India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు శ్రీకాకుళం జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. దీనిలో భాగంగా నేడు సాయంత్రం 4 గంటలకు పాలకొండ నియోజకవర్గంలో ఒడమ జంక్షన్‌లో ఎన్నికల ప్రచార సభ నిర్వహించనున్నారు. ఈ సభకు భారీగా జనసైనికులు రానున్నారు. ఇప్పటికే పవన్ పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం పార్లమెంట్, 8 నియోజకవర్గాలకు పోలింగ్ కేంద్రాల వద్ద 1700 వీల్ చైర్లు, కంటి చూపు తక్కువ ఉన్నవారికి మాగ్నిఫయింగ్ (భూతద్దాలు ) 1700 వచ్చాయని కలెక్టర్ మంజీర జిలానీ సమూన్ పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో పోలింగ్ కేంద్రాల వద్ద ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు వీల్ చైర్లు, మాగ్నిఫయింగ్ (భూతద్దాలు ) పంపించామన్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురువారం పాలకొండలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఆయన రాజుపేట జంక్షన్ వద్ద హెలిప్యాడ్‌లో దిగి, అక్కడి నుంచి తన కాన్వాయ్‌లో ప్రచారం చేస్తూ పాలకొండలోని వడమ సెంటర్ చేరుకుంటారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ జన సైనికులకు దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం ఆయన హెలికాప్టర్‌లో పిఠాపురం బయలుదేరనున్నారు.
జిల్లాలోని తీర ప్రాంత మండలాల్లో వేట నిషేధకాలానికి భృతి అందించేందుకు అర్హుల గుర్తింపు కోసం గురువారం నుంచి ఎన్యుమరేషన్ ప్రక్రియను చేపట్టనున్నామని జిల్లా మత్స్యశాఖాధికారి పీవీ శ్రీనివాసరావు తెలియజేశారు. ఈసీ అనుమతితో ఈ సర్వేలో అధికారులే స్వయంగా మండలాల్లో అర్హులకు రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకార భరోసా కింద రూ.10 వేల నగదును ఆర్థిక సాయంగా అందజేస్తుందని ప్రకటించారు.
బూర్జ మండలంలో బుధవారం విషాదం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. మండలంలోని లాభాం గ్రామానికి చెందిన అప్పలనాయుడు(40) భార్య 6 నెలల కిందట పుట్టింటికి వెళ్లిపోయింది. తల్లి మతిస్థిమితం సరిగ్గా లేకపోవడంతో కుమారుడు రేవంత్ (12) బాగోగులు చూసుకునేవారు లేకుండా పోయారు. ఈ క్రమంలో మనస్తాపంతో ఉంటున్న అప్పలనాయుడు కుమారుడికి ఉరి వేసి, అనంతరం ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సారవకోట మండలం కుమ్మరి గుంట గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు యాళ్ల సీతారావమ్మ (104) బుధవారం మధ్యాహ్నం మృతి చెందారు. ఈమె స్వయాన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, మాజీ ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాస్ పెద్దతల్లి. ఈమె మృతితో ధర్మాన కుటుంబంలో విషాదం అలుముకుంది. ఈమె అంత్యక్రియలను గురువారం ఉదయం నిర్వహిస్తామని బంధువులు తెలిపారు.
సారవకోట మండలం కుమ్మరి గుంట గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు యాళ్ల సీతారావమ్మ (104) బుధవారం మధ్యాహ్నం మృతి చెందారు. ఈమె స్వయాన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, మాజీ ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాస్ పెద్దతల్లి. ఈమె మృతితో ధర్మాన కుటుంబంలో విషాదం అలుముకుంది. ఈమె అంత్యక్రియలను గురువారం ఉదయం నిర్వహిస్తామని బంధువులు తెలిపారు.
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఏప్రిల్ 29తో నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. శ్రీకాకుళం లోక్‌సభ నుంచి మొత్తం 13 బరిలో ఉన్నారు. ప్రధానంగా TDP నుంచి కె.రామ్మోహన్ నాయుడు, YCP నుంచి పేరాడ తిలక్, కాంగ్రెస్ నుంచి పేడాడ పరమేశ్వరరావు బరిలో ఉన్నారు. 2014, 2019లో టీడీపీ అభ్యర్థి కె.రామ్మోహన్ నాయుడు రెండుసార్లు ఎంపీగా గెలుపొందారు. వీరిలో గెలుపు ఎవరిదని మీరు భావిస్తున్నారు. కామెంట్ చేయండి.
జిల్లాలో ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు యంత్రాంగం కృషి చేస్తోందని శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ సాధారణ పరిశీలకులు శేఖర్ విద్యార్థి తెలిపారు. ఎన్నికల ఉల్లంఘనలకు సంబంధించి ఫిర్యాదులను, అర్జీలను రాజకీయ పార్టీలు, పోటీలో ఉన్న అభ్యర్థులు, సాధారణ ప్రజలు సమస్య తీవ్రతను బట్టి తనను నేరుగా లేదా, ఫోన్ 9032923131 ఫిర్యాదు చేయవచ్చునని సూచించారు.
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గం, శ్రీకాకుళం, ఆమదాలవలస, నరసన్నపేట అసెంబ్లీ సెగ్మెంట్ల ఈవీఎంల రెండో దశ ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తయిందని కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల సాధారణ పరిశీలకులు శేఖర్‌తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో ఎన్నికల ఏర్పాట్ల వివరాలపై ఆరా తీశారు.
Sorry, no posts matched your criteria.