India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
టెక్కలి చేరివీధి సమీపంలో బుధవారం విద్యుత్ షాక్‌తో ఎన్డీఆర్ కాలనీకి బతకల పోతయ్య(58) అనే వ్యక్తి మృతిచెందాడు. స్థానికంగా ఉన్న ఒక గోడౌన్ మెడపైన పనిచేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ హై టెన్షన్ మెయిన్ లైన్‌కు తగిలి షాక్‌కు గురై తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హుటాహుటీన108లో టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. అతడికి భార్య జయ, సంతోష్, ఇంద్రజ అనే కుమారుడు, కుమార్తె ఉన్నారు.
జమ్మూకశ్మీర్ ఉగ్రదాడిలో అసువులు బాసిన వీర జవాన్ జగదీశ్వరరావు మృతదేహాన్ని తన సొంత గ్రామమైన నందిగాం మండలం వల్లభరాయుడుపేటకు ఆర్మీ అధికారులు తీసుకువచ్చారు. టెక్కలి నుంచి వల్లభరాయుడిపేట వరకు అంతిమ యాత్ర నిర్వహించి తమ బంధువుల సమక్షంలో అధికారిక లాంఛనాలతో వీర జవాన్‌కు తుది వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఆర్మీ జవాన్లు పాల్గొని సంతాపం తెలిపారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
మండలంలోని సుందరాడ గ్రామానికి చెందిన బోరోడ మధు అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తాను ఓ అమ్మాయిని ప్రేమించానని పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులకు చెప్పగా ఇటీవల కుమార్తె వివాహం జరగడం, అతని పెద్దమ్మ మృతి చెందడం, ఆచార సంప్రదాయాల ప్రకారం ప్రస్తుతానికి కుదరదని చెప్పడంతో ఆగ్రహానికి గురై సోమవారం రాత్రి పురుగుమందు తాగాడు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.
శ్రీకాకుళంలోని బలగ ప్రభుత్వ DLTC, ITI లో ఈ నెల 19న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కొత్త లంక సుధా ఓ ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ మేళాలో రెండు ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగుల కోసం ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నామన్నారు. పదో తరగతి ఆపై విద్యా అర్హతలు ఉన్న నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
సంతబొమ్మాళి మండలం మూలపేటలో ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. మూలపేటతో పాటు ఏపీలోని మరో 3 ప్రాంతాల్లో చిన్నతరహా ఎయిర్‌పోర్ట్‌లు నిర్మించేందుకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చంద్రబాబు తాజాగా ప్రతిపాదనలు పంపించారు. 1,800 ఎకరాల భూమి అవసరమవుతుందని ప్రభుత్వానికి AAI వర్గాలు తెలిపాయి. ఆశాఖ మంత్రిగా రామ్మోహన్ ఉండటంతో వేగంగా ఆచరణలోకి రావొచ్చనే చర్చలు ఊపందుకున్నాయి.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రేపు బుధవారం శ్రీకాకుళం జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) తెలిపింది. ఈ మేరకు APSDMA ఎండీ రోణంకి కూర్మనాథ్ తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. అటు పొరుగున ఉన్న పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాలలో సైతం రేపు అక్కడక్కడ వర్షాలు పడతాయని కూర్మనాథ్ చెప్పారు.
ప్రయాణికుల రద్దీ మేరకు శ్రీకాకుళం, పలాస మీదుగా తిరునల్వేలి(TEN), షాలిమార్(SHM) మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే(SCR) పేర్కొంది. ఈ మేరకు నం.06087 TEN- SHM ట్రైన్‌ను జులై 18, 25 తేదీలలో, నం.06088 SHM- TEN ట్రైన్‌ను జులై 20, 27 తేదీలలో నడపనున్నట్లు SCR తెలిపింది. ఈ ట్రైన్లు ఏపీలో విజయనగరం, దువ్వాడ, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు తదితర స్టేషన్లలో ఆగుతాయని పేర్కొంది.
BR అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ విద్యార్థులకై(ఇయర్ ఎండ్) స్పెషల్ డ్రైవ్ పరీక్షల నోటిఫికేషన్ మంగళవారం విడుదలైంది. 2011-15 మధ్య అడ్మిషన్ తీసుకున్న డిగ్రీ విద్యార్థులు రాయాల్సిన ప్రాక్టికల్, థియరీ పరీక్షలకై విద్యార్థులు ఆగస్టు 14లోపు ఫీజు చెల్లించాలని వర్శిటీ సూచించింది. ఆగస్టు 22 నుంచి ప్రాక్టికల్స్, సెప్టెంబరు 3 నుంచి థియరీ పరీక్షలు జరుగుతాయని, వివరాలకు వర్శిటీ అధికారిక వెబ్సైట్ చూడాలంది.
కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు జమ్మూకశ్మీర్‌లోని అనంత్ నాగ్‌లో ఉగ్రవాదుల దాడులలో వీరోచితంగా పోరాడి అమరులైన జిల్లాకు చెందిన జవాన్లు డి.రాజేశ్, జగదీశ్వర్ రావుకు జోహార్లు అర్పించారు. వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ విషయం వారి కుటుంబాలతో మాట్లాడి పార్థివ దేహాలను స్వస్థలాలకు చేర్చేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని, వారికి అండగా ఉంటాం అని భరోసా ఇచ్చారు.
జమ్మూకాశ్మీర్ ప్రాంతంలో సోమవారం జరిగిన ఉగ్రవాదుల దాడిలో టెక్కలి నియోజకవర్గానికి చెందిన సనపల జగదీశ్వరరావు, డొక్కరి రాజేష్ అనే ఇద్దరు సైనికులు మృతిచెందడం తీవ్ర బాధాకరం అని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఈమేరకు ఆయన క్యాంపు కార్యాలయం నుంచి వివరాలు వెల్లడించారు. దేశసేవలో సైనికులుగా ఉన్న జవాన్లు మృతిచెందడం చాలా బాధాకరం అన్నారు.
Sorry, no posts matched your criteria.