India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద ఆయన భార్య వాణి ఆరో రోజు నిరసన దీక్ష కొనసాగిస్తున్నారు. పిల్లలను, తనను భర్త ఇంట్లోకి రానివ్వట్లేదని కారు షెడ్డులో దీక్ష చేస్తున్నారు. ఈ వివాదంలో ఇప్పటికే దువ్వాడ శ్రీను, వాణి ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు వివాదం సద్దుమణిగేలా ఇరు కుటుంబ సభ్యులు చర్చలు జరుపుతున్నారు.
ఏపీలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ రిఫైనరీ ఏర్పాటుకు ఆసక్తిగా ఉంది. రూ.75 వేల కోట్లతో ఏర్పాటు చేయనుండగా ఆ సంస్థ ప్రతినిధులు ఇప్పటికే సీఎం చంద్రబాబుతో సమావేశమై చర్చించారు. ఆ రిఫైనరీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం మచిలీపట్నం, రామాయపట్నం, మూలపేట (శ్రీకాకుళం)లో స్థలాన్ని ఆఫర్ చేసినట్లు సమాచారం. ఒక ప్రాంతాన్ని ఎంపిక చేసి రిఫైనరీ ఏర్పాటు చేసే అవకాశముంది. దీని ద్వారా 10 వేల ఉద్యోగాలు రానున్నాయి.
కోటబొమ్మాళి మండలం నిమ్మాడ కాలనీకి చెందిన పీజీ విద్యార్థి కొంచాడ నీలమ్మ (22) డెంగ్యూ వ్యాధితో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. జ్వరం రావడంతో పీహెచ్‌స్సీకీ తరలించగా రక్త పరీక్షలు నిర్వహించి ప్లేట్‌లేట్స్ తక్కువగా ఉన్నాయని గుర్తించారు. టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని డాక్టర్ సూచించారు. అంతలోనే ఆమె మరణించింది. వైద్యులు నిర్లక్ష్యంతోనే నీలమ్మ మృతి చెందిందని బంధువులు ఆరోపించారు.
మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఓఎస్డీగా ఎం.పోలినాయుడును నియమిస్తూ మంగళవారం ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖ జిల్లా పరిషత్‌లో ఉన్నతాధికారిగా విధులు నిర్వహిస్తున్న ఈయనను ఓఎస్డీగా నియమించారు. 2014-2019 టీడీపీ ప్రభుత్వ హయాంలోనూ పోలినాయుడు అచ్చెన్నాయుడుకు ఓఎస్డీగా ఉన్నారు.
శ్రీకాకుళం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ ph.D పరీక్షలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు యూనివర్సిటీ ఎగ్జామినేషన్ కార్యాలయం నుంచి మంగళవారం విడుదల చేశారు. ఈ క్రమంలో అభ్యర్థులు పరీక్ష ఫీజును ఈ నెల 20వ తేదీ వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు. దీనికోసం మొత్తం పరీక్ష ఫీజు రూ.2030 చెల్లించాలన్నారు. పరీక్షలు ఈ నెల 27వ తేదీ నుంచి మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రారంభం కానున్నాయి.
పలాస మండలం నీలావతి గ్రామ జంక్షన్ సమీప జాతీయ రహదారిపై మంగళవారం ఓ బొలెరో వ్యాన్ అదుపుతప్పి బోల్తా పడింది. ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రాంతం నుంచి అక్రమంగా పశువులను తిలారు సంతకు తరలిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో డ్రైవర్‌తో పాటు, పశువులు క్షేమంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నేషనల్ హైవే సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్రేన్ సహాయంతో వాహనాన్ని రహదారి పక్కకు తరలించారు.
టెక్కలిలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఆయన భార్య వాణి కుటుంబసభ్యులు సోమవారం రాత్రి జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దువ్వాడ తరఫున ఆయన సోదరుడు శ్రీధర్, వాణి తరఫున ఆమె సోదరి చర్చల్లో పాల్గొనగా అర్ధాంతరంగా ముగిశాయి. వారు నేడు మరోసారి సమావేశమై వివాదం సద్దుమణిగేలా చర్చలు జరపనున్నట్లు సమాచారం. వాణి డిమాండ్లపై నేడు చర్చించే అవకాశం ఉంది.
ఎచ్చెర్ల మండలంలో పంచాయతీ కార్యదర్శి ఎం.అప్పల రాజు సస్పెండ్ అయ్యారు. రెండు రోజుల క్రితం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ చిలకపాలెంలో పర్యటించారు. పారిశుద్ధ్య పనులు సరిగా చేపట్టక పోవడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి పంచాయతీ కార్యదర్శిని బాధ్యుడిని చేస్తూ సస్పెండ్ చేస్తున్నట్లు డీపీవో ఉత్వర్వులు జారీ చేశారు. అలాగే ఈవోపీఆర్డీ దేవికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు.
మండలంలోని నిమ్మాడ గ్రామానికి చెందిన రైతు దాము మోహనరావు, పుణ్యవతి దంపతులకు పీఎం కిషన్ పథకంపై ఈ నెల ఆగస్టు 15న ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగే స్వాతంత్ర వేడుకలకు నిమ్మాడకు చెందిన ఈ దంపతులకు ఆహ్వనం అందినట్లు జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రధాన మంత్రి పాల్గొనే వేడుకలకు ఓ సాదరణ రైతుకు ఆహ్వనం అందడంపై మండల వ్యవసాయ అధికారి సువ్వారి గోవిందరావు, పలువురు రైతులు హర్షం వ్యక్తం చేశారు.
శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో సోమవారం నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా వివిధ కార్యక్రమాలు చేపట్టారు. మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై యువతకు అవగాహన తప్పనిసరి అని, యువతపై వాటి ప్రభావం పడకుండా వాటి నియంత్రణే లక్ష్యంగా కృషి చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గోండు శంకర్, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.
Sorry, no posts matched your criteria.