India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వేసవిలో ప్రజలకు నీటి కొరత లేకుండా సంబంధిత అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ మందిరంలో సంబంధిత సిబ్బందితో సమావేశం నిర్వహించారు. మంచినీటి పథకాలు పని చేయలేదనే ఫిర్యాదు ఒక్కటీ ఉండకూడదన్నారు. నీటి నాణ్యతను గురించి పరీక్షలు నిర్వహించాలని చెప్పారు.
పలాస మండలం కిష్టుపురం గ్రామానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు బుర్లె జగ్గారావు శుక్రవారం ఉదయం అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. దివంగత నేత అప్పయ్య నుంచి నేటి తరం రాజకీయ నాయకులతో పాటు పరోక్ష రాజకీయాల్లో పాలు పంచుకుంటూ తనదైన ముద్ర వేసుకున్నారు. ఆయన మరణ వార్త విన్న సమీప గ్రామ ప్రజలు, ఆయన వద్ద విద్యాబుద్ధులు నేర్చుకున్న విద్యార్థులు వేలాదిమంది తరలివచ్చి అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో జరిగిన సమావేశంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్ల మన పార్టీ కార్యకర్తలని అన్నారు. నామినేషన్ రోజు 25 మంది వాలంటీర్లను తీసుకురావాలని కోరారు. వాలంటీర్లను రాజీనామాలు చేయించండి అని కార్యకర్తలకు సూచించారు. వాలంటీర్లతో పని చేయించాలని జిల్లాలోని ఆ పార్టీ కేడర్‌కు సూచించారు. మళ్ళీ మన ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
మొదటి విడత ఇవిఎం రెండమనైజేషన్ ప్రక్రియ నిర్దేశిత వెబ్సైట్లో పూర్తి అయిందని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డా. మనజీర్ జీలాని సమూన్ అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరంలో ఈ.యమ్.ఎస్ 2.ఓ నిర్దేశిత వెబ్సైట్లో మొదటి విడత ఇవిఎం రెండమనైజేషన్ ప్రక్రియ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పూర్తయినట్లు జిల్లా కలెక్టర్ స్పష్టం చేసారు..
ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో సీఐ దాడి మోహన్ రావు ఆధ్వర్యంలో శుక్రవారం రాజాం మండలం పొగిరి చెక్ పోస్ట్ వద్ద పాలకండ్యం నుంచి రాజాం వెళ్తున్న కారులో తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీల్లో రూ.5,23,300 గుర్తించారు. సంబంధిత నగదుకు ఎటువంటి పత్రాలు చూపించకపోవడంతో స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
హోం ఓటింగ్ కు సానుకూలంగా ఉన్న 85 సంవత్సరాలు పైబడిన, అలాగే దివ్యాంగ ఓటర్ల వివరాలను ఆయా ఆర్వోలకు అందజేయాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ తెలిపారు. ఏ ఒక్కరు కూడా ఓటు వేయలేక పోయామని బాధపడే పరిస్థితి ఉండకూడదన్నదే దీని ప్రధాన ఉద్దేశ్యమన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం ఉదయం సంబంధిత అధికారులకు ఒరియంటేషన్ కార్యక్రమం నిర్వహించి, అవగాహన కల్పించారు.
శ్రీకాకుళం జిల్లాలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలను 18,249 మంది రాయగా.. వారిలో 10,408 మంది ఉత్తీర్ణత సాధించారు. 57 శాతంతో రాష్ట్రంలో 21వ స్థానంలో నిలిచింది. సెకండియర్‌లో 16,769 మందికి 11,300 మంది పాసయ్యారు. 67%తో 24వ స్థానంలో ఉంది.
లావేరు మండలం వెంకటాపురం జంక్షన్ వద్ద శుక్రవారం ఉదయం ఎచ్చెర్ల ఎమ్మెల్యే వాహనాన్ని ఫ్లయింగ్ స్కాడ్ తనిఖీ చేపట్టింది. ఎలక్షన్ క్యాంపెనింగ్‌కి వెళ్తున్న ఎమ్మెల్యే వాహనంతో పాటు ఇతర వాహనాలను కూడా లావేరు, జి.సిగడాం ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు. రెండు మండలాలలో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నట్లు వారు తెలిపారు. ఈ తనిఖీలలో ఏవో ఉషారాణి, ఏఎస్ఐ రామారావు, పోలీస్ సిబ్బంది, పాల్గొన్నారు.
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలను శుక్రవారం ఉదయం 11 గంటలకు ఇంటర్ బోర్డు వెల్లడించేందుకు ఏర్పాట్లు చేసింది. శ్రీకాకుళం జిల్లాలో 45,702 మంది విద్యార్థులు ఇంటర్ ఫలితాలు కోసం ఎదురుచూస్తున్నారు. వీరిలో జనరల్ విద్యార్థులు 43,071 మంది, ఒకేషనల్ విద్యార్థులు 2,631 మంది ఉన్నారు. మొదటి సంవత్సరం విద్యార్థులు 19,937 రెండో సంవత్సరం విద్యార్థులు 25,765 మంది ఉన్నారు. ఫలితాలు వెల్లడిపై విద్యార్థుల్లో ఆసక్తి నెలకొంది.
ఎన్నికల ప్రవర్తన నియమావళిని తప్పనిసరిగా పాటించాలని డీఎస్పీ శ్రీనివాస్ చక్రవర్తి అన్నారు. రేగిడి ఆమదాలవలస మండల పరిధిలో సోమరాజుపేట గ్రామంలో ఎన్నికలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రజలకు ఎన్నికల నిబంధనలు, ప్రవర్తన నియమావళి, సి-విజిల్ యాప్, బైండోవర్ షరతుల గురించి వివరించారు. ఎన్నికల సమయంలో తగాదాలు పడవద్దని, పోలీసులకు సహకరించాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దని డీఎస్పీ విజ్ఞప్తి చేశారు.
Sorry, no posts matched your criteria.