India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎన్నికల ప్రచార పర్వం మరో 2 గంటల్లో ముగియనుంది. అభ్యర్థుల విమర్శలు, ఆరోపణలు, హామీలు నడుమ ప్రచార హోరు కొనసాగింది. అభ్యర్థుల తరఫున జగన్, చంద్రబాబు, పవన్ రాకతో శ్రీకాకుళం జిల్లా వార్తల్లో నిలిచింది. ఎన్నికల్లో మొదట అసమ్మతి సెగ ఉండగా తర్వాత సద్దుమణిగింది. ఈ రోజు సాయంత్రం 6 గంటలతో ప్రచారం ముగియనుండగా అభ్యర్థులు ప్రచారాలను ముమ్మరం చేశారు.
మే13న జరగనున్న పోలింగ్‌కు 2000 మంది పోలీసులు, 11 పారా మిలటరీ బృందాలు, 2 ఫ్లటూన్లతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ జీ.ఆర్ రాధిక శనివారం పేర్కొన్నారు. 7 అంతరాష్ట్ర, 4 అంతర జిల్లాల చెక్‌పోస్టులు పని చేస్తున్నాయన్నారు. నియోజకవర్గానికి మూడు చొప్పున 24 ఎస్ ఎస్టి, ఎఫ్‌ఎస్‌టీ బృందాలు పని చేస్తున్నాయని, ఇప్పటి వరకూ రూ.4.39 కోట్ల విలువైన నగదు, బంగారం, వెండి, మద్యం లాంటివి సీజ్ చేశామని తెలిపారు.
జిల్లాలో 2358 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయగా, వాటిలో 298 ప్రాంతాలలో 520 పోలింగ్ స్టేషన్లను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఎస్పీ జీ.ఆర్ రాధిక గుర్తించారు. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంతరాలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 268 మంది సెక్టార్ ఆఫీసర్లు, 707 మంది మైక్రో అబ్జర్వర్లు నిరంతరాయంగా పోలింగ్ పరిస్థితిని క్షేత్రస్థాయిలో సమీక్షిస్తారు. హింస జరిగే అవకాశం ఉండే పోలింగ్ కేంద్రాల్లో నిఘా ఉందన్నారు.
జిల్లాలో 70.18 శాతం పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ చేసేందుకు ఏర్పాటు చేశామని ఎన్నికల అధికారి మనజీర్ జిలాని సమూన్ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. పోలింగ్ సరళిని లైవ్ ద్వారా జిల్లా కేంద్రంలోని కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షిస్తామని, మొత్తం 1655 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ జరుగుతుందన్నారు. నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా, ఇంటర్నెట్ ఉండేలా పూర్తి చర్యలు తీసుకున్నామని అన్నారు.
పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రాల ప్రవేశ మార్గం నుంచి 200 మీటర్ల దూరంలో మాత్రమే తాత్కాలిక కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఎస్పీ రాధిక సూచించారు. ఆ ప్రదేశంలో ఎక్కువమంది గుమిగూడకూడదని, ఆయా నియోజకవర్గాల్లో బయట నియోజకవర్గాల నుంచి వచ్చిన వ్యక్తులు ఎవ్వరూ ఉండేందుకు వీలు లేదని అన్నారు. లాడ్జిల్లో, ప్రైవేట్ గెస్ట్ హౌస్‌లో ఉండేవారు వెళ్లిపోవాలని ఎస్పీ ఆదేశించారు.
నిష్పక్షపాతంగా ప్రతీ ఒక్కరూ ఓటు వేయాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలాని సమూన్ పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికలు 2024కు సంబంధించి ఈ నెల 13వ తేదీ సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగనున్న పోలింగ్ కోసం జిల్లాలో చేసిన ఏర్పాట్లపై ఆయన కలెక్టర్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 18.92 లక్షల ఓటర్లకు 2358 పోలింగ్ కేంద్రాలు కేటాయించినట్లు ఆయన స్పష్టం చేశారు.
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ప్రచారాలు నేటితో ముగియనున్నాయి. ఈ మేరకు మరో 2 రోజులు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నిబంధన ప్రకారం పోలింగ్‌కు 48 గంటల ముందు ప్రచారం ముగించాలి. శనివారం సాయంత్రం 6 గంటలకు అభ్యర్థుల ప్రచారం ముగియనుంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమితోపాటు వైసీపీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులంతా ముమ్మర ప్రచారం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ మనజీ జిలానీ సమూన్ తెలిపారు.
శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం మద్దిలోడు పేట గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై శనివారం ఉదయం గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న నేషనల్ హైవే సిబ్బంది, టెక్కలి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, ఘటనపై కేసు నమోదు చేశారు. కాగా మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.
టెక్కలి నియోజకవర్గంలో ఇప్పటి వరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామారావు గెలుపొందారు. 1994లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరపున బరిలో నిలిచిన ఎన్టీఆర్ 40,890 ఓట్ల మెజారిటీతో టెక్కలి ఎమ్మెల్యేగా గెలిచారు. నాటి నుంచి నేటి వరకు జిల్లాలో ఏ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి కూడా అంత మెజారిటీతో గెలవలేదు. ఎన్టీఆర్ పోటీ చేసిన నేలగా టెక్కలికి గుర్తింపు ఉంది.
శ్రీకాకుళం జిల్లాలో ఓట్ల పండగకు సమయం ఆసన్నమైంది. నేటి సాయంత్రంతో ప్రచార పర్వం ముగియనుండగా, ఇప్పటికే ఓటర్లను ప్రభావితం చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. నరసన్నపేటలో రూ.500 నుంచి రూ.1000, టెక్కలిలో రూ.2 వేల వరకు ఇస్తున్నట్లు సమాచారం. పాతపట్నం, శ్రీకాకుళంలో రూ.1000 వరకు పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రత్యర్థులు తమకంటే ఎక్కువిస్తే.. 2వసారి పంపిణీకీ సిద్ధమవుతున్నట్లు సమాచారం.
Sorry, no posts matched your criteria.