India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పాలకొండ నగర పంచాయతీ పరిధిలోని కోనేరులో సోమవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో స్నానం కోసం వెళ్లిన మింది ప్రభాస్(18) గల్లంతయినట్లు పాలకొండ అగ్నిమాపక అధికారి జె.సర్వేశ్వరరావు తెలిపారు. కోనేరులో ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. చెరువు గట్టుపై సదరు ప్రభాస్ బట్టలు ఉన్నాయని వాటిని తండ్రి లక్ష్మణరావు గుర్తించినట్లు వెల్లడించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
జిల్లా వ్యాప్తంగా పనస పంట సాగుచేస్తున్న ఉద్దానం ప్రాంతంలో పండే పనసకు మంచి గిరాకీ ఉంటుంది. కవిటి, కంచిలి, సోంపేట, ఇచ్ఛాపురం మండలాల్లో సుమారు 300 ఎకరాల్లో పనస పంట సాగు చేస్తుండగా.. 600 నుంచి 650 టన్నుల వరకు దిగుబడి వస్తోంది. ఈ పంట ఎక్కువగా ఒడిశా రాష్ట్రం బరంపురం, భువనేశ్వర్, కటక్ తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తుండగా, కొద్ది మొత్తంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం తరలిస్తున్నారు.
తన కుమార్తెను ఓ వ్యక్తి వేధిస్తున్నారంటూ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు టెక్కలి సీఐ పి. పైడయ్య ఆదివారం పోక్సో కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. భగవాన్ పురం గ్రామానికి చెందిన మహిళా డిగ్రీ కాలేజ్ కళాశాల మైదానానికి బాలిక వచ్చి వెళ్తుండగా టెక్కలికి చెందిన యువకుడు వేధిస్తుండేవాడని, దీనిపై బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ పైడియ్య కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
గత ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి జిల్లాలో 1,54,798 మంది రైతుల నుంచి 4,49,181 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు జిల్లా కలెక్టర్ మనజీర్ జిలాని సమూన్ ఆదివారం తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన రైతులకు గాను రూ.980.56 కోట్లు రైతుల ఖాతాలో జమ చేశామన్నారు. రైతులకు రవాణా ఇతర ఖర్చులు కూడా ఇందులోనే చెల్లించామని పేర్కొన్నారు.
జిల్లాలో ఈనెల 3వ తేదీ నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ మనజీర్ జిలాని సమూన్ ఆదివారం తెలిపారు. ఎన్నికల నియమావళి అమలులో ఉన్నంతవరకు వాలంటీర్ల ద్వారా పింఛన్లు పంపిణీ చేయకూడదని వివరించారు. సచివాలయాల్లోనే పింఛన్ల సొమ్ము ఇస్తారని లబ్ధిదారులు ఆధార్ లేదా ఏదైనా గుర్తింపు కార్డు తీసుకుని వెళ్లి పింఛన్లు పొందవచ్చని సూచించారు.
పదో తరగతి పబ్లిక్ పరీక్షలు-2024 జవాబుపత్రాల మూల్యాంకన ప్రక్రియకు సర్వం సిద్ధమైందని డీఈఓ వెంకటేశ్వరరావు తెలిపారు. జిల్లాలో ఏప్రిల్ 1 నుంచి మొదలయ్యే మూల్యాంకనానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 8 రోజుల్లో స్పాట్ పూర్తి చేసేలా జిల్లా యంత్రాంగం పక్కాగా సన్నద్ధమైందన్నారు. తాగునీరు, ఫర్నీచర్, లైటింగ్, ఫ్యాన్లు, ఇతర మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంచమన్నారు.
టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు తల్లి కళావతమ్మ ఇవాళ మధ్యాహ్నం చనిపోయిన విషయం తెలిసిందే. కోటబొమ్మాళి మండలం నిమ్మాడలోని అచ్చెన్న నివాసానికి కింజరాపు అభిమానులు, టీడీపీ కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. పలాస మాజీ ఎమ్మెల్యే గౌతు శ్యాంసుందర్ శివాజీ, గౌతు శిరీష తదితర టీడీపీ నేతలు కళావతమ్మ భౌతికదేహానికి నివాళులార్పించారు. కింజరాపు సోదరులను పరామర్శించారు.
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు తల్లి కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో కింజరాపు కళావతమ్మ (90) ఇవాళ మధ్యాహ్నం చనిపోయారు. కళావతమ్మకు ముగ్గురు ఆడపిల్లలు, నలుగురు మగపిల్లలు. ఆమె మరణంతో కింజరాపు ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
నరసన్నపేట మండలం మడపాం టోల్ గేట్ వద్ద నేటి నుంచి పెరిగిన టోల్ గేట్ ఛార్జీలు అమలు చేస్తున్నారు. ప్రతి వాహనంపై రూ.5 వరకు టోల్ ఛార్జీలు పెంపు అర్ధరాత్రి నుంచి అమలోనికి వచ్చాయి. దీంతో ఇచ్ఛాపురం నుంచి జిల్లా కేంద్రానికి రావాలంటే ఇచ్ఛాపురం, పలాస, మడపాం టోల్ గెట్ దాటాల్సి ఉంటుంది. దీంతో పెట్రోల్ ఛార్జీల కంటే టోల్ ఛార్జీలకే భారం ఎక్కువవుతుందని వాహనదారులు ఆవేదన చెందుతున్నారు.
శ్రీకాకుళం పట్టణంతోపాటు మండల కేంద్రాలు ప్రధాన కూడళ్ళు వద్ద చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ జిలాని సమూన్ శనివారం అధికారులకు సూచించారు. వేసవి ఎండలు తీవ్రత పెరుగుతున్నందున చలివేంద్రాలు ఏర్పాటు తప్పనిసరి అని అన్నారు. మున్సిపాలిటీ అధికారులు, తహశీల్దార్లు, ఎంపీడీవోలు చలివేంద్రాలు ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.