Srikakulam

News March 27, 2024

పాలకొండలో ఈసారి ఆమెకు పోటీ ఎవరు..?

image

పాలకొండ నియోజకవర్గంTDP-JSP టికెట్ ఎవరికీ కేటాయించకపోవడంతో ఆయా పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. కాగా ఈ నియోజకవర్గం నుంచి విశ్వసరాయ కళావతి YCP తరఫున బరిలో ఉన్నారు. ఈమె వరుసగా 2014, 2019 ఎన్నికల్లో YCP నుంచి పోటీ చేసి రెండు సార్లూ కూడా TDP అభ్యర్థి నిమ్మక జయకృష్ణపై విజయం సాధించారు. మరి ఈసారి కళావతికి పోటీగా కూటమి ఎవరిని బరిలో దింపనుంది..కామెంట్ చేయండి.

News March 27, 2024

ఎచ్చెర్ల : పరీక్ష ఫీజు స్వీకరణకు నోటిఫికేషన్ విడుదల

image

ఎచ్చెర్ల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ 2,4 సెమిస్టర్లు చదువుతున్న విద్యార్థుల పబ్లిక్ పరీక్షలకు ఫీజు స్వీకరణ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఎగ్జామినేషన్ డీన్ ఉదయ్ భాస్కర్ ఒక ప్రకటనలో మంగళవారం తెలిపారు. ఏప్రిల్ 4వ తేదీలోగా ఫీజు చెల్లించాలని అన్నారు. అపరాధ రుసుముతో ఏప్రిల్ 15లోగా చెల్లించవచ్చని కోరారు. ఎన్నికల షెడ్యూల్ నేపథ్యంలో పరీక్షల తేదీలు ప్రకటిస్తామన్నారు.

News March 27, 2024

తాగునీటి కొరత లేకుండా పటిష్ఠ చర్యలు: శ్రీకాకుళం కలెక్టర్

image

వేసవి కాలం నేపధ్యంలో తాగునీటి కొరత లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. వేసవి ఎద్దడిని అధిగమించేందుకు చేపడుతున్న పనులపై ఆరా తీశారు. తాగునీటికి ఎటువంటి లోటు రాకుండా చూడాలన్నారు. 

News March 26, 2024

సింహాచలం అప్పన్న హుండీ ఆదాయం రూ.1.29కోట్లు

image

సింహాచలం సింహాద్రి అప్పన్న హుండీల ద్వారా ఆదాయం రూ.1,29,30,598 లభించింది. మంగళవారం ఆలయంలో హుండీలను తెరిచి లెక్కించారు. 89 గ్రాముల బంగారం, 9 కిలోల 350 గ్రాములు వెండి లభించింది. అలాగే వివిధ దేశాల కరెన్సీని కూడా భక్తులు హుండీలో వేశారు. సింహాద్రి అప్పన్న ఆలయానికి అనుబంధంగా గల పైడితల్లి అమ్మవారి హుండీ ఆదాయం రూ.8,10,455 లభించింది.

News March 26, 2024

శ్రీకాకుళం: RBKల ద్వారా ధాన్యాన్ని విక్రయించండి

image

ఖరిఫ్ 2023-24 సీజన్ ముగింపు దశ కారణంగా ఈ నెలాఖరులోగా రైతులు వద్ద ఉన్న ధాన్యాన్ని త్వరితగతిన RBKల ద్వారా ప్రభుత్వానికి విక్రయించాలని జాయింట్ కలెక్టర్ నవీన్ సూచించారు. ఈ మేరకు మంగళవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. నాణ్యతా ప్రమాణాలతో కూడిన ధాన్యాని రైతు భరోసా కేంద్రాల వద్ద మద్దతు ధరకు విక్రయించాలన్నారు. మార్చి 31 దాటితే రైతులు వద్ద ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరగదన్నారు.

News March 26, 2024

ప్రచారాలకు అనుమతులు తప్పనిసరి: శ్రీకాకుళం కలెక్టర్

image

జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో నిర్వహిస్తున్న వివిధ రాజకీయ పార్టీల ప్రచారాలకు అనుమతులు తప్పనిసరిగా ఉండాలని కలెక్టర్ డాక్టర్ మనజిర్ జిలాని సమూన్ వెల్లడించారు. అనుమతులు లేకుండా ప్రచారాలు చేపడితే ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేస్తామన్నారు. జిల్లాలోని రిటర్నింగ్ అధికారులు, ఎంసీసీ అధికారులతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

News March 26, 2024

స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా మాజీ మంత్రి గుండ అప్ప‌ల..?

image

స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా బ‌రిలో దిగే విష‌య‌మై పునరాలోచ‌న చేస్తున్నామ‌ని మాజీమంత్రి గుండ అప్ప‌ల సూర్యనారాయ‌ణ తెలిపారు. ఈ మేర‌కు మంగళవారం ఆయన ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల‌ చేశారు. సోమవారం సాయంత్రం టీడీపీ జిల్లా అధ్య‌క్షులు కూన ర‌వికుమార్ త‌మతో భేటీ అయ్యార‌ని, పార్టీ పునఃప‌రిశీల‌న అనంత‌రం నిర్ణ‌యం వెలువ‌డే దాకా వేచి ఉండాల‌ని సూచించార‌న్నారు. ఆ మేర‌కు తాము ఆలోచ‌న చేస్తున్నామన్నారు.

News March 26, 2024

మందస: విద్యుదాఘాతంతో తాపీ మేస్త్రి మృతి

image

మందస మండలం చిన్న సువర్ణపురం గ్రామంలో మంగళవారం విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని ఓ ఇంట్లోకి సాలిని గున్నయ్య (40) అనే వ్యక్తి పనికి వెళ్లాడు. పని చేస్తూ అక్కడే ఉన్న ఓ ఇనుప చువ్వను ముట్టుకున్నాడు. దానికి కరెంట్ ప్రసరించడంతో ఆయన కరెంట్ షాక్‌కు గురయ్యాడు. సహచరులు గమనించి 108 అంబులెన్స్ సమాచారం అందిచారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని పరీక్షించించగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.

News March 26, 2024

శ్రీకాకుళం: ఇసుక లారీ ఢీకొని సీఆర్పీఎఫ్ జవాన్ మృతి

image

పలాస మండలం కోసంగిపురం జంక్షన్ వద్ద మంగళవారం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న బైక్‌ను ఇసుక లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో లారీ వెనుక చక్రాల కింద సోంపేట మండలం జీడీపుట్టుక గ్రామానికి చెందిన చెల్లురి చైతన్య తీవ్ర గాయాలపాలయ్యాడు. పలాస ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా మృతుడు ఇటీవల సీఆర్పీఎఫ్ ట్రైనింగ్ పూర్తి చేశారు. ఘటనపై కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేశారు.

News March 26, 2024

శ్రీకాకుళం: నేడు రాజశ్యామల హోమం

image

సీఎం జగన్ చేపట్టనున్న మేమంతా సిద్ధం బస్సుయాత్ర విజయవంతం కావాలని కోరుతూ మంగళవారం రాజశ్యామల హోమం నిర్వహించనున్నట్లు కళింగ వైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ అంధవరపు సురిబాబు తెలిపారు. నగరంలోని రామలక్ష్మణ కూడలి వద్ద ఉన్న దుర్గా మహాలక్ష్మీ దేవాలయంలో ఉదయం 8 గంటల నుంచి కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ యాగంలో వైసీపీ ఇన్‌ఛార్జ్‌లు, మహిళలు, అందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.