India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
*24న టెక్కలిలో సీఎం జగన్ బస్సుయాత్ర ముగింపు
*శ్రీకాకుళం నుంచి భద్రాచలానికి ప్రత్యేక బస్సులు
* 22న అచ్చెన్నాయుడు నామినేషన్
*శ్రీకాకుళం: ఉరేసుకుని మహిళ ఆత్మహత్య
* నందిగం రహదారిపై కారు బోల్తా
*చంద్రబాబు ప్రజలను మోసం చేశాడు: ధర్మాన
*దిల్లీలో పాలకొండ సైనికుడు మృతి
*కొత్తూరు: ఆర్టీసీ బస్సులో గంజాయి లభ్యం
*15న పలాసకు చంద్రబాబు రాక
* రాజాంలో రూ.20 లక్షల నగలు స్వాధీనం
* నరసన్నపేటలో వాలంటీర్ల రాజీనామా
ఎన్నికలకు సంబంధించి ఏ అంశంపై నైనా సందేహాలు నివృత్తి చేసుకునేందుకు, ఫిర్యాదులు చేయడానికి జిల్లా కలెక్టరేట్‌లో టోల్ ఫ్రీ నంబరు 1950ను ఏర్పాటు చేశారు. ఎన్నికలకు సంబంధించి ఎవరైనా ఓటరు తమ సందేహాలు నివృత్తి చేసుకోవడానికి ఈ నంబరుకు ఫోన్ చేస్తే చాలు సమాధానం ఇచ్చేందుకు సిబ్బంది సిద్ధంగా ఉంటారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. ఫిర్యాదులు చేసేందుకు ప్రతి పౌరునికి హక్కు ఉంది.
ఎన్నికల ప్రక్రియ శాంతియుతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి డా.మనజీర్ జీలాని సమూన్ అన్నారు. ఈవీఎంల ర్యాండమైజేషన్ పూర్తి అయినందున వాటిని సంఘాల తరలింపు ప్రక్రియను కార్యక్రమాన్ని శనివారం చేపట్టారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద జరుగుతున్న ప్రక్రియను రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఎన్నికల కమిషన్ నిబంధనలను ప్రతి ఒక్కటి విధిగా పాటించాలన్నారు.
పాలకొండ మండలం గొట్ట మంగళాపురం గ్రామానికి చెందిన సామంతుల రాంబాబు (31) ఢిల్లీలో సీఐఎస్ఎఫ్ జవాన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల జరిగిన హోలీ సంబరాల్లో విద్యుత్ షాక్‌కు గురై ఢిల్లీలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందారని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కాగా మృతునికి 8 నెలల క్రితమే వివాహమైంది. నేడు ప్రత్యేక విమానంలో సైనికుని మృతదేహం స్వగ్రామానికి తీసుకురానున్నారు.
రాజాం మండలం పొగిరి గ్రామం వద్ద ఏర్పాటు చేసిన ఎలక్షన్ చెక్ పోస్ట్ వద్ద రాజాo సిఐ దాడి మోహన్ రావు రూ.20 లక్షలు విలువచేసే 25 కేజీల వెండిని స్వాధీనం చేసున్నారు. విశాఖ నుంచి పాలకొండ వైపు వస్తున్న బస్సులో తనిఖీ చేయగా.. వారి వద్ద ఎటువంటి పత్రాలు లేకపోవడంతో వాటిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. ఇందులో భాగంగా ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు తెలిపారు.
నందిగం మండలం జాతీయ రహదారిపై శనివారం ఉదయం కార్ అదుపుతప్పి బోల్తా పడింది. పైడి భీమవరం నుంచి పలాస వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పలాసలో జరుగు శుభకార్యానికి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు కారు బుక్ చేసుకుని వెళ్తున్నట్టు సమాచారం. ఈ ప్రమాదంలో కారులో ఉన్నవారికి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటనపై నందిగం పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
శ్రీకాకుళం మండల పరిధిలోని డీసీసీబీ కాలనీలో నివాసం ఉంటున్న కింతలి శ్రీవాణి (30) శుక్రవారం తన ఇంటిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు ..శ్రీవాణి, ఆమె భర్త హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పనిచేసేవారు. కోవిడ్ తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. అయితే ఆమెకు పిల్లలు లేకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు.
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లా పర్యటన ఖరారు అయ్యింది. ఈనెల 15న రాజాంలో సభ నిర్వహించిన అనంతరం టెక్కలి, పలాసలో జరిగే టీడీపీ ‘ప్రజాగళం’ సభకు చంద్రబాబు నాయుడు హాజరవుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు టీడీపీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. అధినేత ఎన్నికల ప్రచారానికి వస్తుండడంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.
శ్రీకాకుళం జిల్లాలో ఈ నెల 15వ తేదీ నుంచి జూన్ 14వ తేదీ వరకు చేపల వేట నిషేధిస్తున్నట్లు ఫిషరీస్ డిపార్ట్మెంట్ డీడీ శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. సుమారు 61 రోజులు పాటు సముద్ర జలాలలో చేపల వేట నిషేధం అమలులో ఉంటుందన్నారు. ఈ రెండు నెలల సమయం చేపలు సంతానోత్పత్తిని పెంచేందుకు ఉపయోగపడుతుందన్నారు.
వైసీపీ అధినేత, సీఎం జగన్ చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ఈనెల 24న టెక్కలి చేరనుంది. ఈ యాత్ర ఆ రోజే ముగియనుంది. ఈ మేరకు వైసీపీ ఉత్తరాంధ్ర కన్వీనర్ వైవీ సుబ్బారెడ్డి శుక్రవారం జగన్ పర్యటన వివరాలను వెల్లడించారు. ఎన్నికల ప్రచారం నేపథ్యంలో సీఎం టెక్కలి రానుండడంతో పార్టీ నాయకులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.