India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సార్వత్రిక ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేకంగా పరిశీలకులను భారత ఎన్నికల కమిషన్ నియమించిందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మనజీర్ జిలానీ సమూన్ అన్నారు. ఎన్నికల్లో అభ్యర్థులు, పార్టీలు చేస్తున్న వ్యయానికి సంబంధించి ఏవైనా ఫిర్యాదులు ఉంటే మండల పరిశీలకులకు నేరుగా కానీ ఫోన్‌లో గాని ఫిర్యాదు చేయవచ్చని ఆయన పేర్కొన్నారు.
మామిడి కాయలు కొమ్మలకు కాయడం సహజం. ఎల్‌ఎన్‌పేట మండలం చింతలబడవంజ గ్రామంలోని ధనలక్ష్మీ అనే గృహిణి ఇంటి బయట మామిడి వృక్షాన్ని నరికేశారు. అయినా కాండానికి గుత్తులుగా కాసిన మామిడి కాయలు అటుగా వెళ్లే చూపరులను ఆకట్టుకుంటున్నాయి.
బలిజిపేట మండలం పెద్ద పింకీ గ్రామానికి చెందిన కొంత మంది వంగర మండలం పట్టు వర్ధనం గ్రామానికి శుభకార్య నిమిత్తం గురువారం వెళ్లారు. అనంతరం తిరిగి వస్తుండగా పట్టువర్ధనం గ్రామ శివారులో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ సంఘటనలో సత్తమ్మ అనే మహిళ అక్కడిక్కడే మృతి చెందగా పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని 108 సహాయంతో క్షతగాత్రులను రాజాంలో పలు హాస్పిటళ్లకు తరలించారు.
సార్వత్రిక ఎన్నికలు- 2024 నేపథ్యంలో జిల్లా ఎన్నికల పోలీసు పరిశీలకులుగా మహారాష్ట్రకు చెందిన అధికారి దిగంబర్ పి ప్రధాన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. ఈ మేరకు గురువారం జిల్లాకు చేరుకున్న ఆయనకు జిల్లా ఎస్పీ జి.ఆర్.రాధిక అతిథి గృహంలో మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుచ్ఛం అందజేశారు. జిల్లాలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన పోలీసు శాఖ పరమైన పలు అంశాలపై చర్చించారు.
శ్రీకాకుళం టీడీపీ ఎంపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఆయన భార్య శ్రావ్య పేరిట రూ.23. 29 కోట్ల ఆస్తులున్నాయని నామినేషన్ పత్రాలతో పాటు దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. బీటెక్, ఎంబీఏ చదివినట్లు తెలిపారు. దంపతుల పేరిట రూ.6.78 కోట్ల చరాస్తులు, రూ.16.51 కోట్ల స్థిరాస్తులు, 2,335 గ్రాముల బంగారం, రూ.2.98 కోట్ల రుణాలు ఉన్నాయని పేర్కొన్నారు.
రాజాం-శ్రీకాకుళం ప్రధాన రహదారి మెట్టవలస బస్ షెల్టర్ వద్ద బుధవారం ఓ మహిళ అపస్మారక స్థితిలో పడి ఉండడంతో స్థానికులు గమనించి 108కి సమాచారం అందించారు. 108 సిబ్బంది ప్రథమ చికిత్స అందించి రాజాం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మరణించింది. వివరాలు తెలిసిన వారు రాజాం పోలీసులను సంప్రదించాలని కోరారు.
శ్రీకాకుళం టీడీపీ పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడిగా కలమట వెంకటరమణమూర్తి నియమితులయ్యారు. ఈ మేరకు టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన విడుదలైంది. పాతపట్నం టీడీపీ ఎమ్మెల్యే టికెట్ ఆయనకు కేటాయించకపోవడంతో ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేసేందుకు కలమట సిద్ధమయ్యారు. మంగళవారం చంద్రబాబుతో జరిగిన భేటీతో కలమట వెనక్కి తగ్గారు. చంద్రబాబు ఆదేశానుశారం పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడిగా నియమించారు.
సాధారణ ఎన్నికల నేపథ్యంలో కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్, కంట్రోల్ రూమ్ (ఎన్నికల నియంత్రణ కేంద్రం)లను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ బుధవారం పరిశీలించారు. అన్ని విభాగాలను స్వయంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఎన్నికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు.
*టెక్కలి: ముగిసిన సీఎం జగన్ బస్సుయాత్ర
*ఆమదాలవలస: తమ్మినేనికి రోజులు దగ్గరపడ్డాయి: చంద్రబాబు
*జలుమూరు: శ్రీముఖలింగాన్ని తాకిన సూర్యకిరణాలు
*పాతపట్నం: నామినేషన్ నిర్ణయం వెనక్కి తీసుకున్న కలమట
*పాలకొండ: రిటర్నింగ్ ఆఫీసర్‌గా శుభం బన్సాల్
*శ్రీకాకుళం: ఎంపీ అభ్యర్థిగా రామ్మోహన్ నామినేషన్
*ఎల్.ఎన్.పేట: ఈదురు గాలులతో వర్షం
*ఎచ్చెర్ల: ఆలయంలో 30 తులాల బంగారం చోరీ
శ్రీకాకుళం:ఆదిత్యుని సన్నిధిలో కూచిపూడి
➤పలాస:JBNP-అనిల్ కుమార్, ➤ ఇచ్ఛాపురం: YCP- పిరియా విజయ, TDP- అశోక్, INCP- చక్రవర్తి రెడ్డి, BCYP-బడి ముఖలింగం ➤ టెక్కలి: INCP-విక్రాంత్, JBNP- పరమేశ్వరరావు ➤ శ్రీకాకుళం: YCP – ప్రసాదరావు, BSP-సూర్యనారాయణ,➤ ఆమదాలవలస: JCVIVP- రేవతి, ➤ పాతపట్నం: BSP- కృష్ణారావు, ➤ ఎచ్చెర్ల: BJP అభ్యర్థిగా – ఈశ్వరరావు .. NOTE:- పై వారితో పాటుగా ఏడుగురు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ వేశారు.
Sorry, no posts matched your criteria.