Srikakulam

News April 9, 2024

కంచిలి: చెరువులో పడి వ్యక్తి మృతి

image

కంచిలి మండల కేంద్రంలో మటన్ చెరువులో సోమవారం ప్రమాదవశాత్తు మునిగి బుడ్డేపు నీలాద్రి మరణించాడు. మృతుడు, అతని భార్య జానకి కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. బహిర్భూమికి కోసం వెళ్లిన నీలాద్రి చెరువులో ప్రమాదవశాత్తు మునిగి మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు కంచిలి ఎస్సై జి. రాజేష్ తెలిపారు.

News April 9, 2024

నీటి ఎద్దడి నివారణకు తక్షణ చర్యలు:కలెక్టర్

image

నీటి ఎద్దడి నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ అన్నారు. విజయవాడ నుంచి సోమవారం పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొన్నారు. నీటి సమస్యలు కోసం జిల్లాలో కంట్రోల్ రూమ్ నెంబర్లను 91001 20602, 63099 00660 ఏర్పాటు చేశామన్నారు.

News April 8, 2024

టెక్కలి: వడదెబ్బతో వృద్ధుడి మృతి

image

ఎండ తీవ్రతకు తట్టుకోలేక టెక్కలి మండలం మాధినివానిపేట గ్రామానికి చెందిన నక్క లచ్చయ్య(76) అనే వృద్ధుడు సోమవారం మృతి చెందాడు. ఆరుబయట స్నానానికి వెళ్లిన సమయంలో ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురై వృద్ధుడు కుప్పకూలిపోయాడు. గ్రామస్థులు అక్కడికి చేరుకున్న సపర్యలు చేసేలోపే వృద్ధుడు మృతి చెందాడు. ఎండ తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలని టెక్కలి జిల్లా ఆసుపత్రి వైద్యులు సూచిస్తున్నారు.

News April 8, 2024

టికెట్ మార్పుపై సర్వే చేపట్టడం సంతోషం: కలమట

image

పాతపట్నం నియోజకవర్గ TDP టికెట్ మార్పు విషయంపై పునఃపరిశీలన చేస్తోందని మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తి అన్నారు. ఈ మేరకు సోమవారం ఐవీఆర్ఎస్ నుంచి కాల్స్ వస్తున్నాయని స్పష్టం చేశారు. పార్టీ నేతల అభిప్రాయాలు తెలుసుకునేందుకు TDP అధిష్ఠానం ఉదయం నుంచి ఐవీఆర్ఎస్ సర్వే చేపడుతుందన్నారు. సీక్రెట్‌గా సర్వే చేయడంపై ఉత్కంఠ నెలకొంది. అయితే పాతపట్నం టికెట్ మామిడికి టీడీపీ కేటాయించిన విషయం తెలిసిందే.

News April 8, 2024

విధుల నిర్వహణలో నిర్లక్ష్యం తగదు:కలెక్టర్

image

విధుల నిర్వహణలో నిర్లక్ష్యం తగదని, ఫిర్యాదు వచ్చిన వెంటనే చర్యలు చేపట్టి 24 గంటల్లో దాని పరిష్కారించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మనజీర్ జిలానీ సమూన్ స్పష్టం చేశారు. సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఆర్ఓలు, ఎఆర్ఓలు, నోడల్ అధికారులతో వర్చువల్‌గా సమావేశం నిర్వహించారు. అధికారులు, సిబ్బంది ముందస్తు అనుమతులు లేకుండా వారు పని చేస్తున్న కేంద్రాన్ని విడిచి వెళ్లరాదన్నారు.

News April 8, 2024

రైతులు బాగుపడాలంటే టీడీపీ గెలవాలి:కొండ్రు

image

రాజాం నియోజకవర్గం సంతకవిటి మండల పరిధిలోని గోళ్లవలస గ్రామంలో ఏర్పాటు చేసిన జయహో బీసీ సమావేశంలో నియోజకవర్గం కూటమి అభ్యర్థి కొండ్రు మురళి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు ప్రభుత్వం అంటూనే రాష్ట్రంలో జగన్ రైతులను నట్టేట ముంచారన్నారు. పంటలు ఎండిపోవడంతో పాటు పశువులకు తాగునీరు లేని దుస్థితి నెలకొందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు కోళ్ల అప్పలనాయుడు పాల్గొన్నారు.

News April 8, 2024

అరసవల్లి ఆదిత్యుని దర్శించుకున్న కార్తికేయ డైరెక్టర్

image

ప్రముఖ పుణ్యక్షేత్రం అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని సోమవారం ఉదయం కార్తికేయ సినిమా డైరెక్టర్ చందు మొండేటి స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన వారికి దేవాలయం అధికారులు ఘనస్వాగతం పలికి.. అనంతరం స్వామి వారి దర్శనం చేయించారు. ఆలయ అర్చకులు వారికి స్వామి వారి జ్ఞాపికను, తీర్థప్రసాదాలు అందజేశారు.

News April 8, 2024

పోలాకి: కూతురిని ఉగాదికి రమ్మని పిలిచొస్తూ మృతి

image

పోలాకి మండలం బార్జిపాడుకు చెందిన గురయ్య(70) నిన్న రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాల మేరకు.. శ్యామసుందరపురంలో ఉన్న కుమార్తెను ఉగాదికి రావాలని పిలవడానికి వెళ్లి.. తిరుగు ప్రయాణం అయ్యారు. అక్కవరం సమీపంలో రోడ్డు దాటుతుండగా వ్యాన్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే చనిపోయాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం టెక్కలి ఆస్పత్రికి తరలించారు.

News April 8, 2024

శ్రీకాకుళం: పోలింగ్‌ కేంద్రాలు పరిశీలన

image

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పోలింగ్‌ కేంద్రాలను టెక్కలి సబ్‌ కలెక్టర్‌ నూరుల్‌ కమర్‌ ఆదివారం పరిశీలించారు. మండలంలోని లింగాలవలస, శెలిగాం, పోలవరం, రాధవల్లభాపురం, గంగధరపేట, రావివలస, ధర్మనీలాపురం, తలగాం, తేలినీలాపురంలో పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎన్నికల సిబ్బంది ఉండేందుకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ఓటర్లకు కల్పించే సదుపాయాలను పర్యవేక్షించి పరిశీలించారు.

News April 7, 2024

పోలాకి: వాహన తనిఖీలలో రూ.78 వేల నగదు స్వాధీనం

image

పోలాకి మండలం జడూరు జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై నిర్వహిస్తున్న వాహన తనిఖీలలో భాగంగా నగదు స్వాధీనం చేసుకున్నామని ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి రాజు తెలిపారు. ఆదివారం అన్ని చెక్‌పోస్ట్‌ల వద్ద తనిఖీలు చేపట్టారు. పోలాకి వద్ద ఆటోలో ప్రయాణం చేస్తున్న ఒక మహిళ వద్ద నుంచి రూ. 78 వేల నగదు ఎటువంటి అనుమతులు రసీదులు లేకపోవడంతో స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ నగదును నరసన్నపేట ఎన్నికల అధికారికి అప్పగించామన్నారు.