కరిచింది. మంగళవారం ఉదయం అతడికి వాంతులు, విరేచనాలు అవడంతో ఏం జరిగిందో తెలియని కుటుంబీకులు శ్రీకాకుళం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 76.81శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. జిల్లాలో మొత్తం 18,75,934 మంది ఓటర్లు ఉండగా 14,40,885 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు తెలిపారు. వీరిలో మహిళలు 7,39,852 పురుషులు 7,01,016 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అత్యధికంగా ఎచ్చెర్ల నియెజకవర్గంలో 83 శాతం ఓటింగ్ నమోదైనట్లు తెలిపారు.
జిల్లాలోని కవిటి, కంచిలి, ఇచ్ఛాపురం, సోంపేట, మందస, వజ్రపుకొత్తూరు మండలాల పరిధిలో 35వేల ఎకరాల్లో కొబ్బరి సాగవుతోంది. కొబ్బరి పంటపై ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. వరుసగా తుఫాన్లు, తెగుళ్ల బెడదతో కొబ్బరి రైతులకు పంట నష్టం వాటిల్లుతోంది. ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా కొబ్బరి పంట నాశనమైంది. నిత్యం పచ్చదనంగా కనిపించే ఉద్దానంలో కొబ్బరి మొక్కలు ఎండిపోతున్నాయి.
ఉపాధి పనులు చేపడుతున్న ప్రదేశాల్లో వేతదారులు ఎండలకు అల్లాడిపోతున్నారు. వసతుల్లేక వడదెబ్బకు గురవుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని 30 మండలాల్లో ఈ ఏడాది 2,61,832 మంది ఉపాధి వేతనదారులు పనుల్లో పాల్గొంటున్నారు. వలసలు నివారించడానికి కేంద్రం ఉపాధిహామీ పథకం చేపట్టింది. పని ప్రదేశంలో చలువపందిళ్లు, గుడారాల్లాంటివి లేకపోవడంతో ఎండవేడిమి తట్టుకోలేపోతున్నామని పలువురు కూలీలు అంటున్నారు.
శ్రీకాకుళం జిల్లాలో గత ఎన్నికలతో పోలిస్తే ఈ సారి పోలింగ్ శాతం పెరిగింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో 72.41 శాతం నమోదైంది. ప్రస్తుత ఎన్నికల్లో తాజా సమాచారం మేరకు 75.41 శాతం నమోదైంది. మరింత పెరిగే అవకాశం ఉంది. కాగా గతంతో పోలిస్తే సుమారు 3 శాతం మేర ఓటింగ్ పెరిగింది. ఈ పెరిగిన ఓటింగ్‌తో అధికార, ప్రతిపక్షాలు తమకే మేలు జరుగుతున్నాయని ఆశిస్తున్నాయి.
– మరి మీ కామెంట్ ఏంటి..?
ఎండల తీవ్రత రోజురోజుకీ పెరిగిపోతుంది. దీంతో ప్రజలు తీవ్ర ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు. రేపు ఎండల తీవ్రతతో పాటు వడగాలులు వీచే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ తెలిపింది. ప్రజలు తగుజాగ్రత్తలు పాటించాలని ఏపీఎస్డీఎంఏ సూచించింది.
సంతబొమ్మాళి మండలం యామాలపేటకు చెందిన లొట్ల రాము ఓటు వేయడానికి ఒమన్ దేశం నుంచి రూ.40 వేలు ఖర్చు పెట్టి గ్రామానికి వచ్చారు. సోమవారం తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రంకు వెళ్ళగా ఆయనకు ఊహించని పరిణామం ఎదురైంది. ఓటరు జాబితాలో ఆయన పేరు లేదంటూ అధికారులు వెనక్కి పంపారు. తన ప్రమేయం లేకుండా ఎలా ఓటు తొలగించారంటూ ఆ యువకుడు మండిపడ్డాడు.
శ్రీకాకుళం జిల్లాలో సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకూ ఎన్నికలు సజావుగా సాగాయని కలెక్టర్ మనజీర్ జిలానీ సామాన్ తెలిపారు. జరిగిన ఎన్నికలకు సంబంధించి 8 నియోజకవర్గాల ఈవీఎంలను ఎచ్చెర్ల మండలం చిలకపాలెం వద్ద శ్రీశివాని ఇంజినీరింగ్ కళాశాలలోని స్ట్రాంగ్ రూంలలో భద్రపరిచారు. సోమవారం రాత్రి 9.15 గంటలకి మూడంచెల భద్రతావలయం వద్ద ఈవీఎంలను తరలించారు.
పుట్టిన రోజునే ఓ బాలుడు కాన్సర్‌తో మృతి చెందిన విషాదకర ఘటన కంచిలిలో సోమవారం జరిగింది. పెద్దఖొజ్జిరియాకు చెందిన సనీత్ కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. 10 రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సనీత్ మృతి చెందారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ కుమారుడు పుట్టిన రోజునే మృతి చెందడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.
Sorry, no posts matched your criteria.