India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
టెక్కలి-మెళియాపుట్టి రోడ్డులో సోమవారం విద్యుత్ షాక్‌కు గురై ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఫైబర్ నెట్ పనుల నిమిత్తం విద్యుత్ స్తంభం భం ఎక్కిన సమయంలో ప్రమాదవశాత్తూ.. విద్యుత్ తీగలు తగలడంతో షాక్‌కు గురై కిందపడిపోయాడు. గమనించిన స్థానికులు టెక్కలి పోలీసులకు సమాచారం అందించి, క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం నిమిత్తం జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ఈ ఏడాది జనవరి 1 నుంచి 28 వరకూ 252.99 లీటర్ల మద్యాన్ని సీజ్ చేసినట్లు రాజాం సెబ్ సీఐ బి. శ్రీధర్ వెల్లడించారు. 70 కేసులు నమోదు చేసి 78 మందిని అరెస్టు చేశామని వెల్లడించారు. 2,700 లీటర్ల పులిసిన బెల్లం ఊటలను ధ్వంసం చేసి మూడు కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. 120 మందిని బైండోవర్ చేయడంతోపాటు 9 ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్నట్లు వెల్లడించారు.
మే 13న జరిగే ఎలక్షన్‌కు సంబంధించిన ఓటరు సమాచార స్లిప్పుల పంపిణీ ఈనెల 30వ తేదీ నుంచి ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ బూత్ స్థాయి అధికారులను ఆదేశించారు. వచ్చేనెల ఏడవ తేదీలోగా పంపిణీ పూర్తి కావాలని స్పష్టం చేశారు. ప్రతి ఓటరుకు ఈ స్లిప్పులు అందే విధంగా జిల్లా స్థాయి అధికారుల నుంచి గ్రామ స్థాయి అధికారుల వరకు బాధ్యతగా పనిచేయాలని కోరారు.
దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారు, చక్రాల కుర్చీకి పరిమితమైన వారు, సైనిక్ వెల్ఫేర్ పెన్షన్లను ఇంటింటికి సచివాలయం సిబ్బంది 1వ తారీఖు నుంచి అందిస్తారని కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. మిగిలిన వారికి DBT విధానం ద్వారా వారి వారి అకౌంట్స్‌లోనికి మే 1వ తారీఖున పెన్షన్ జమ చేయడం జరుగుతుందన్నారు. పెన్షన్ తీసుకోవడానికి ఎవ్వరూ కూడా సచివాలయం లేదా ఏ ఇతర ఆఫీస్‌లకు వెళ్లవలసిన అవసరం లేదని తెలిపారు.
శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం పాగోడు గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ నేతింటి వైకుంఠరావు ఆదివారం రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలయ్యాడు. తన ద్విచక్ర వాహనంపై శ్రీకాకుళం నుంచి విశాఖ వెళ్తుండగా.. విజయనగరం జిల్లా తగరపువలస సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. గమనించిన స్థానికులు 108 అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి ఒక్క రోజు వచ్చిన ఆదాయ వివరాలను అధికారులు వెల్లడించారు. టికెట్లు రూపేనా రూ.1,37,800లు, పూజలు విరాళాల రూపంలో రూ.53,807లు, ప్రసాదాల రూపంలో రూ.1,77,790లు, శ్రీ స్వామి వారికి ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో ఎస్ చంద్రశేఖర్ తెలిపారు. నిన్న ఆదివారం రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారని ఆయన తెలిపారు.
మండలంలోని పెద్ద కొజ్జిరియా జంక్షన్ సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం ఓ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న భార్యాభర్తలతో పాటు ఓ చిన్నారికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సోంపేట ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం బెండి గ్రామానికి చెందిన అప్పయ్యదర రాజకీయాల్లో అరుదైన ఘనత సాధించారు. గ్రామానికి 1961 నుంచి 1981 వరకు 20 ఏళ్లపాటు సర్పంచ్‌గా పనిచేశారు. ఆ తర్వాత 1984లో ఎంపీగా గెలుపొందారు. 1994లో టీడీపీ నుంచి, 2004లో కాంగ్రెస్ నుంచి టెక్కలి MLAగా విజయం సాధించారు. కుగ్రామంలో జన్మించిన ఆయన సర్పంచ్ మొదలు ఎమ్మెల్యే, ఎంపీగా సేవలందించడం విశేషం.
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలంలోని నడగాం గ్రామానికి చెందిన తమరాపు లక్ష్మణరావు (40) విద్యుత్ షాక్‌కు గురై మృతిచెందాడు. కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉపాధి కోసం హైదరాబాద్ వెళ్లిన లక్ష్మణరావు ఓ ప్రైవేటు కంపెనీలో లైన్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం విధి నిర్వహణలో విద్యుత్ షాక్‌తో చనిపోయాడు. శనివారం విషయం తెలియడంతో గ్రామంలో విషాదం అలుముకుంది.
శ్రీకాకుళం జిల్లాది రాజకీయాల్లో చెరగని ముద్ర. జిల్లావాసులు ఎందరో రాజకీయ హేమాహేమీలతో పాటు నలుగురు స్పీకర్లను సైతం అందించారు. 1955లో టెక్కలి MLAగా గెలిచిన రొక్కం నరసింహం దొర ఆంధ్రరాష్ట్ర 2వ స్పీకర్‌గా పనిచేశారు. ఉమ్మడి ఏపీలో తంగి సత్యనారాయణ 7వ స్పీకర్‌గా, ప్రతిభాభారతి 11వ స్పీకర్‌గా సేవలు అందించారు. ఆమదాలవలస MLA తమ్మినేని సీతారాం నవ్యాంధ్రప్రదేశ్ 2వ స్పీకర్‌గా పనిచేశారు.
Sorry, no posts matched your criteria.