Srikakulam

News May 10, 2024

చంద్ర‌బాబుకు శ్రీ‌కాకుళంపై అభిమానం లేదు: ధర్మాన 

image

శ్రీ‌కాకుళం న‌గ‌ర ప‌రిధిలోని అర‌స‌వ‌ల్లి, పొట్టి శ్రీరాములు మార్కెట్, దమ్మల వీధి, గుడి వీధిలో నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మాన ప్రసాదరావు గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి మేనిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేశారు. చంద్ర‌బాబుకు శ్రీకాకుళంపై అభిమానం లేదన్నారు.  

News May 10, 2024

ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేసాం: కలెక్టర్

image

సాధారణ ఎన్నికల నిర్వహణకు సర్వ సన్నద్ధంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ తెలిపారు. ఈనెల 13 న రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు 72 గంటల ముందు చేయాల్సిన ఏర్పాట్లు, బందోబస్తు విస్తరణ ప్రణాళిక అమలు అంశాలపై జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలతో వీడియో కాన్పరెన్సు ద్వారా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సమీక్ష నిర్వహించారు.

News May 9, 2024

శ్రీకాకుళం కలెక్టర్ కీలక ఆదేశాలు

image

పోలింగ్ ముందు 48 గంటల నుంచి ఎన్నిక ముగిసే వరకు ఎటువంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించడం నిషేధమని కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ స్పష్టం చేశారు. ఐదుగురికి మించి ఒకే చోట గుమికూడరాదన్నారు. సరిహద్దు చెక్ పోస్టులను మరింత పటిష్ఠం చేసి ఇతర నియోజకవర్గ వాహనాలు ప్రవేశించకుండా డబ్బు, మద్యం, కానుకలు వంటివి అక్రమ రవాణా జరగకుండా ముమ్మర తనిఖీ చేయాలన్నారు.

News May 9, 2024

శ్రీకాకుళం:ఆలయ అటెండర్ పై సస్పన్షన్ వేటు

image

జిల్లాలో ఆలయాల కౌలు భూముల పన్నులకు సంబంధించి నకిలీ రసీదుల బాగోతం బయటపడింది. నగరంలోని గుడివీధి ఉమారుద్ర కోటేశ్వరాలయం ఈవో సుకన్య వివరాల మేరకు గుడివీధిలోని ఆలయ భూములకు రెండేళ్లుగా శిస్తు చెల్లించడం లేదని ఏడుగురు రైతులకు నోటీసులు ఇవ్వగా, వారు శిస్తు చెల్లించామన్నారు. అధికారులు విచారణ చేపట్టగా అటెండర్‌గా పనిచేసిన సతీశ్ నకిలీ రసీదులు ఇచ్చినట్లు విచారణలో తేలింది. అతడిని సస్పెండ్ చేశామని ఈఓ తెలిపారు.

News May 9, 2024

శ్రీకాకుళం: ఎన్నికల విధులు సజావుగా నిర్వహించాలి

image

ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఎన్నికల విధులు సజావుగా నిర్వహించాలని, ఎన్నికల నిర్వహణలో పీవోలు, ఏపీఓల కీలకమని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా.మనజీర్ జిలానీ సమూన్ ఆదేశించారు. గురువారం ఉదయం జిల్లా కలెక్టర్ ఛాంబర్‌లో 8 నియోజకవర్గాల ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వారికి దిశానిర్దేశం చేశారు.

News May 9, 2024

SKLM: ఆకట్టుకున్న ‘మై వోట్ మై డ్యూటీ’ సైకత శిల్పం

image

ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధిలో గల శ్రీ సంగమేశ్వరస్వామి దేవాలయం కొండ దిగువన ఓటు హక్కు వినియోగానికి సంబంధించి రూపొందించిన సైకత శిల్పం పలువురిని ఆకట్టుకుంది. ఈ సరికొత్త శిల్పం రూపొందించిన శిల్పి గేదెల హరికృష్ణ గురువారం మాట్లాడుతూ.. భారతదేశంలో ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్క పౌరుడు విధిగా తమ ఓటు హక్కును సార్వత్రిక ఎన్నికల్లో వినియోగించుకోవాలని సూచించారు. హరికృష్ణను పలువురు అభినందించారు.

News May 9, 2024

శ్రీకాకుళం: మిగిలింది మూడు రోజులే.. ఎవరికి ఓటేస్తారో?

image

2024 అసెంబ్లీ, లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు ప్రచారం మరింత ఉద్ధృతం చేశాయి. గ్రామాల్లో ప్రచారానికి వచ్చి ప్రజలను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఆయా పార్టీల మేనిఫేస్టోల గురించి నాయకులు ప్రజలకు వివరిస్తున్నారు. పోలింగ్ రోజు ఓటు ఎవరికి వేస్తారో అనే ఆందోళన అభ్యర్థుల్లో నెలకొంది. ఓటర్లు చివరకు ఏ పార్టీకి పట్టం కడతారో వేచి చూడాల్సిందే.

News May 9, 2024

శ్రీకాకుళం అత్యధిక.. అత్యల్ప మెజార్టీ ఓట్లు వీరికే.!

image

శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గానికి ఇప్పటి వరకు 16 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇక్కడి నుంచి గెలిచిన అభ్యర్థుల అత్యధిక, అత్యల్ప మెజార్టీలను గమనిస్తే.. 1971 కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన బి.రాజగోపాలరావుకు వచ్చిన 1,37,461 ఓట్ల మెజార్టీనే అత్యధికం. 1952లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన వివి.గిరికి వచ్చిన 6395 ఓట్ల మెజార్టీనే అత్యల్పం. – మరి ఈసారి గెలుపు, మెజారిటీపై మీ COMMENT..?

News May 9, 2024

SKLM: 48 గంటల ముందు నుంచి మద్యం దుకాణాల బంద్

image

లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు నేపథ్యంలో పోలింగ్‌కు 48 గంటల ముందు నుంచి అలాగే 13వ తేదీ సాయంత్రం 7 గంటల వరకు మద్యం విక్రయాలపై నిషేధం విధించినట్లు జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి ప్రకటించారు. నిర్దేశిత సమయంలో మద్యం దుకాణాలను మూసి ఉంచాలని విక్రేతలకు సూచించారు. జూన్ 4 వ తేదీన కౌంటింగ్ సందర్భంగా కూడా దుకాణాలను మూసి వేయాలని ఆదేశించారు.

News May 9, 2024

శ్రీకాకుళం: పోస్టల్ బ్యాలెట్‌కు నేడు చివరి అవకాశం

image

ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులకి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు గురువారం చివరి అవకాశాన్ని కల్పిస్తున్నామని.. జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలాని సమూన్ తెలిపారు. గడిచిన నాలుగు రోజులుగా జిల్లాలో 41,225 మంది పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును వినియోగించుకున్నారన్నారు. ఇంకా ఓటు హక్కు వినియోగించుకొని ఉద్యోగులకు ఈరోజు అవకాశం ఉందని స్పష్టం చేశారు.