Srikakulam

News September 3, 2024

ఉద్దానంలో పరిశోధనలు ప్రారంభం

image

ఉద్దానంలో కిడ్నీ వ్యాధిపై ఇంటర్నేషనల్ పరిశోధనలు ప్రారంభమయ్యాయి. అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీ పర్యావరణ నిపుణుడు ప్రొఫెసర్ లెక్స్ వాన్ జీన్ సోమవారం పలాసకు వచ్చారు. కాశీబుగ్గ కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌లో పరిశోధనలు చేయనున్న టీంకు ఆయన ట్రైనింగ్ ఇచ్చారు. అలాగే కిడ్నీ ప్రభావిత ప్రాంతాల్లో పరిశోధనకు అవసరమైన పరికరాలను సైతం జీన్ అమెరికా నుంచే తీసుకువచ్చారు. స్థానికంగా ఉన్న నీరు, ధూళిపై పరిశోధనలు చేస్తారు.

News September 3, 2024

‘పొలం పిలుస్తుంది’ పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్

image

రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆదేశాల మేరకు పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని జిల్లాలోని అన్ని మండలాలలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు. సోమవారం ఈ సందర్భంగా స్థానిక కలెక్టర్ కార్యాలయంలో పొలం పిలుస్తుంది పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయంలో మెలకువలు తెలిపేందుకు వ్యవసాయ అధికారులు చొరవ చూపాలని సూచించారు. వర్షాల వల్ల ఇబ్బందులు ఉన్నప్పటికీ అధిగమించాలన్నారు.

News September 2, 2024

శ్రీకాకుళం: గణేష్ మండపాల ఏర్పాటుకు సింగిల్ విండో విధానం

image

వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించిన అన్ని రకాల అనుమతులు మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సింగిల్ విండో విధానంను అందుబాటులోకి తీసుకువచ్చిందని శ్రీకాకుళం రెవెన్యూ అధికారి ఎమ్ అప్పారావు తెలిపారు. ఈ మేరకు తన ఛాంబర్‌లో సోమవారం సంబంధిత అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీకాకుళం ఆర్డీఒ సి హెచ్ రంగయ్య, డీఎస్పీ వివేకానంద, మున్సిపల్ ఇన్‌ఛార్జ్  కమిషనర్ ఓబులేసు, టౌన్ సీఐలు ఉన్నారు.

News September 2, 2024

ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థకు 132 అర్జీలు: కలెక్టర్

image

శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్.. మీకోసం ఫిర్యాదుల పరిష్కారం వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఇందులో అర్జీదారుల నుంచి 132 విజ్ఞప్తులను స్వీకరించినట్లు వెల్లడించారు. ఇందులో రెవెన్యూ, పౌరసరఫరాల సేవలు, పెన్షన్లు, భూ సర్వే, ఉపాధి అవకాశాలు, భూ వివాదాలు తదితర ఫిర్యాదులు ఉన్నాయన్నారు. సంబంధిత అధికారులకు వీటిని పరిష్కరించాలని ఆదేశించారు

News September 2, 2024

‘పొలం పిలుస్తుంది’విజయవంతం చేయండి: జిల్లా కలెక్టర్

image

శ్రీకాకుళంలోని జెడ్ పి సమావేశ మందిరంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ‘పొలం పిలుస్తోంది’అనే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సోమవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో రైతులకు వ్యవసాయ సాగులో నూతన పద్ధతుల వినియోగంపై అవగాహన కల్పిస్తారన్నారు. తద్వారా వ్యవసాయం లాభసాటిగా మారుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

News September 2, 2024

శ్రీకాకుళం: 41 ఫిర్యాదులు స్వీకరణ- ఎస్పీ  

image

ప్రజా పిర్యాదు నమోదు మరియు పరిష్కార వేదికలో ఎస్పీ మహేశ్వరరెడ్డి 41 ఫిర్యాదులను సోమవారము శ్రీకాకుళంలో స్వీకరించారు. సివిల్ తగాదాల పై 15, ఆస్తి నేరాలపై 02, మోసపూరితమైన 03, కుటుంబ తగాదాలపై 05, ఇతరత్రా అంశాలపై 10, పాత ఫిర్యాదులు 6 అందాయి.
జిల్లా ఎస్పీతో పాటు శ్రీకాకుళం పట్టణ డీఎస్పీ వివేకానంద ప్రజలు నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదులు పరిష్కారంలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

News September 2, 2024

శ్రీకాకుళం డీఎంకు బంద్ నోటీసులు అందజేసిన ఉద్యోగులు

image

ఏపీ స్టేట్ బెవరేజస్ కార్పొరేషన్ కాంట్రాక్టు అండ్ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 07 శనివారం రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శ్రీకాకుళం డివిజన్ డీఎం సుబ్బారావుకు ఉద్యోగులంతా బంద్ నోటీసును అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.

News September 2, 2024

SKLM: జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి

image

రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, విభిన్న ప్రతిభావంతుల శాఖ, జిల్లా ఉపాధి శాఖ వారి సంయుక్త ఆధ్వర్యంలో సెప్టెంబరు 3 వ తేదీన నిర్వహించబడుతున్న జాబ్ మేళా ప్రచార పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ చేతులమీదుగా జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం ఆవిష్కరించడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

News September 2, 2024

శ్రీకాకుళం: 7న మద్యం దుకాణాల బంద్

image

శ్రీకాకుళం జిల్లాలో ఈనెల 7న మద్యం షాపులు బంద్ కానున్నాయి. నూతన మద్యం పాలసీ తీసుకురానున్న ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈనెల 7న రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాల బంద్ నిర్వహించాలని ఏపీ స్టేట్‌బేవరేజస్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ అండ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. నూతన మద్యం పాలసీ పేరిట మద్యం దుకాణాలను ప్రైవేట్ పరం దిశగా రాష్ట్రప్రభుత్వం అడుగులు వేస్తోందని ఆరోపించారు.

News September 2, 2024

శ్రీకాకుళం: తహశీల్దార్లకు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులు

image

శ్రీకాకుళం జిల్లాలో పనిచేస్తున్న ముగ్గురు తహశీల్దార్లకు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులు వచ్చాయి. రాష్ట్రంలో పలువురిని ఉద్యోగోన్నతి లభించగా.. వారిలో ముగ్గురు మన జిల్లాకు చెందిన తహశీల్దార్లు ఉన్నారు. సాదు దిలీప్ చక్రవర్తి, పప్పల వేణుగోపాలరావు, ఆమెపల్లి సింహాచలం ప్రమోషన్లు పొందారు.