India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రణస్థలం మండలం జే.ఆర్.పురం 1, 2 గ్రామ సచివాలయాల పరిధిలోని 48 మంది గ్రామ వాలంటీర్లు ప్రతిపక్ష పార్టీల ఆరోపణలకు వ్యతిరేకంగా శనివారం స్వచ్చందంగా రాజీనామా చేశారు. ఈ సందర్బంగా వాలంటీర్లు మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డి అమలు చేసి అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు విస్తృతంగా వివరిస్తూ, రానున్న ఎన్నికల్లో మళ్ళీ వైసీపీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తామన్నారు.
జిల్లాలో 917 గ్రామ పంచాయతీలకు 2023-24 సంవత్సరంలో 11 నెలల కాలానికి గానూ జిల్లాలో వీధిదీపాలు, రక్షిత నీటి పథకాలకు సంబంధించి రూ.12 కోట్లు విద్యుత్ బకాయిలు ఉన్నాయి. వాటిని తక్షణమే జమ చేయాలని పంచాయతీరాజ్ కమిషనర్ మొదలుకొని జిల్లాస్థాయిలో డీపీవో, సీఈవో, ట్రాన్స్‌కో ఎస్ఈ తదితర శాఖల ఉన్నతాధికారులు డిమాండ్ చేశారు.
జై భారత్ నేషనల్ పార్టీ శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా ఇప్పిలి సీతరాజును ఆ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ ప్రకటించారు. శ్రీకాకుళం అసెంబ్లీ అభ్యర్థిగా రాగోలు నాగశివ, టెక్కలి నియోజకవర్గ అభ్యర్థిగా బైపల్లి పరమేశ్వరరావు, పలాస అసెంబ్లీ అభ్యర్థిగా బద్రీ సీతమ్మలు బరిలో దిగనున్నట్లు ఆయన చెప్పారు. తమపై నమ్మకం ఉంచి టికెట్లు కేటాయించిన అధ్యక్షుడికి వారు కృతజ్ఞలు తెలిపారు.
ఎచ్చెర్లలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో ప్రతి నెలా మొదటి శనివారం నిర్వహిస్తున్న డయల్ యువర్ యూనివర్సిటీ కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు రిజిస్టర్ పి.సుజాత తెలిపారు. ఈ మేరకు యూనివర్సిటీ నుంచి శుక్రవారం ఒక ప్రకటన జారీ చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున కార్యక్రమం రద్దు చేశారు. ఎన్నికల కోడ్ ముగిశాక ఈ కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని అని ప్రకటనలో పేర్కొన్నారు.
త్వరలో జరగనున్న పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు స్వేచ్ఛగా శాంతియుతంగా, హింసా రహితంగా నిర్వహించడమే లక్ష్యంగా పని చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా.మనజీర్ జిలానీ సమూన్ అన్నారు. శుక్రవారం ఆయన మండలంలో పర్యటించారు. తహసీల్దార్ కార్యాలయాల్లో ఎన్నికల ఏర్పాట్లపై ఆరా తీశారు. అనంతరం ఎఫ్ఎస్టీ బృందాల పనితీరును పరిశీలించి అనంతరం సంబంధిత అధికారులకు కీలక సూచనలు చేశారు.
జైభారత్ నేషనల్ పార్టీ శ్రీకాకుళం జిల్లాలోని నాలుగు చోట్ల అసెంబ్లీ అభ్యర్థులను శుక్రవారం ప్రకటించింది. పలాస -బద్రి సీతమ్మ యాదవ్, టెక్కలి -బైపల్లి పరమేశ్వర్ రావు, శ్రీకాకుళం-రాగోలు నాగ శివ, రాజాం -కుపిలి చైతన్య కుమార్ లు పోటీ చేయనున్నారు.
శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఈ నెల అన్ని రకాల పింఛన్లు కలిపి మొత్తం 3,21,689 మందికి సంబంధించి సొమ్ము విడుదల చేశారు. గురువారం 2,77,353 (86.22శాతం) అందించారు. ఇంకా 44,336 మందికి పింఛన్ డబ్బులను అందించాల్సి ఉంది. సంతబొమ్మాళి (81.40 శాతం), లావేరు (81.56 శాతం), కోటబొమ్మాళి (81.59 శాతం), ఎల్‌ఎన్‌పేట (82.57 శాతం), గార (83.02 శాతం), సోంపేట (83.76 శాతం), తదితర మండలాలు పంపిణీలో అట్టడుగున ఉన్నాయి.
శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం నియోజకవర్గానికి 1952 నుంచి 2019 వరకు మొత్తం 16 సార్లు ఎన్నికలు జరిగాయి. 1952లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన పెంటన్నాయుడు, కెఎల్పి ఎమ్‌ఎస్‌నారాయణపై 81 ఓట్ల అతి స్వల్ప మెజార్టీతో గెలుపొందారు. అలాగే 1989లో కె.మోహన్‌రావు (టీడీపీ), డి.నారాయణరావు (కాంగ్రెస్)పై 274 ఓట్లతో ఓడించి MLA అయ్యారు.
సంతబొమ్మాళి మండలం కాకరాపల్లికి చెందిన రమేశ్(31), సురేశ్ (25) అన్నదమ్ములు. గురువారం రాత్రి రమేశ్ టీ షర్ట్ ను సురేశ్ వేసుకున్నాడు. దీంతో వారి మధ్య ఘర్షణ జరిగింది. రమేశ్‌ను తమ్ముడు సురేశ్ నెట్టివేయడంతో తలకు రాయి తగిలి, తీవ్ర గాయమైంది. స్థానికులు శ్రీకాకుళంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం రమేశ్ మృతిచెందినట్లు ఎస్సై సిద్ధార్థ తెలిపారు.
శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా శుక్రవారం భానుడు భగభగమంటూ నిప్పులు చెరుగుతున్నాడు. ఎండతీవ్రతకు పట్టణంతో పాటుగా ఆమదాలవలస, రణస్థలం, ఎచ్చెర్ల, చిలకపాలెం, టెక్కలి, రాజాం, పొందూరు ప్రధాన రహదారులపై జనసంచారం పలుచబడింది. ఎండ వేడిమికి వృద్ధులు, పిల్లలు, వాహనదారులు అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.