India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సార్వత్రిక ఎన్నికలక ప్రక్రియలో భాగంగా జిల్లావ్యాప్తంగా దాఖలైన నామినేషన్ల పరిశీలన శుక్రవారం నిర్వహించారు. 8 అసెంబ్లీ, ఒక పార్లమెంట్ స్థానాలకు రిటర్నింగ్ అధికారులు నామపత్రాలు పరిశీలించారు. ఎనిమిది నియోజకవర్గాలకు సంబంధించి 82 నామినేషన్లు ఆమోదించగా.. 25 తిరస్కరించారు. పార్లమెంట్ స్థానానికి 13 ఆమోదించగా.. 3 తిరస్కరించారు. మొత్తానికి 95 ఆమోదం పొందాయి. నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల 29 వరకు గడువు ఇచ్చారు.
మెలియాపుట్టి కేంద్రానికి చెందిన గురజాడ ప్రభావతి(48) అనుమానాస్పదంగా మృతి చెందినట్లు కేసు నమోదు చేశామని ఎస్సై రాజేశ్ తెలిపారు. మండల కేంద్రంలో ప్రభావతి ఒంటరిగా ఉంటుంది. కుమారుడు జమ్మూలో సీఆర్పీఎఫ్ జవాన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. మూడు రోజులుగా ఫోన్ చేస్తున్నా ఎత్తకపోవడంతో స్థానికులను ఇంటికి వెళ్లమని చెప్పారు. ఇంటి నుంచి దుర్వాసన రావడంతో పోలీసులకు ఫిర్యాదుచేశారు. మృతిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రిటర్నింగ్ అధికారి సీ.హెచ్ రంగయ్య ఆధ్వర్యంలో శుక్రవారం అభ్యర్థుల సమక్షంలో నామినేషన్ల పరిశీలన కార్యక్రమం నిర్వహించారు. ఈ నామినేషన్ పరిశీలనలో ఒక నామినేషన్ తిరస్కరించినట్లు ఆయన తెలిపారు. ఈ పరిశీలనలో మొత్తం 10 మంది అభ్యర్థుల నామినేషన్లు పరిశీలించగా.. ఒక అభ్యర్థి నామినేషన్ తిరస్కరించినట్లు పేర్కొన్నారు.
శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రిటర్నింగ్ అధికారి సీ.హెచ్ రంగయ్య ఆధ్వర్యంలో శుక్రవారం అభ్యర్థుల సమక్షంలో నామినేషన్ల పరిశీలన కార్యక్రమం నిర్వహించారు. ఈ నామినేషన్ పరిశీలనలో ఒక నామినేషన్ తిరస్కరించినట్లు ఆయన తెలిపారు. ఈ పరిశీలనలో మొత్తం 10 మంది అభ్యర్థుల నామినేషన్లు పరిశీలించగా.. ఒక అభ్యర్థి నామినేషన్ తిరస్కరించినట్లు పేర్కొన్నారు.
సాధారణ ఎన్నికలు-2024 జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మనజీర్ జీలానీ సమూన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం పార్లమెంట్, నియోజకవర్గ అభ్యర్థుల నామినేషన్ దరఖాస్తుల పరిశీలన కార్యక్రమం కలెక్టర్ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా సాధారణ పరిశీలకులు శేఖర్ విద్యార్థితో కలిసి కలెక్టర్ నామినేషన్ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం వారికి పలు సూచనలు చేసి దిశానిర్దేశం చేశారు.
మే13న జరిగే ఎన్నికలలో BJP, BJPతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్న పార్టీలను ఓడించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం నగరంలోని క్రాంతి భవన్‌లో CPI ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని ఆయన అన్నారు. కార్యక్రమంలో చాపర సుందరలాల్, యుగంధర్, డోల శంకరరావు, తమిరి తిరుపతిరావు, వెంకటరావు తదితరులు ఉన్నారు.
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లాకు నియమితులైన వ్యయ పరిశీలకులు, ఐఆర్ఎస్ అధికారులైన కోమల్ జిత్ మీనా, శరవణ కుమార్, నవీన్ కుమార్ సోనీలు శుక్రవారం కలెక్టరేట్‌లోని జిల్లా ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ (ఎన్నికల నియంత్రణ కేంద్రం)ను పరిశీలించారు. ఎన్నికల కంట్రోల్ రూమ్ ఇన్‌ఛార్జ్, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్లు అన్ని విభాగాలను పరిచయం చేశారు.
ఎల్.ఎన్.పేట మండలం శ్యామలాపురం పునరావాస కాలనీలో ఉంటున్న నెల్లి అమ్ములు (69) గురువారం రాత్రి మృతిచెందింది. శుక్రవారం ఉదయం ఈమె దహన సంస్కరాలకు కుటుంబ సభ్యులు సిద్ధం చేస్తున్నారు. అక్కడే రోదిస్తూ ఉన్న అమ్ములు భర్త ఏకాశి (77) ఆమెకు చివరి స్నానం చేయిస్తూ కుప్పకూలిపోయాడు. కొన్ని గంటల వ్యవధిలోనే భార్యాభర్తల మృతి చెందడంతో గ్రామంలో విషాదం అలముకుంది.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో యోగా, ఫిట్‌నెస్ మేనేజ్మెంట్ విభాగం నిర్వహిస్తున్న ఏడాది యోగా పీజీ డిప్లమా కోర్సులో చేరేందుకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి.సుజాత గురువారం తెలిపారు. జూన్ 15 లోగా దరఖాస్తు చేసుకోవాలని ఆమె పేర్కొన్నారు. రూ.500 అపరాధ రుసుముతో జూన్ 27లోగా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
ఎచ్చెర్లలో వైసీపీ నుంచి గొర్లె కిరణ్‌కుమార్ పోటీ చేస్తుండగా, గొర్లె కిరణ్‌కుమార్ అనే మరొకరు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు. కూటమి తరఫున నడుకుదిటి ఈశ్వరావు ఉండగా.. అదే పేరుకు దగ్గరగా నడుపూరి ఈశ్వరరావు, నేతల ఈశ్వరరావు స్వతంత్రులుగా పోటీలో ఉన్నారు. కాగా శ్రీకాకుళం వ్యాప్తంగా వివిధ పార్టీలకు చెందిన 175 మంది అభ్యర్థులు 223 నామినేషన్లు వేయగా.. రెండుసార్లు వచ్చినవి తీసేయడంతో 123 మంది మిగిలారు.
Sorry, no posts matched your criteria.