India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కోటబొమ్మాళి- సంతబొమ్మాళి రహదారిలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీను(18) మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోటబొమ్మాళి నుంచి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న చీపుర్లపాడు పంచాయతీ దుర్గంపేటకు చెందిన చిదపాన శ్రీనును సీతన్నపేట సమీపంలో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నూతన కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంను ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించి జనరల్ అబ్జర్వర్ సందీప్ కుమార్ గురువారం పరిశీలించారు. కంప్లైంట్ మోనిటరింగ్ సెల్, సీ-విజిల్స్ టీం, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్, పోస్టల్ బ్యాలెట్, ఎక్సైజ్ కంట్రోల్ రూం, పోలీస్ కంట్రోల్ రూం, తదితర వాటిని ఆయన పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
శ్రీకాకుళం పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి స్వతంత్ర అభ్యర్థులు, పార్టీలకు చెందిన అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేసిన వారి వివరాలు ఇలా ఉన్నాయి.1.కాయ దుర్గారావు, 2.బేత వివేకానంద మహరాజ్, 3.BYC పార్టీ నుంచి బోరుభద్ర చంద్రకళ, 4.శ్రవణ్ కుమార్, 5.PPI పార్టీ నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా కారి లక్ష్మణ్ గురువారం ఉదయం నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు.
శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ డిగ్రీ 2వ సెమిస్టర్, 4వ సెమిస్టర్ పరీక్షల హాల్ టికెట్లు గురువారం విడుదలయ్యాయి. ఈ మేరకు యూనివర్సిటీ ఎగ్జామినేషన్ డీన్ ఎస్.ఉదయ్ భాస్కర్ విడుదల చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. హాల్ టికెట్లు జ్ఞానభూమి పోర్టల్‌లో ఉన్నాయని డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు అరగంట ముందే చేరుకోవాలని ఆయన సూచించారు.
ఎచ్చెర్ల మండలం చిలకపాలెం గ్రామ సమీపంలోని శ్రీ శివాని ఇంజనీరింగ్ కళాశాలలో ఈవీఎం స్ట్రాంగ్ రూములను ఎన్నికల పోలీస్ అబ్జర్వర్లు దిగంబర్ పి ప్రధాన్ సచ్చింద్ర పటేల్ గురువారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ ఎన్నికల సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం కౌంటింగ్ సెంటర్లను సందర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక, పలువురు జిల్లా ఉన్నతాధికారులు ఉన్నారు.
సార్వత్రిక ఎన్నికలు – 2024 ఎన్నికల పార్లమెంట్ నియోజకవర్గం VZM జిల్లా పోలీస్ అబ్జర్వర్ సచ్చింద్ర పటేల్, VZM జిల్లా జనరల్ అబ్జర్వర్ టాట్ పర్వేజ్ ఇక్బాల్ రోహేళ్ల గురువారం సాయంత్రం జిల్లాకు విచ్చేశారు. కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా.మనజీర్ జిలానీ సమూన్ ను ఇరువురు మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం ఎన్నికల అంశాలపై చర్చించుకున్నారు.
ఓపెన్ స్కూల్, టెన్త్ & ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో జిల్లాలో టెన్త్ పరీక్షలకు 767 మంది హాజరుకాగా 280 (36.51) శాతం మంది పాసయ్యారు. ఇంటర్మీడియట్ పరీక్షలకు 1705 మందికి 561 (32.90%) మంది ఉత్తీర్ణులయ్యారని గురువారం జిల్లా విద్యాశాఖాధికారి తెలిపారు. ఫలితాల్లో శ్రీకాకుళం టెన్త్ 17వ స్థానం, ఇంటర్మీడియట్‌లో 23వ స్థానంలో నిలిచిందని వారు వెల్లడించారు.
ఎచ్చెర్ల డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలోగల డిగ్రీ మూడో సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను గురువారం సాయంత్రం యూనివర్సిటీ డీఎన్ విడుదల చేశారు. ఈ పరీక్ష ఫలితాలను జ్ఞానభూమి వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చని తెలిపారు. అదేవిధంగా డిగ్రీ మొదటి, 5వ సెమిస్టర్ పరీక్ష ఫలితాలను కొద్ది రోజుల్లో విడుదల చేస్తామని పేర్కొన్నారు.
నూతన కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంను ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం శాసన సభ నియోజకవర్గాలకు సంబంధించి వ్యయ పరిశీలకులు నవీన్ కుమార్ సోని గురువారం పరిశీలించారు. కంట్రోల్ రూంలో మీడియా సర్టిఫికేషన్ మోనిటరింగ్ కమిటీ, సోషల్ మీడియా, కంప్లైంట్ మోనిటరింగ్ సెల్, సీ-విజిల్స్ టీం, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్, బ్యాలెట్ పేపర్లు, పోస్టల్ పలు శాఖలను ఆయన పరిశీలించారు.
ఎచ్చెర్లలోని చిలకపాలెం జాతీయ రహదారిపై గురువారం జరిగిన ప్రమాదంలో ఆటో డ్రైవర్ మజ్జి అచ్చెప్పడు మృతి చెందాడు. పొందూరులోని లోలుగు గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్‌గా పోలీసులు గుర్తించారు. ఆటోను వెనుక నుంచి వ్యాన్ ఢీకొనడంతో అదుపు తప్పి బోల్తా పడింది. చికిత్స నిమిత్తం శ్రీకాకుళం ఆసుపత్రికి ఆయనను తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Sorry, no posts matched your criteria.