India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శ్రీకాకుళం జిల్లాలో తొలి రోజు స్వతంత్ర అభ్యర్థులే నామినేషన్లు వేశారు. ప్రధాన పార్టీల నుంచి ఎవరూ వేయలేదు. ఇక శ్రీకాకుళం స్థానానికి ఒక్క నామినేషన్ కూడా పడలేదు. జిల్లాలో 8 స్థానాలు ఉంటే నాలుగుస్థానాల్లో మాత్రమే నామినేషన్లు దాఖలు కాగా.. అందులో 6 నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. మిగిలిన నాలుగింటిలో ఒక్క నామినేషన్ కూడా పడలేదు.
కవిటి మండలం వరకకు చెందిన బెంతు ఒరియా సంఘం అధ్యక్షుడు శ్యాంసుందర్ పురియా తుదిశ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న మాజీ MLA, వైసీపీ నేత పిరియా సాయిరాజ్, వైసీపీ కవిటి మండల అధ్యక్షుడు కడియాల ప్రకాశ్ శ్యాంసుందర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం పాడె మోసి అంతిమయాత్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్యాంసుందర్ మృతితో వైసీపీ కీలక నేతను కోల్పోయిందని సాయిరాజ్ అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆశించారు.
కుటుంబకలహాలతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన కోటబొమ్మాళి మండలం చీపుర్లపాడు పంచాయితీ ఊడికలపాడులో చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం ప్రకారం.. గ్రామానికి చెందిన నేతింటి రమేష్(36) చెడు వ్యసనాలకు బానిసగా మారాడు. కుటుంబకలహాలతో గురువారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం అలుముకుంది.
ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ, బెటర్మెంట్ పరీక్షలకు హాజరు కాబోయే విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లింపునకు ఈనెల 24తో గడువు ముగిస్తుందని శ్రీకాకుళం ఆర్ఐఓ పి. దుర్గారావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు ఆన్లైన్ ద్వారా ఈనెల 24లోగా అప్లై చేసుకోవాలని సూచించారు. ప్రాక్టికల్స్ లో ఫెయిల్ అయిన వారికి మే 1 నుంచి 4 వరకు పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో తొలి రోజు నాలుగు నియోజకవర్గాల్లో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇచ్ఛాపురం స్వతంత్ర అభ్యర్థిగా జె.సూర్య వరప్రసాదరావు, టెక్కలి స్వతంత్ర అభ్యర్థిగా రాజేష్, ఆమదాలవలస స్వతంత్ర అభ్యర్థులుగా జగదీశ్వరరావు, వెంకట రాజశేఖర్, ఎచ్చెర్ల స్వతంత్ర అభ్యర్థులుగా నేతల ఈశ్వరరావు, నడుపూరు ఈశ్వరరావు నామినేషన్లు వేశారు. కాగా.. ప్రధాన పార్టీల నుంచి ఏ ఒక్కరూ తొలిరోజు నామినేషన్ దాఖలు చెయ్యలేదు.
శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి మొదటి రోజు గురువారం ఎటువంటి నామినేషన్లు రాలేదని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలాని సమూన్ తెలిపారు. గురువారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్ కోసం ఎవరు దాఖలాలు చేసుకోలేదని ఆయన స్పష్టం చేశారు.
టెక్కలి ఎమ్మెల్యేగా జడ్పీటీసీ దువ్వాడ వాణీ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈనెల 22న ఆమె నామినేషన్ వేయనున్నట్లు సమాచారం. వైసీపీ సీనియర్ మహిళా నాయకురాలుగా ఉన్న ఆమె టెక్కలి వైసీపీ అసెంబ్లీ టికెట్‌ను ఆశించారు. టెక్కలి వైసీపీ అభ్యర్థిగా శుక్రవారం దువ్వాడ శ్రీనివాస్ నామినేషన్ వేయనుండగా.. ఆయన భార్య కూడా బరిలో ఉండనున్నట్లు వార్తలు వస్తున నేపథ్యంలో టెక్కలిలో రాజకీయం ఆసక్తిగా మారింది.
నిన్నటి వరకు మోస్తరు వర్షాలు, చలిగాలులతో ఉపశమనం పొందిన ప్రజలకు ఎండలు మళ్లీ దంచికొడుతున్నాయి. బుధవారం జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల సెల్సియస్ పైగా నమోదయ్యాయి. గరిష్ఠంగా శ్రీకాకుళం(D) విజయనగరం, పార్వతీపురంమన్యం(D) సీతంపేట మండలాల్లో 42.7 డిగ్రీలు నమోదైంది. నేడు, రేపు ఉష్ణోగ్రతలు మరో 2-3 డిగ్రీలు పెరగొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి అని సూచించారు.
ఆర్డీవో, శ్రీకాకుళం, ఆమదాలవలస తహశీల్దారు కార్యాలయం, పాతపట్నం తహశీల్దారు కార్యాలయం, ఇచ్ఛాపురం తహశీల్దారు కార్యాలయం, పలాస తహశీల్దార్ కార్యాలయం, టెక్కలి తహశీల్దారు, నరసన్నపేట, ఎచ్చెర్ల తహశీల్దార్ కార్యాలయాలో నామపత్రాలు స్వీకరిస్తారు. నామపత్రాలు నేటి నుంచి 25 వరకు స్వీకరిస్తారు. 26న అధికారులు నామపత్రాలను పరిశీలిస్తారు.
పిడుగుపాటుకు గురై మహిళ మృత్యువాత పడిన ఘటన గార మండలంలో బుధవారం చోటుచేసుకుంది. వత్సవలస పంచాయతీ మొగదాల పాడు గ్రామానికి చెందిన కుందు భాగ్యలక్ష్మి (39) బుధవారం సాయంత్రం ఆకాశం మేఘావృతమై ఉండటంతో ఆరేసిన దుస్తులు తీసేందుకు ఇంట్లో నుంచి బయటకు వెళ్లారు. ఆ సమయంలో పిడుగుపాటుకు గురయ్యారు. భాగ్యలక్ష్మి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. దీనిపై తమకు ఫిర్యాదు అందలేదని గార ఎస్సై కె. కృష్ణప్రసాద్ పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.