Srikakulam

News April 1, 2024

శ్రీకాకుళం: నేటి నుంచి పది మూల్యాంకనం

image

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు-2024 జవాబుపత్రాల మూల్యాంకన ప్రక్రియకు సర్వం సిద్ధమైందని డీఈఓ వెంకటేశ్వరరావు తెలిపారు. జిల్లాలో ఏప్రిల్‌ 1 నుంచి మొదలయ్యే మూల్యాంకనానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 8 రోజుల్లో స్పాట్‌ పూర్తి చేసేలా జిల్లా యంత్రాంగం పక్కాగా సన్నద్ధమైందన్నారు. తాగునీరు, ఫర్నీచర్‌, లైటింగ్‌, ఫ్యాన్లు, ఇతర మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంచమన్నారు.

News March 31, 2024

అచ్చెన్నకు పరామర్శ

image

టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు తల్లి కళావతమ్మ ఇవాళ మధ్యాహ్నం చనిపోయిన విషయం తెలిసిందే. కోటబొమ్మాళి మండలం నిమ్మాడలోని అచ్చెన్న నివాసానికి కింజరాపు అభిమానులు, టీడీపీ కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. పలాస మాజీ ఎమ్మెల్యే గౌతు శ్యాంసుందర్ శివాజీ, గౌతు శిరీష తదితర టీడీపీ నేతలు కళావతమ్మ భౌతికదేహానికి నివాళులార్పించారు. కింజరాపు సోదరులను పరామర్శించారు.

News March 31, 2024

అచ్చెన్నాయుడు తల్లి కన్నుమూత

image

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు తల్లి కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో కింజరాపు కళావతమ్మ (90) ఇవాళ మధ్యాహ్నం చనిపోయారు. కళావతమ్మకు ముగ్గురు ఆడపిల్లలు, నలుగురు మగపిల్లలు. ఆమె మరణంతో కింజరాపు ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

News March 31, 2024

శ్రీకాకుళం: నరసన్నపేటలో టోల్ బాదుడు

image

నరసన్నపేట మండలం మడపాం టోల్ గేట్ వద్ద నేటి నుంచి పెరిగిన టోల్ గేట్ ఛార్జీలు అమలు చేస్తున్నారు. ప్రతి వాహనంపై రూ.5 వరకు టోల్ ఛార్జీలు పెంపు అర్ధరాత్రి నుంచి అమలోనికి వచ్చాయి. దీంతో ఇచ్ఛాపురం నుంచి జిల్లా కేంద్రానికి రావాలంటే ఇచ్ఛాపురం, పలాస, మడపాం టోల్ గెట్ దాటాల్సి ఉంటుంది. దీంతో పెట్రోల్ ఛార్జీల కంటే టోల్ ఛార్జీలకే భారం ఎక్కువవుతుందని వాహనదారులు ఆవేదన చెందుతున్నారు.

News March 31, 2024

శ్రీకాకుళం: ప్రధాన కూడళ్లు వద్ద చలివేంద్రాలు ఏర్పాటు

image

శ్రీకాకుళం పట్టణంతోపాటు మండల కేంద్రాలు ప్రధాన కూడళ్ళు వద్ద చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ జిలాని సమూన్ శనివారం అధికారులకు సూచించారు. వేసవి ఎండలు తీవ్రత పెరుగుతున్నందున చలివేంద్రాలు ఏర్పాటు తప్పనిసరి అని అన్నారు. మున్సిపాలిటీ అధికారులు, తహశీల్దార్లు, ఎంపీడీవోలు చలివేంద్రాలు ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

News March 31, 2024

శ్రీకాకుళం: కత్తెరతో గొంతు కోసుకున్న వస్త్ర వ్యాపారి

image

టెక్కలి మద్యం మత్తులో ఉన్న వస్త్ర వ్యాపారి కత్తెరతో గొంతు కోసుకున్నాడు. టెక్కలి మండలం కె కొత్తూరు గ్రామానికి చెందిన జి.కుమారస్వామి బట్టల వ్యాపారం చేసుకుని కుటుంబంతో సాకిపల్లి కొత్తూరులో జీవిస్తున్నారు. ఇతనికి మద్యం రోజు తాగే అలవాటు ఉంది. ఆరోగ్యం బాగాలేకపోవడంతో మద్యం తాగవద్దని చెప్పినప్పటికీ వినకపోవడంతో భార్య మందలించింది. దీంతో కత్తితో పీక కోసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసుల కేసు నమోదు చేశారు.

News March 31, 2024

శ్రీకాకుళం: పెరగనున్న గరిష్ఠ ఉష్ణోగ్రతలు

image

రాష్ట్రంలో రానున్న రెండు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా 2-3 డిగ్రీలు పెరుగుతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం శ్రీకాకుళం జిల్లాల్లో వడగాలులు వీయనున్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వ హణ కేంద్రం ప్రకటించింది. ‘సోమవారం ఒక మండలంలో తీవ్ర, మరికొన్ని మండలాల్లో సాధారణ స్థాయిలో వడగాలులు వీయనున్నాయి. శనివారం అత్యధికంగా నంద్యాల జిల్లా అవుకులో 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

News March 31, 2024

శ్రీకాకుళం: ఏఆర్‌సీలో ఎలుగుబంటి మృతి

image

విశాఖ జంతు పునరావాస కేంద్రం(ఏఆర్‌సీ)లో మగ ఎలుగుబంటి మృతి చెందింది. ఈ ఎలుగుబంటి అడవి నుంచి కొద్ది నెలల కిందట శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరులోని జనారణ్యంలోకి చేరి అక్కడి స్థానికులను భయబ్రాంతులకు గురి చేసింది. దీన్ని అటవీశాఖ అధికారులు బంధించి విశాఖ జూకు తీసుకొచ్చారు. అప్పటి నుంచి జూ అధికారులు ఈ ఎలుగుబంటిని ఏఆర్‌సీలో సంరక్షిస్తున్నారు. వృద్ధాప్యం, అనారోగ్యం కారణంగా శనివారం వేకువజామున మరణించింది.

News March 31, 2024

శ్రీకాకుళంలో ఇద్దరు ఉపాధ్యాయుల సస్పెండ్

image

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఇద్దరు టీచర్లను సస్పెండ్ చేసినట్లు డీఈఓ వేంకటేశ్వరరావు తెలిపారు. పలాస మండలం పెద్దంచల గ్రామానికి చెందిన టీచర్ బెహరా మాధవరావు రాజకీయ పార్టీ ప్రచారంలో పాల్గొంటున్నట్లు ఫిర్యాదుతో విచారణ చేపట్టిన అధికారులు ధ్రువీకరించారు. సారవకోట మండలం మొగుపురం గ్రామానికి చెందిన టీచర్ చౌదరి లక్ష్మీనారాయణ వాట్సాప్‌లో ప్రచారం చేసినట్లు ఎంఈఓ ధ్రువీకరించి ఇద్దరిని సస్పెండ్ చేశారు.

News March 30, 2024

ఎండల తీవ్రత దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

వేసవి వేడి గాలుల తీవ్రత పెరిగే సూచనల దృష్ట్యా విపత్తు నిర్వహణ ప్రణాళికను సిద్ధం చేయాలని, అన్ని మండలాల్లో కంట్రోల్ రూమ్‌లను తెరవాలని కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ అధికారులను ఆదేశించారు. జిల్లా అధికారులతో కలసి తహసీల్దార్లు, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు. వడగాలుల కారణంగా జిల్లాలో ఎవరూ మృతి చెందకుండా చూడటమే లక్ష్యమన్నారు.