India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రస్తుత వేసవిలో ఎక్కడా తాగునీటికి ఎటువంటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ సిబ్బందికి ఆదేశించారు. తాగునీటి చెరువులను, సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను పూర్తిస్థాయిలో నింపుకోవాలని, నీటి నిల్వలకు అనుగుణంగా వేసవి మొత్తం సరఫరాకు చేసేలా ప్రణాళికలు తయారు చేయాలన్నారు. రానున్న రోజులలో వేడి గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో అప్రమత్తంగా ఉండాలన్నారు.
పదో తరగతి జవాబుపత్రాల మూల్యాంకనం ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. శ్రీకాకుళం ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల, సమీపంలోనే మహాలక్ష్మినగర్ కాలనీలో ఉన్న శ్రీచైతన్య పాఠశాల కేంద్రాలుగా స్పాట్ వాల్యుయేషన్ మొదలైంది. తొలిరోజు 7 సబ్జెక్టుల పేపర్ల మూల్యాంకనం చేపట్టారు. 1210 మంది హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, సిబ్బంది మూల్యాంకనంలో పాల్గొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 8 రోజుల్లో పూర్తిచేసేలా అధికారులు చర్యలు చేపట్టారు.
ఇద్దరేసి సభ్యులు ప్రాతినిధ్యం వహించే వాటిని ద్విసభ్య నియోజకవర్గాలు అంటారు. ఇవి పార్లమెంటుకే కాక, రాష్ట్ర శాసనసభలకూ ఉండేవి. బ్రిటిషు వారు ప్రవేశపెట్టిన ఈ వ్యవస్థ స్వాతంత్రం తరువాత కూడా కొనసాగింది. ఒక నియోజకవర్గం నుంచి ఇద్దరు అభ్యర్థుల్లో ఒకరు జనరల్, ఎస్సీ-ఎస్టీ వర్గానికి చెందినవారు ఉంటారు. ఈవ్యవస్థలో లోపాలు ఉండటంతో కాంగ్రెస్ 1961లో రద్దు చేసింది. 1952లో పాతపట్నం ద్విసభ్య ఎన్నికలు జరిగాయి.
సరుబుజ్జిలి మండలం వెన్నెల వలస వద్ద ఉన్న జవహర్ నవోదయ పాఠశాలకు 80 మంది విద్యార్థులు తాత్కాలికంగా ఎంపికైనట్లు నవోదయ ప్రిన్సిపల్ దాసరి పరశురామయ్య సోమవారం తెలిపారు. ఇటీవల నవోదయ నిర్వహించిన ప్రవేశ పరీక్ష లకు 7,170 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ ఫలితాలను ఆన్లైన్లో ఉంచామని పేర్కొన్నారు. వారంతా ఈ నెల 3వ తేదీన విద్యాలయంలో హాజరుకావాలని సూచించారు.
శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం మెట్టూరు గ్రామంలోని ఓ పాడుబడిన ఇంటిలోకి మంగళవారం తెల్లవారుజామున ఎలుగుబంటి చొరబడి హల్చల్ చేసింది. గమనించిన స్థానికులు భయంతో వణుకుతూ అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఇటీవల కాలంలో ఎలుగుబంటి దాడిలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా ఓ మహిళ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఘటన స్థలానికి చేరుకున్న అటవీశాఖ సిబ్బంది ఎలుగుబంటిని బంధించే ప్రయత్నం చేస్తున్నారు.
ఈనెల 4వ తేదీ నుంచి అంగన్వాడీ కేంద్రాలకు ఒంటిపూట సెలవులు ఇస్తున్నట్లు ఐసీడీఎస్ సీడీపీఓ బి.శాంతి శ్రీ సోమవారం తెలిపారు. వేసవి నేపథ్యంలో జిల్లాలోని 16 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో అన్ని కేంద్రాలకు ఈ నెల 31వ తేదీ వరకు ఒంటిపూట సెలవులు ఉంటాయన్నారు. అంగన్వాడీ కేంద్రాలు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తెరవాల్సి ఉంటుందన్నారు. సాయంత్రం నాలుగు గంటల వరకు కార్యకర్త కేంద్రంలో ఉండాలన్నారు.
సార్వత్రిక ఎన్నికలు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ కె.వి.రాజేంద్రనాథ్ రెడ్డి ఎన్నికల దృష్ట్యా శాంతి భద్రతల పరిరక్షణ, సమాచారం సేకరణ వంటి అంశాలపై సోమవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ లో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో జిల్లా నుంచి ఎస్పీ జీ.ఆర్ రాధిక, ఏఎస్పీ ప్రేమ్ కాజల్ పాల్గొన్నారు. అనంతరం ఏపీ డీజీపీ జిల్లాలోని పోలింగ్ వద్ద భద్రత వంటి పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు.
సామాజిక పెన్షన్ల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ చెప్పారు. జిల్లాలో 732 సచివాలయాల ద్వారా ఒక్కో సచివాలయానికి సగటున 456 చొప్పున పెన్షన్లను పంపిణీ చేయవలసి ఉంటుందన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లతో సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు జిల్లా నుంచి కలెక్టర్ హాజరయ్యారు.
కళాశాల, పాఠశాల, వసతి గృహలకు వచ్చిన విద్యార్థి విద్యార్థినీలు ప్రవర్తనను ప్రతి నిమిషం సీసీటీవీ కెమెరాల ద్వారా పర్యవేక్షించాలని ఎస్పీ రాధిక సూచించారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో ఆమె జిల్లాలోని వివిధ కళాశాలలు యాజమాన్యంతో విద్యార్థులు భద్రత, ఆత్మహత్యలు నివారణ వంటి అంశాలపై సమీక్ష నిర్వహించారు. బోధనేతారా సిబ్బంది విద్యార్థి విద్యార్థినీలను కౌన్సెలింగ్ నెపంతో పిలిస్తే కాలేజ్ యాజమాన్యంకు చెప్పాలన్నారు.
ఎన్నికల్లో విధులు నిర్వహించే ప్రతి ఉద్యోగికి పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల నిర్వహణ అధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. ఆయన విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో హాజరయ్యారు. ఈ మేరకు జిల్లా ఎన్నికల అధికారి డా.మనజీర్ జిలానీ సమూన్ హాజరయ్యారు. ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ అండ్ హోం ఓటింగ్‌కు సంబంధించి అధికారుల బాధ్యతలు, నిర్వహించాల్సిన విధులపై సూచనలు చేశారు.
Sorry, no posts matched your criteria.