India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
యువత అధిక సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొనాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజిర్ జిలాని సమూన్ యువతకు శుక్రవారం పిలుపునిచ్చారు. స్వీప్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన “అందరూ ఎందుకు ఓటింగ్‌లో పాల్గొనాలి” పై వీడియో తయారీ, పోస్టర్ రూపకల్పనలో నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఆయన నగదుతో పాటు మెమోంటో, సర్టిఫికెట్‌లు అందజేశారు.
ఎన్నికల విధులు సమర్ధవంతంగా, విజయవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజిర్ జిలాని సమూన్ రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. రిటర్నింగ్ అధికారులు, తహశీల్దార్లు తదితరులతో ఎన్నికల సన్నద్ధత నిర్వహణపై శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద వెబ్ కాస్టింగ్ ఉండాలని ఆదేశించారు.
శ్రీకాకుళం జిల్లాలోని మే 13 తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల విధులలో పాల్గొననున్న ఎక్స్ సర్వీస్ మెన్, NCC, NSS వాలంటీర్లు పోలింగ్ రోజున నిర్వహించాల్సిన విధి విధానాలపై.. శుక్రవారం ఎస్పీ జీ.ఆర్ రాధిక ఎస్పీ కార్యాలయంలో జిల్లాలో గల వివిధ కళాశాల ప్రిన్సిపాల్స్, NCC కో-ఆర్డినేటర్స్, NSS, ప్రతినిదులు ఎక్స్ సర్వీస్ మెన్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం వారికి దిశానిర్దేశం చేశారు.
ఎన్నికల సంగ్రామంలో ప్రచార ఘట్టం రేపటితో ముగియనుంది. నాయకులు కొద్దిరోజులుగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల మద్దతును కూడగట్టుకున్నారు. ప్రచారంలో విమర్శలు, హామీలతో తమదైన రీతిలో ఓట్లు అభ్యర్థించారు. అభ్యర్థుల కుటుంబీకులు సైతం ప్రచారంలో నిమగ్నమయ్యారు. రేపటి సాయంత్రంతో ఆ క్రతువు ముగియనుంది. ఐదేళ్ల పాలనకు ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో చూడాలి. మన శ్రీకాకుళం జిల్లాలో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుంది..?
పలాస మండలంలో టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు శుక్రవారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని అన్నారు. అనంతరం తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన బాబు సూపర్ సిక్స్ సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ ప్రజలతో మాట్లాడారు. అనంతరం తనను ఎన్నికల్లో ఎంపీగా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీతో పాటు టీడీపీ, నేతలు, అధికారులు పాల్గొన్నారు.
కోటబొమ్మాలి మండలం పాకివలస గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న 1033 నేషనల్ హైవే అంబులెన్స్,108లలో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కోటబొమ్మాళి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సంక్షేమ పథకాల పంపిణీకి హైకోర్టు అనుమతి ఇవ్వడం హర్షణీయమని ధర్మాన కృష్ణదాస్ అన్నారు. హైకోర్టు తీర్పుతో కూటమి పార్టీలకు షాక్ ఇచ్చినట్లు అయిందని పేర్కొన్నారు. టీడీపీ ఫిర్యాదుతో సంక్షేమ పథకాలు పంపిణీ జరగకుండా ఈసీ తీసుకున్న నిర్ణయంపై లబ్ధిదారులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పథకాలు కొత్తవి కాదని.. ఎప్పటి నుంచో అమలవుతున్నాయని హైకోర్టు స్పష్టం చేసిందన్నారు.
స్థానిక నియోజకవర్గ జనసేన అభ్యర్థి నిమ్మక జయకృష్ణకు మద్దతుగా జబర్దస్త్ నటుడు హైపర్ ఆది పట్టణంలో గురువారం ప్రచారం నిర్వహించారు. తొలుత స్థానిక కోటదుర్గమ్మ ఆలయం నుంచి ర్యాలీ నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇప్పటికే 7 సార్లు కరెంటు ఛార్జీలు, 3 సార్లు బస్సు ఛార్జీలు పెరిగాయన్నారు. రానున్న ఎన్నికల్లో జనసేనను గెలిపించాలని కోరారు.
వజ్రపుకొత్తూరు మండలం ఉండ్రుకుడియా గ్రామంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న బొత్స షణ్ముఖరావు, గ్రామ వాలంటీర్ సహాయంతో బుధవారం రాత్రి వైసీపీ ఎన్నికల ప్రచారం చేశారు. స్థానిక యువకులు ప్రశ్నించి, ఫొటోలు తీయడంతో.. వారిపై దాడికి పాల్పడ్డారని బాధితులు ఫిర్యాదుతో కాశిబుగ్గ పోలీసులు ఉపాధ్యాయుడుతో పాటు వాలంటీర్ తోట దిలీప్‌పై పోలీసులు కేసు నమోదు చేశామన్నారు.
జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో 2,358 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 18,92,382 మంది ఓటర్లు ఆయా పోలింగ్ కేంద్రాల్లో మే 13న పోలింగ్‌లో పాల్గొననున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద షామియానాలు, నీరు, ఫ్యాన్లు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఏర్పాట్లపై ఆయా పోలింగ్ కేంద్రాల పరిధిలోని పంచాయతీ కార్యదర్శులు, మున్సిపాలిటీ సిబ్బందికి అవగాహన కల్పించారు.
Sorry, no posts matched your criteria.