Srikakulam

News April 16, 2024

శ్రీకాకుళం: ఈనెల 18 నుంచి నామినేషన్ల స్వీకరణ

image

ఈనెల 18వ తేదీ నుంచి సాధారణ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ నిర్వహణకు రిటర్నింగ్ అధికారులందరూ సన్నద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు. మంగళవారం BZA నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్చువల్‌గా జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్న నామినేషన్ల స్వీకరణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాల పై మీనా సమీక్షించారు.

News April 16, 2024

శ్రీకాకుళం: విజయం మనదే: ఎంపీ

image

రానున్న ఎన్నికలలో జయం మనదేనని తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడుతో యువనాయకుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. పలాస సభ ముగించుకుని మంగళవారం తిరుగుప్రయాణం అయిన చంద్రబాబు హెలికాప్టర్ ఎక్కిన సమయంలో రామ్మోహన్ నాయుడుతో మాట్లాడారు. కొన్ని నిమిషాల పాటు వారి మద్య మాటామంతి కొనసాగింది. చంద్రబాబు తిరుగుప్రయాణం అయినప్పుడు రామ్మోహన్ నాయుడు విక్టరీ సింబల్ చూపించి జయం మనదేనని ధీమాను వ్యక్తం చేశారు.

News April 16, 2024

వేడి గాలులపై అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ 

image

శ్రీకాకుళం జిల్లాలో వేసవి వేడి గాలులపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ సూచించారు. మంగళవారం ఆయన కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు, మెడికల్ ఆఫీసర్లు, సూపర్‌వైజరీ సిబ్బందికి అవగాహన కల్పించారు. ఆరోగ్య సదుపాయాలను పెంచడంతోపాటు వేడిగాలుల ఎక్కువగా ఉన్న సమయంలో చేయకూడని పనులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆదేశించారు.

News April 16, 2024

శ్రీకాకుళం: యూపీఎస్సీలో వెంకటేష్‌కు 467 ర్యాంక్

image

శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం అల్లాడపేట గ్రామానికి చెందిన బాన్న వెంకటేష్ యూపీఎస్సీ ఫలితాలలో 467 ర్యాంకు సాధించారు. ఈ మేరకు ఆయన మంగళవారం తెలిపారు. మారుమూల గ్రామం నుంచి 467వ సాధించడం పట్ల ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.మన్మధరావు, జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేశారు.

News April 16, 2024

గొండు శంకర్‌తో కలిసి పనిచేయలేం:గుండా దంపతులు

image

గొండు శంకర్‌తో కలిసి పనిచేయమని మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి దంపతులు తేల్చేశారు. మంగళవారం శ్రీకాకుళం పార్లమెంట్ పార్టీ భేటీ పలాసలో జరిగింది. ఈ సందర్భంగా అధినేత చంద్రబాబుతో శ్రీకాకుళం సీటుపై చర్చలు జరిపారు. తమకు కానీ లేదా వేరొకరికి టికెట్ ఇచ్చినా సమ్మతమే అన్నారు. వేరొకరికి ఇచ్చినా మద్దతు ఇచ్చి పనిచేస్తాం కానీ, రెండున్నరేళ్లుగా అసమ్మతి రాజేసిన గొండు శంకర్‌తో కలిసి పని చేయలేమని వెనుదిరిగారు.

News April 16, 2024

సారవకోటలో 100 మంది వాలంటీర్లు రాజీనామా

image

సారవకోట మండల కేంద్రంలో 100 మంది వాలంటీర్లు మంగళవారం స్వచ్ఛందంగా రాజీనామాలు చేశారు. తమ రాజీనామా పత్రాన్ని సచివాలయం సెక్రటరీ ద్వారా ఎంపీడీవోకి అందజేశారు. తామంతా నిరుపేదలకు ఎన్నో సంక్షేమ , అభివృద్ధి పథకాలు అందించామన్నారు. కానీ కూటమి నాయకులు తమపై చేస్తున్న ఆరోపణలు బాధించాయన్నారు.

News April 16, 2024

పాలకొండ: 200 ఏళ్ల నాటి రామాలయం

image

పాలకొండ రోడ్డులో ఉన్న కోదండ రామాలయం 200 ఏళ్ల కిందట అళ్వార్లు నిర్మించారు. 1826లో అయోధ్య నుంచి నాటు బండ్లపై సీతారామ విగ్రహాలను తీసుకొచ్చి ప్రతిష్ఠించారు. కోదండ రామాలయంగా ఉన్న ఈ ప్రదేశంలో అద్దమడుగుల వెంకన్న పంతులు పేదవారికి, అనాథల కోసం అన్నసత్రం ఏర్పాటు చేశారని, ఆయన ఆధ్వర్యంలోనే కోదండ రామాలయం నిర్మించినట్టు అర్చకులు బంకుపల్లి శేషాచార్యులు తెలిపారు.

News April 16, 2024

కంచిలి: ట్రైన్ ఢీ కొని వ్యక్తి మృతి

image

సోంపేట హైవే బ్రిడ్జి కింద ఉన్న రైల్వే ట్రాక్ దాటుతుండగా ట్రైన్ ఢీ కొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఘటన స్థలానికి చేరుకొన్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కానీ మృతదేహం చిద్రమవ్వడంతో గుర్తుపట్టే స్థితిలో లేనట్లు తెలుస్తోందన్నారు. కాగా ఇది ప్రమాదమా ..? లేక ఆత్మహత్యా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు దర్యాప్తులో తెలియాల్సి ఉంది.

News April 16, 2024

ఎచ్చెర్ల: కౌన్సెలింగ్ డేట్ ప్రకటన

image

గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతి ప్రవేశానికి మిగిలిన సీట్లు భర్తీకి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామని, మెరిట్ లిస్టులో పేర్లు ఉన్న విద్యార్థులు హాజరు కావాలని గురుకుల విద్యాలయ సంస్థ జిల్లా కోఆర్డినేటర్ ఎన్ బాలాజీ ప్రకటించారు. ఈ ఏడాది పరీక్ష రాసిన విద్యార్థులలో బాలురకు ఈనెల 18వ తేదీన దుప్పలవలస గురుకుల పాఠశాలలో, 19న బాలికలకు పెద్దపాడు గురుకుల పాఠశాలలో ఉదయం 10 గంటలకు కౌన్సెలింగ్ ఇవ్వనున్నారు.

News April 16, 2024

వీరఘట్టం: దరఖాస్తులకు గడువు ముగింపు

image

మే నెల 13వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎన్నికల విధుల్లో పాల్గొనబోయే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తులు స్వీకరించినట్లు తహశీల్దార్ కే. జయప్రకాశ్ తెలిపారు. అయితే జిల్లా వ్యాప్తంగా దరఖాస్తు స్వీకరణకు సోమవారంతో గడువు ముగిసిందని అన్నారు. మొత్తం 220 మంది పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తులు చేసుకున్నట్లు పేర్కొన్నారు.