Srikakulam

News March 18, 2024

శ్రీకాకుళం: కలెక్టరేట్‌లో స్పందన కార్యక్రమం రద్దు

image

నేడు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించాల్సిన స్పందన కార్యక్రమం రద్దు చేసినట్లు డీఆర్ఓ ఎం.గణపతి రావు తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న వినతుల స్వీకరణ కార్యక్రమం తాత్కాలికంగా నిలుపుదల చేశామన్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తి అయిన తరువాత తదుపరి తేదీ ప్రకటిస్తామని తెలిపారు.

News March 17, 2024

శ్రీకాకుళం: ఎన్నికల నిర్వహణకు పార్టీలు సహకరించాలి

image

ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో జిల్లాలో ఎన్నికలు స్వేచ్చాయుత వాతావరణంలో నిర్వహించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మనజీర్ జిలాని సామూన్ అన్నారు. అందులో భాగంగానే రాజకీయ పార్టీలకు చెందిన బ్యానర్లు, పోస్టర్లు, కటౌట్లు, హోర్డింగులు, జెండాలు వంటివన్నీ తొలగిస్తున్నామన్నారు. అనంతరం ఎన్నికల నియమావళికి సంబంధించిన బుక్‌లెట్‌ను వారికి అందజేశారు.

News March 17, 2024

శ్రీకాకుళం: లోన్‌యాప్స్ పై అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

image

ఫోన్‌కు వచ్చే గుర్తింపు లేని లింకులను క్లిక్ చేసి, వాటిని ఇన్‌స్టాల్ చేసుకొని సైబర్ నేరాలకు గురికావద్దని ఎస్పీ రాధిక సూచించారు. ఈ మేరకు ఆమె ఆదివారం ప్రకటన విడుదల చేశారు. ఏదైనా లోన్‌యాప్‌కు సంబంధించిన అప్లికేషన్‌ను డౌన్లోడ్ కోసం యాప్ అఫీషియల్ యాప్ స్టోర్ నుంచి చేసుకోవాలన్నారు. సైబర్ నేరాలపై ఎల్లప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అన్నారు.

News March 17, 2024

ఇచ్ఛాపురం: కూలీ బిడ్డ.. గేట్‌లో మెరిసి

image

ఇచ్ఛాపురం మండలం తులసిగాం గ్రామపంచాయతీ ఎ.బలరాంపురం గ్రామానికి చెందిన ఎ.నీలాద్రి 2024 గేట్ ఎగ్జామ్‌లో ఆల్ ఇండియాలో 343వ ర్యాంకు కైవసం చేసుకున్నారు. ఒక వ్యవసాయ కూలీ కుటుంబం నుంచి వచ్చిన నీలాద్రి కఠోర సాధనతో అత్యుత్తమ ర్యాంక్ సాధించడం పై పలువురు గ్రామస్తులు అభినందనలు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ స్నేహితుడు శంకర్ సహాయంతో ఈ విజయం సాధించినట్లు నీలాద్రి తెలిపారు.

News March 17, 2024

శ్రీకాకుళం: ప్రశాంతంగా గ్రూప్-1 పరీక్షలు

image

శ్రీకాకుళం జిల్లాలో గ్రూప్-1 పరీక్షలు సజావుగా సాగాయి. జిల్లా వ్యాప్తంగా 18 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. పేపర్ -1 కు సంబంధించి మొత్తం 6,403 మందికి గానూ పరీక్షలకు 4,124 మంది హాజరైనట్లు అధికారులు పేర్కొన్నారు. 2,279 మంది పరీక్షలకు హాజరుకానట్లు వెల్లడించారు. పేపర్-2కు సంబంధించి 6,403 మందికి 4088 మంది హాజరయ్యారు. 2,315 మంది పరీక్షలకు హాజరు కాలేదు.

News March 17, 2024

శ్రీకాకుళం:గ్రూప్ -1 పరీక్షలను పరిశీలించిన కలెక్టర్

image

ఏపీ పబ్లిక్ సర్వీస్ కమీషన్ నిర్వహిస్తున్న గ్రూప్-1 పరీక్షల నిర్వహణను జిల్లా కలెక్టర్ డా.మనజీర్ జీలాని సమూన్ స్థానిక శ్రీ చైతన్య స్కూల్ ఆదివారం ఆకస్మిక తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. పరీక్షలు రాసే అభ్యర్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులకు సూచనలు చేశారు.

News March 17, 2024

శ్రీకాకుళం: నేటి ఆదిత్యుని ఆదాయ వివరాలు

image

అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి ఆదివారం వచ్చిన ఆదాయాన్ని అధికారులు వెల్లడించారు. టికెట్లు రూపేనా రూ.3,02,300, పూజలు, విరాళాల రూపంలో రూ.88,790, ప్రసాదాల రూపంలో రూ.1,92,006, శ్రీ స్వామి వారికి ఆదాయం వచ్చిందని ఆలయ ఈవోఎస్ చంద్రశేఖర్ తెలిపారు. సెలవు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామిని దర్శించుకున్నారని ఆయన తెలిపారు.

News March 17, 2024

ఇచ్చాపురం: ఆ కుటుంబాల మధ్య మరోసారి పోటీ

image

ఇచ్చాపురం నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీ నుంచి బెందళం, పిరియా కుటుంబాల మధ్య మరోసారి పోటీ పడనున్నాయి. 2019 ఎన్నికల్లో ఇచ్చాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ నుంచి బెందళం అశోక్ బాబు పోటీ చేయగా వైసీపీ నుంచి పిరియా సాయిరాజ్ పోటీ చేశారు. అశోక్ గెలుపొందారు. 2024 ఎన్నికల్లో టీడీపీ నుంచి బెందళం అశోక్ పోటీకి సిద్ధం కాగా పిరియా సాయిరాజ్ భార్య విజయ పోటీ పడనున్నారు.

News March 17, 2024

ఆమదాలవలస: పదోసారి పోటీలో తమ్మినేని

image

ఆమదాలవలస నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో వైసీపీ నుంచి అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం పదో సారి పోటీకి సిద్ధం అవుతున్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ నుంచి శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గం టీడీపీ అధ్యక్షులు కూన రవికుమార్ మూడో సారి బరిలోకి దిగారు. రవికుమార్ అక్క వాణి తమ్మినేని భార్య కావడంతో.. బావ బామ్మర్దులు ఇద్దరూ పోటీ పడుతున్నారు.

News March 17, 2024

శ్రీకాకుళం: టెన్త్ విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం

image

ఈ నెల18వ తేదీ నుంచి 30 వరకు జరిగే 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి ఏ.విజయ కుమార్ శనివారం తెలిపారు. విద్యార్థులు ఇంటి వద్ద నుంచి పరీక్ష కేంద్రం వరకు అన్ని పల్లెవెలుగు, ఆల్ట్రా పల్లెవెలుగు బస్సులలో ఉచిత ప్రయాణానికి అనుమతిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.