India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శ్రీకాకుళం జిల్లాలో ఇంటర్మీడియట్ బోధిస్తున్న జూనియర్ కళాశాలలకు శుక్రవారం నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ప్రకటించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇటీవల ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ముగిసిన విషయం తెలిసిందే. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం మార్చి 28వ తేదీ వరకు పని దినాలుగా నిర్ణయించడంతో నేటి నుంచి జూనియర్ కళాశాలలు మూతపడనున్నాయి.
ఎచ్చర్ల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ లో లా కోర్సు కు సంబంధించిన పరీక్ష ఫలితాలు విడుదల చేసినట్లు ఎగ్జామినేషన్ డీన్ ఎస్.ఉదయ్ భాస్కర్ ఒక ప్రకటనలో గురువారం తెలిపారు. మూడేళ్ల ఎల్.ఎల్.బి,లో రెండో సెమిస్టర్, ఐదో సెమిస్టర్, ఐదేళ్ల కోర్సులో రెండో సెమిస్టర్, ఐదో సెమిస్టర్, తొమ్మిదో సెమిస్టర్ ఫలితాలు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ఫలితాలలో జ్ఞానభూమి పోర్టల్ లో అందుబాటులో ఉంచామన్నారు.
ఒక్క ఛాన్స్ ఇస్తే పాతపట్నం నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తానని కూటమి అభ్యర్థి మామిడి గోవిందరావు అన్నారు. టీడీపీ అధిష్ఠానం పాతపట్నం ఎమ్మెల్యే అభ్యర్థిగా మామిడి గోవిందరావును ప్రకటించిన అనంతరం తొలిసారి రావడంతో కూటమి సభ్యులతో కలిసి ర్యాలీగా శ్రీ నీలమణి దుర్గ అమ్మవారిని దర్శించుకుని, పాతపట్నం మామిడి గోవిందరావు క్యాంప్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు.
మండలంలోని చిన్ననారాయణపురానికి చెందిన సాలిన రాము(42) అనే వ్యక్తి గురువారం సాయంత్రం మృతి చెందాడు. గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబసభ్యులు హుటాహుటీన టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించగా అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు తెలిపారు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.
గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కన్వర్జెన్సీ పనులుపై పీఓ, ఎపీఓలు దృష్టి సారించాలని కలెక్టర్ మనజిర్ జిలాని సమూన్ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో
ఎన్ఆర్‌ఈజీఎస్‌పై సిబ్బందితో గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆయా గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న పనులపై మరింత దృష్టి సారించాలని ఆదేశించారు. వేతనాలు అందరికీ అందేలా చూడాలని ఆదేశించారు.
ఉత్తరాంధ్ర టీడీపీ సీనియర్ నాయకుల్లో కిమిడి కళా వెంకట్రావు ఒకరు. పొత్తులో భాగంగా ఆయన ఆశించిన ఎచ్చెర్ల సీటును BJPకి కేటాయించారు. విజయనగరం MP అభ్యర్థి కోసం చేసిన ఐవీఆర్‌ఎస్ సర్వేలో కూడా ఆయన పేరు లేదు. దీంతో ఆయన పోటీ చేసే స్థానంపై ఉత్కంఠ నెలకొంది. చీపురుపల్లిలో నుంచి బరిలో ఉంటారా..లేక ఉమ్మడి విజయనగరంలో TDP ప్రకటించిన 7 స్థానాల్లో ఒక అభ్యర్థిని మార్చి ఆ సీటు కళాకు కేటాయిస్తారా అన్నది తెలియాల్సి ఉంది.
మండలంలోని కొండభీంపురం గ్రామానికి చెందిన టీ.ఢిల్లీశ్వరరావు అనే వ్యక్తిపై విజయనగరం జిల్లా బొండపల్లిలో బుధవారం రాత్రి ఒక మహిళ పిర్యాదు మేరకు అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. 2021 నుంచి తనని ప్రేమించి ఇప్పుడు పెళ్లికి నిరాకరించి వేరే పెళ్లి చేసుకునేందుకు సిద్ధం అవుతూ.. తనని మోసం చేస్తున్నాడు మహిళ ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కె.లక్ష్మణరావు తెలిపారు.
ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తూ కారులో మద్యం సీసాలను తరలిస్తున్న అయిదుగురిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. శ్రీకాకుళం గ్రామీణ మండలం సింగుపురం రహదారిలో ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం తనిఖీల్లో కారులో ఆరు మద్యం సీసాలు ఉన్నట్లు గుర్తించి పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు వారిని అదుపులోకి తీసుకోవడంతో పాటు కారును సీజ్ చేసినట్లు రూరల్ ఎస్సై వాసుదేవరావు తెలిపారు.
ఎచ్చెర్ల నియోజకవర్గంలో మిత్ర పక్షాల ఎమ్మెల్యే అభ్యర్థిగా బీజేపీ నుంచి ఎన్. ఈశ్వరావును అధిష్ఠానం బుధవారం రాత్రి నిర్ణయించింది. వీరి స్వగ్రామం రణస్థలం మండలం బంటుపల్లి పంచాయితీ నడుకుదిటిపాలెం. అతని తండ్రి నడుకుదిటి అప్పలకొండ 1982 నుంచి టీడీపీలో ఉన్నారు. ఎన్. ఈశ్వరావు MBA, MCOM పూర్తి చేశారు. ఈయన విజయనగరం జిల్లా బీజేపీ అధ్యక్షులుగా పని చేస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
మండలంలోని మూగిపురం మండల పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న చౌదరి లక్ష్మీ నారాయణ ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారని, ఆయనపై చర్యలు తీసుకుంటామని నరసన్నపేట ఆర్వో జీవీఎస్ రామ్మోహన్ రావు తెలిపారు. ఈ మేరకు సారవకోట ఎంపీడీవో ఇచ్చిన నివేదిక మేరకు చర్యలు ఉంటాయని అన్నారు. దీనిపై జిల్లా ఎన్నికల అధికారి కూడా నివేదించడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.
Sorry, no posts matched your criteria.