Srikakulam

News April 25, 2024

26న నామినేషన్ల పరిశీలన: కలెక్టర్

image

ఈ నెల 26వ తేదీన నామినేషన్ల పరిశీలన (స్క్రుటినీ) ఉంటుందని.. అదే విధంగా 29వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు వీలుంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఆర్వో లు, నోడల్ అధికారులతో నిర్వహించారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం సింబల్ అలాట్‌మెంట్ జరుగుతుందని వివరించారు.

News April 25, 2024

ఎచ్చెర్ల: ఆలయంలో 30 తులాల బంగారం చోరీ

image

ఎచ్చెర్ల మండలంలోని కుంచాల కురమయ్యపేట దేవీ ఆశ్రమంలో భారీ చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు 30 తులాల బంగారం, 100 తులాల వెండి, రూ.44 లక్షల నగదు చోరీకి గురైనట్లు అర్చకుడు బాల భాస్కర శర్మ తెలిపారు. ఈ ఘటన మంగళవారం రాత్రి జరిగిందని బుధవారం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆలయంలోని సీసీ ఫుటేజ్‌ని దొంగలు ధ్వంసం చేశారు. ఈ మేరకు క్లూస్ టీం ఆలయంలో వివరాలు సేకరిస్తున్నారు.

News April 25, 2024

శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా రామ్మోహన్ నామినేషన్

image

శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ ఉమ్మడి కూటమి అభ్యర్థిగా కింజరాపు రామ్మోహన్ నాయుడు బుధవారం నామినేషన్ పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు, కలమట వెంకటరమణ, కింజరాపు హరి వరప్రసాద్ తదితరులు ఉన్నారు. ఈ మేరకు నామినేషన్ పత్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి మంజీర్ జిలాని సమూన్‌కు అందజేశారు.

News April 25, 2024

సిక్కోలులో పొలిటికల్ హీట్

image

శ్రీకాకుళం జిల్లాలో పొలిటికల్ హీట్ నెలకొంది. అధికార, ప్రతిపక్ష నేతలిద్దరూ జిల్లాలోనే ఉన్నారు. నిన్న పాతపట్నం ప్రజాగళం సభలో పాల్గొన్న చంద్రబాబు.. ఈరోజు శ్రీకాకుళం మున్సిపల్ గ్రౌండ్ లో మహిళలతో ముఖాముఖి నిర్వహించనున్నారు. సీఎం జగన్ కూడా శ్రీకాకుళం జిల్లాలోనే ఉన్నారు. మేమంతా బస్సు యాత్ర భాగంగా ఈరోజు ఎచ్చెర్ల నుంచి శ్రీకాకుళం బైపాస్ మీదుగా టెక్కలి చేరుకుని.. అక్కడ సభలో ప్రసంగించనున్నారు.

News April 25, 2024

నామినేషన్ నిర్ణయం వెనక్కి తీసుకున్న మాజీ ఎమ్మెల్యే

image

టీడీపీ టికెట్ ఆశించి బంగపడిన పాతపట్నం మాజీఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తి స్వతంత్ర అభ్యర్థిగా బుధవారం నామినేషన్ వేయనున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. జిల్లా పర్యటనకు విచ్చేసిన చంద్రబాబు మంగళవారం రాత్రి కలమటను పిలిచి మాట్లాడారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నామినేటెడ్ పదవి ఇస్తామని కలమటకు చంద్రబాబు హామీ ఇచ్చారు. దీంతో కలమట ఆయన అనుచరులతో మాట్లాడి, నామినేషన్ నిర్ణయం వెనక్కి తీసుకున్నారు.

News April 25, 2024

పాలకొండ రిటర్నింగ్ ఆఫీసర్‌గా శుభం బన్సాల్

image

పాలకొండ రిటర్నింగ్ ఆఫీసర్, సీతంపేట ఐటిడిఏ పిఓగా శుభం బన్సాల్‌ను నియమిస్తూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. వెంటనే విధుల్లో చేరి బుధవారం మధ్యాహ్నం 1:00 లోపు జాయినింగ్ రిపోర్టును సమర్పించాలని ఐటిడిఏకు సమాచారం అందింది. ఐటిడిఏ రిటర్నింగ్ ఆఫీసర్‌గా పనిచేసిన కల్పనా కుమారిని బదిలీ చేశారు. అనంతరం జేసి శోభికకు ఇన్‌ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు.

News April 25, 2024

శ్రీకాకుళం: సీఎం జగన్ పర్యటన షెడ్యూల్ ఇదే

image

శ్రీకాకుళం జిల్లాలో బుధవారం సీఎం జగన్ పర్యటన వివరాలు మంగళవారం వెలువడ్డాయి. సీఎం జగన్ బుధవారం ఉదయం 9 గంటలకు అక్కివలస నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి మధ్యాన్నం 12 గంటలకు పరశురాంపురం జంక్షన్‌కు చేరుకుంటారు. సాయంత్రం 4.20 గంటలకు టెక్కలి మండలం అక్కవరం గ్రామం వద్ద జరగనున్న బహిరంగ సమావేశంలో సీఎం పాల్గొనున్నట్లు సీఎంఓ అధికారులు తెలిపారు.

News April 25, 2024

మంచినీటి సరఫరాకు ఇబ్బంది లేదు: కలెక్టర్

image

జిల్లాలో ప్రస్తుత వేసవిలో మంచినీటికి ఎటువంటి సమస్య తలెత్తకుండా పటిష్ఠమైన ప్రణాళిక రూపొందించుకుని అమలు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్‌రెడ్డికి తెలిపారు. BZA నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సమీక్షించారు. ప్రస్తుతం వేసవిలో ఎక్కడా తాగునీటికి ఎటువంటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

News April 25, 2024

శ్రీకాకుళం: ఎన్నికల సాధారణ పరిశీలకులు రాక

image

సార్వత్రిక ఎన్నికలు 2024లో భాగంగా జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు (జనరల్ అబ్జర్వర్)గా హరియాణాకు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి శేఖర్ మంగళవారం జిల్లాకు చేరుకున్నారు. ఆయనకు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ మనజీర్ జిలాని సమూన్ ఘన స్వాగతం పలికారు. జాయింట్ కలెక్టర్ ఎం నవీన్‌తో కలిసి పుష్పగుచ్ఛం అందజేసిన కలెక్టర్ అనంతరం జిల్లాలో ఎన్నికలకు సంబంధించిన పలు అంశాలపై కొద్దిసేపు వివరించారు.

News April 25, 2024

శ్రీకాకుళంలో నామినేషన్ వేసింది వీరే..

image

➤ పలాస: CPI- కామేశ్వరరావు
➤ ఇచ్ఛాపురం: BSP- వేదవర బైసాయి
➤ టెక్కలి: BSP- శ్రీనివాసరావు,
➤శ్రీకాకుళం: PPI-లక్ష్మణ
➤ ఆమదాలవలస: PPI-మధుసూదనరావు
➤ పాతపట్నం:INCP- వెంకట్‌రావు, స్వతంత్ర – మోహనరావు, JBNP- తిరుపతిరావు, కృష్ణ- స్వతంత్ర అభ్యర్థి, GDP- సంజీవరావు
➤ ఎచ్చెర్ల: గొర్లె కిరణ్ కుమార్ – స్వతంత్ర అభ్యర్థి, రమ్య సువ్వారు స్వతంత్ర అభ్యర్థి నామినేషన్లు దాఖలు చేశారు.