India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికల ప్రకారం బుధవారం శ్రీకాకుళం జిల్లాలోని 13 మండలాల్లో తీవ్ర వడగాలులు,16 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ మనజీర్ జిలాని సమూన్ మంగళవారం తెలిపారు. ఆమదాలవలస,బూర్జ,గంగువారి సిగడాం, పొందూరు, సరుబుజ్జిలి, నర్సన్నపేట, జలుమూరు, టెక్కలి, కోటబోమ్మాళి, సారవకోట, పాతపట్నం, హిరమండలం, ఎల్ ఎన్ పేట మండలాల్లో తీవ్ర వడగాలులు ఉంటాయన్నారు.
సార్వత్రిక ఎన్నికల సమయంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో మరో ఐఏఎస్ అధికారిణిని బదిలీ చేశారు. సీతంపేట ఐటీడీఏ పీఓ, పాలకొండ ఎన్నికల రిటర్నింగ్ అధికారిని కల్పనా కుమారిని బదిలీ చేస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ డా.కె.ఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈమె స్థానంలో పార్వతీపురం మన్యం జిల్లా జాయింట్ కలెక్టర్ శోభితకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ నియమించారు.
పదో తరగతి పరీక్ష ఫలితాల్లో కాశీబుగ్గకు చెందిన విద్యార్థి ఎస్ శ్రీకర్ 597/600 మార్కులు సాధించి ఉత్తరాంధ్ర జిల్లాల టాపర్‌గా నిలిచాడు. సంతకవిటి మండలం వాసుదేవుపురం గ్రామానికి చెందిన శ్రీకర్ తండ్రి ఎస్ రామరాజు కాశీబుగ్గ శ్రీ చైతన్య కళాశాలలో ఎఓగా పని చేస్తుండగా తల్లి లలిత గృహిణిగా ఉన్నారు. ఈ సందర్భంగా శ్రీకర్ కు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందించారు
టెక్కలి అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ వేస్తానని ప్రకటించిన వైసీపీ సీనియర్ నాయకురాలు, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ముందుగా ఈనెల 22న నామినేషన్ వేస్తానని ఆమె ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వైసీపీ పెద్దలు వాణితో సంప్రదింపులు జరిపారు. దీంతో నామినేషన్ వేసే నిర్ణయాన్ని ఆమె వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది.
టెక్కలి అసెంబ్లి కూటమి అభ్యర్థి అచ్చెన్నాయుడు ఆస్తుల వివరాలను సోమవారం నామినేషన్ నేపథ్యంలో అఫిడవిట్‌లో పొందుపరిచారు. స్థిరాస్తులు: రూ.2,31,48,500 ఉండగా, చరాస్తులు: రూ. 1,32,05,511 ఉన్నట్లు వెల్లడించారు. అప్పులు: రూ.42,90,153, చేతిలో నగదు: రూ. 2,50,000, వివిధ బ్యాంకుల్లో: రూ.64,18,869 ఉన్నట్లు అఫిడవిట్‌లో చూపించారు.
ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైన వారి సంఖ్య 23,157 కాగా ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణులైన వారు 2,774 తృతీయ శ్రేణిలో ఉత్తీర్ణులైన వారి సంఖ్య 902గా ఉంది. జిల్లా మొత్తం ఉత్తీర్ణులైన వారి సంఖ్య 26,833గా అధికారులు సోమవారం వెల్లడించారు. వీరందరికీ జిల్లాలోని విద్యాశాఖ అధికారులతో పాటుగా పలువురు ఉన్నతాధికారులు అభినందించారు.
➤ పలాస: YCP అప్పలరాజు
➤ ఇచ్ఛాపురం: స్వతంత్రంగా లక్ష్మీ
➤ టెక్కలి: TDP అచ్చెన్నాయుడు
➤ శ్రీకాకుళం: TDP శంకర్, INCP కృష్ణారావు,
➤ ఆమదాలవలస: YCP సీతారాం, INCP అన్నాజీ రావు, BSP సోమేశ్వరరావు, స్వతంత్రంగా సురేశ్
➤ పాతపట్నం: YCP రెడ్డి శాంతి, కూటమి మామిడి గోవిందరావు
➤ ఎచ్చెర్ల: PPI నీలాచలం, JBNP కొర్లయ్య, INCP మల్లేశ్వరరావు,
➤ నరసన్నపేట: YCP కృష్ణదాస్, NCP కామేశ్వరి, INCP నరసింహ మూర్తి.
పదో తరగతిలో ఒక సబ్జెక్టు ఫెయిల్ కావడంతో మనస్తాపంతో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. వివరాలోకి వెళ్తే.. కోటబొమ్మాళి మండలం విశ్వనాథపురం పంచాయతీ సీతారాంపురానికి చెందిన వజ్రగడ్డి జానకి(16) పదిలో బక సబ్జెక్టు ఫెయిల్ కావడంతో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. తల్లి సరోజనమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు స్థానిక ఏస్‌ఐ షేక్‌మహ్మద్ ఆలీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
హిరమండలం రెల్లివీధికి చెందిన కళింగపట్నం ధనుంజయ(26) పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారి కథనం ప్రకారం.. ధనుంజయకు రూ.5000 అప్పుగా ఇచ్చిన పందిరి రాజా అనే వ్యక్తి, అతని అనుచరులు అప్పు తీర్చమని ఇటీవల దారుణంగా కొట్టి, ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరించారు. వేధింపులకు భయపడి తన కొడుకు ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడు తండ్రి భూలోకం ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
శ్రీకాకుళం కాంగ్రెస్ అభ్యర్థిగా పైడి నాగభూషణ్ స్థానంలో అంబటి కృష్ణారావును ఆ పార్టీ ప్రకటించింది. కాంగ్రెస్ గతంలో 114 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా తాజాగా 38 నియోజకవర్గాలకు ఖరారు చేసింది. ఇందులో శ్రీకాకుళం కాంగ్రెస్ అభ్యర్థిని తాజాగా మార్చింది. అటు వైసీపీ అభ్యర్థిగా ధర్మాన ప్రసాద్ రావు, కూటమి నుంచి గొండు శంకర్ బరిలో ఉన్నారు.
Sorry, no posts matched your criteria.